సోనియాతో వీహెచ్ భేటీ, తాజా పరిస్థితులపై వివరణ | congress sr leader v.hanumatharao meets sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియాతో వీహెచ్ భేటీ, తాజా పరిస్థితులపై వివరణ

Published Fri, Jul 3 2015 10:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సోనియాతో వీహెచ్ భేటీ,  తాజా పరిస్థితులపై వివరణ - Sakshi

సోనియాతో వీహెచ్ భేటీ, తాజా పరిస్థితులపై వివరణ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా పీసీసీ మాజీ చీఫ్ డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అంశంతో పాటు, తాజా పరిస్థితులపై వివరిస్తున్నట్లు సమాచారం.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ నయవంచకుడని, కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని, తనకు అన్యాయం చేశారని డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని.. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్‌ఎస్‌లో చేరతానని ఆయన చెప్పారు. గురువారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement