
కిరణ్ హీరో కాదు జీరోనే: వీహెచ్
రాష్ట్ర విభజన అడ్డుకుని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలలో హీరో కావాలని చూస్తున్నారని, కానీ ఆయన జీరో కాక తప్పదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. సీఎం ఎన్ని ప్రయత్నాలు చేసిన తెలంగాణ రాష్ట్రం మాత్రం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి ఓటు వేసి ఆ రుణం తీర్చుకుంటారన్నారు. విభజన బిల్లు భోగి మంటల్లో వేయాలన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబుపై వి.హన్మంతరావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల సహనాన్ని అశోక్బాబు పరీక్షిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కామారెడ్డి నుంచి ప్రారంభిస్తామన్నారు.