నోట్ల రద్దుపై క్షేత్రస్థాయి పోరు: వీహెచ్‌ | Vh comments on Demonitaisation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై క్షేత్రస్థాయి పోరు: వీహెచ్‌

Published Tue, Jan 3 2017 2:33 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

నోట్ల రద్దుపై క్షేత్రస్థాయి పోరు: వీహెచ్‌ - Sakshi

నోట్ల రద్దుపై క్షేత్రస్థాయి పోరు: వీహెచ్‌

సాక్షి, హైదరాబాద్‌: పెద్దనోట్లను రద్దు చేసి 50 రోజులు దాటినా పేదలకు కష్టాలు తీరలేదని, ప్రధాని మోదీ వైఫల్యంపై క్షేత్ర స్థాయిలో పోరాడతామని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో వచ్చిన దుష్ఫలి తాలను ప్రజలకు వివరించడానికి ఊరూరా యాత్ర చేయను న్నట్టు వీహెచ్‌ ప్రకటించారు. నోట్లరద్దుతో ఏదో సాధిస్తామన్న మోదీ చేసిందేమిటో స్పష్టం చేయాలన్నారు.

గవర్నర్‌ తీరు ఆశ్చర్యకరం: గండ్ర
పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి పోతున్నదని మాజీ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పేదల ఇబ్బందుల గురించి మాట్లాడకుండా సీఎం కేసీఆర్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గవర్నర్‌ తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని, నోట్లరద్దుపై మోదీకి కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారితే, కేసీఆర్‌కు గవర్నర్‌ నరసింహన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement