చిరు వ్యాపారులను ఆదుకోవాలి | Must help to small businesses | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులను ఆదుకోవాలి

Published Tue, Nov 29 2016 3:23 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

చిరు వ్యాపారులను ఆదుకోవాలి - Sakshi

చిరు వ్యాపారులను ఆదుకోవాలి

- వారిపై నోట్ల రద్దు ప్రభావాన్ని వెంటనే తగ్గించాలి
- రాష్ట్రాల నష్టాన్ని పూడ్చాలి
- ప్రధాని మోదీకి సీఎం సూచనలు
 
 సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం దృష్టి సారించాల్సిన అంశాలతో పాటు పలు సిఫారసులను చేశారు. ఇటీవల ఢిల్లీలో భేటీ సందర్భంగా, రాష్ట్రానికి ప్రధాని వచ్చిన సమయంలోనూ ఆయన ఈ అంశాన్నే ప్రస్తావించారు. సీఎం చేసిన సూచనలివీ..

 ప్రభావాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు
 రైతులు, చిరు వ్యాపారులు, పేద వర్గాలు.. తదితర సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయాలు, పండ్ల వ్యాపారులు, రోజువారీ కూలీలపై నోట్ల రద్దు నిర్ణయం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోంది. రోజువారీ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు చిరు వ్యాపారులు కూడా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పెద్దపెద్ద క్యూలలో గంటల తరబడి నిలుచోవాల్సి వస్తోంది. వ్యాపారులతో పాటు వారిపై ఆధారపడి జీవించే వర్కర్లూ నష్టపోతున్నారు. ఈ వర్గాలపై పడుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలి.

 నిర్మాణ రంగంపై ప్రభావాన్ని తగ్గించేందుకు..
 నైపుణ్యం లేని, నైపుణ్యం ఉన్న కార్మికులకు ఉపాధిని కల్పించే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలను నోట్ల రద్దు నిర్ణయం దారుణంగా దెబ్బతీసింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ పనుల్లో ప్రతిరోజూ సుమారు 10 లక్షల మంది కార్మికులు పని చేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది కార్మికులు రోజువారీ కూలీలే. డీమోనిటైజేషన్ కారణంగా గత వారం రోజులుగా వారంతా ఉపాధిని కోల్పోయారు. వీరందరికీ గృహ నిర్మాణం, రహదారుల మరమ్మత్తులు, అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి.. తదితర రంగాల్లో ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి.

 కోళ్ల పరిశ్రమ.. రుణాలపై రెండేళ్ల మారటోరియం
 దేశంలోనే అతిపెద్ద కోళ్ల పరిశ్రమ తెలంగాణలో ఉంది. గుడ్లు, కోడి మాంసం త్వరగా పాడయ్యేవే. చికెన్, గుడ్లు వ్యాపారమంతా నగదు ఆధారంగానే జరుగుతుంది. నోట్ల రద్దు తర్వాత 70 శాతం వ్యాపారం పడిపోరుుంది. పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి బ్యాంకు రుణాలపై కనీసం రెండేళ్లపాటు మారటోరియం విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి.

 ప్రత్యేక అవసరాలకు విత్‌డ్రా పెంచాలి
 చిరు వ్యాపారాల కోసం రూ.లక్ష, పెళ్లిళ్ల కోసం రూ.4 లక్షల మేర బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా పరిమితిని వెంటనే పెంచాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వివిధ చికిత్సలు, ఆపరేషన్ల నిమిత్తం పాత నోట్లను స్వీకరించాలి. ప్రభుత్వానికి చెల్లింపులు, పెట్రోల్ బంకుల్లో పాతనోట్ల వినియోగం గడువును మరింత పెంచాలి.

 కేంద్ర రుణాలపైనా మారటోరియం..
 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమిచ్చిన రుణాల అసలు, వడ్డీ చెల్లింపులపై కనీసం ఏడాది పాటు మారటోరియం విధించాలి.

 ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలి..
 వడ్డీ రేట్లు పడిపోరుున కారణంగా ప్రత్యేక రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసి రాష్ట్రాల అప్పులను తక్కువ వ్యయం కలిగిన అప్పులుగా మార్చాలి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3-3.5 శాతం నుంచి 0.5-1 శాతానికి పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న నగదు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇవ్వాల్సిన సీఎస్‌టీ కాంపన్సేషన్‌ను త్వరగా క్లియర్ చేయాలి.
 
 రైతుల డిపాజిట్లకు నామినల్ ట్యాక్స్
 ఎక్కువ మంది రైతులు, కౌలు రైతులు బ్యాంకుల్లో ఖాతాలున్నా వాటిని విని యోగించరు. వారి లావా దేవీలన్నీ ప్రధానంగా నగ దు రూపంలోనే ఉంటారుు కాబట్టి ఇళ్లలోనే నగదు ను దాచుకుంటారు. పెళ్లిళ్ల సీజన్లో కొందరు రైతులు తమ భూములను అమ్మి కొనుగోలు దారు నుంచి నగదునే స్వీకరించారు. అలాంటి రైతులను దృష్టిలో ఉంచుకొని వారి నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు నామినల్ ట్యాక్స్‌తో అనుమతించాలి.
 
 చిరు వ్యాపారుల కోసం..
 దేశ ఆర్థిక వ్యవస్థలో కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు.. తదితర రోజువారీ వ్యాపారాలదే పెద్ద భాగం. ఈ తరహా వ్యాపారాలు చేసేవారు బ్యాంకులకు వెళ్లేది చాలా తక్కువ. వారంతా ఎక్కువగా నగదు లావాదేవీలే జరుపుతుంటారు. ఇలాంటి వారికి కూడా కనీస పన్నుతో వారి సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలి. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నిరర్థకం కాకుండా వారికి కనీసం ఆరు నెలల రుణ వారుుదాలను ఒకేసారి చెల్లించే అవకాశం ఇవ్వాలి.
 
 రాష్ట్ర రెవెన్యూ లోటుకు తోడ్పాటు..

 పెద్దనోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో వ్యాట్, మోటార్ వాహనాల పన్ను, రిజిస్ట్రేషన్లపై వచ్చే ఆదాయం గత నెలతో పోల్చితే ఈ వారం రోజుల్లో 50 శాతం తగ్గింది. ఇదే తీరు కొనసాగితే.. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాబోయే కొద్దిరోజులకుగాను రాష్ట్రం రూ.7,500 కోట్ల రెవెన్యూ నష్టపోవాల్సి వస్తోంది. తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా కనిపిస్తుంది. ఈ మేరకు నష్టాన్ని పూరించేందుకు కేంద్రం అవసరమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి.
 
 బ్యాంకుల్లో మౌలిక వసతుల కోసం
 వివిధ స్థారుుల్లో పెరగనున్న ఎలక్ట్రానిక్ లావాదేవీలకు అనుగుణంగా బ్యాంకుల్లోని సర్వర్ సామర్థ్యాలను పెంచాలి. అన్ని రకాల డెబిట్, రూపే కార్డులు త్వరితగతిన లభించేలా చర్యలు చేపట్టాలి. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలను తెరిచేందుకు ఆధార్ కార్డుల డేటా, బ్యాంకు ఖాతాల సమాచారమంతా రాష్ట్రాలకు అందించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగేలా మర్చంట్ డిస్కౌంట్ రేట్లను గణనీయంగా తగ్గించాలి.అన్ని బ్యాంకులు తమ వద్ద తగినన్ని పారుుంట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) మెషీన్లు కొనుగోలు చేసేలా ఆర్బీఐ ఆదేశాలివ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement