హైదరాబాద్: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. స్థానికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఎంపీ వి. హనుమంతరావుకు చుక్కెదురైంది. ఆ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు మాట్లాడుతుండగా.. వీహెచ్ అడ్డుకున్నారు. దాంతో వీహెచ్ తీరును నిరసిస్తూ ఆదం వర్గీయులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య కాసేపు రసాభాస నెలకొంది.