రేవంత్కు గవర్నర్ ప్రశంసలా? | congress mp hanumantharao takes on governor narasimhan | Sakshi
Sakshi News home page

రేవంత్కు గవర్నర్ ప్రశంసలా?

Published Tue, Oct 20 2015 1:40 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

రేవంత్కు గవర్నర్ ప్రశంసలా? - Sakshi

రేవంత్కు గవర్నర్ ప్రశంసలా?

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్పై రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విరుచుకుపడ్డారు. తన పాలనలో అవినీతి లేదన్న గవర్నర్...సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గవర్నర్ ఎందుకు స్పందించడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డికు గవర్నర్ ప్రశంసలా అని వీహెచ్ ఎద్దేవా చేశారు.

కాగా  రేవంత్ రెడ్డి  తెలంగాణ టీడీపీ ప్రతినిధులతో కలిసి సోమవారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రేవంత్ ధైర్యవంతుడంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు.  గతంలో అసెంబ్లీలో తన కుర్చీలాగిన ఘటనను గుర్తు చేస్తూ గవర్నర్ ఈ మాటలు అన్నారు. దీనిపై టీడీపీ నాయకులు గవర్నర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా. రేవంత్ గురించి నాకు బాగా తెలుసంటూ గవర్నర్ వారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement