Anjan Kumar Yadav
-
మంత్రి పదవిపై తండ్రి ఆశలు, అక్కడే ఉంది ట్విస్టు! కొడుకేమంటాడో?
రాజకీయ కుటుంబాల్లో సీటు పంచాయితీ కామనే. చాలా నియోజకవర్గాల్లో అన్న దమ్ముల మధ్య, కజిన్స్ మధ్య సీటు కోసం కుస్తీ పోటీలు జరుగుతుంటాయి. కాని ఓ నియోజకవర్గం కోసం తండ్రీ కొడుకులే కుస్తీ పట్లు పడుతున్నారు. ఇప్పుడిదే తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీటు త్యాగం చేయడానికి ఇద్దరిలో ఏ ఒక్కరూ సిద్ధంగా లేరని టాక్. వారి సంగతేంటో తెలుసుకుందా.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ తండ్రీ కొడుకుల పొలిటికల్ కుస్తీ ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ పీసీసీలో ముఖ్యులే. కాంగ్రెస్ పెద్దలకు సన్నిహితులే. కాని సీటు కోసం అటు తండ్రి, ఇటు కొడుకు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ, టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్‌కుమార్ యాదవ్ ముషీరాబాద్ సీటు కోసం పోటీ పడుతున్నారట. రెండోసారి తప్పుకుంటే ఎలా.. అంజన్‌కుమార్ గతంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలవగా, ఆయన తనయుడు అనిల్‌కుమార్ ముషీరాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలని అనిల్‌కుమార్ కోరుకుంటున్నారు. అయితే ఆయన తండ్రి కూడా తమకు పట్టున్న ముషీరాబాద్ నుంచే పోటీ చేసి గెలిచి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందాలని తాపత్రయపడుతున్నారు. ఇక్కడే ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. తనకు రానున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తన కొడుకు అనిల్‌కుమార్‌ను డ్రాప్ చేసుకోవాలని అంజన్‌కుమార్ కోరుతున్నారు. అయితే అనిల్ మాత్రం ఒకసారి పోటీ చేసి రెండోసారి తప్పుకుంటే తన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈ సారి పోటీ చేయకుంటే మళ్ళీ ఆ తర్వాత టిక్కెట్ రావడం కష్టమని అనిల్ భావిస్తున్నారట. అందుకే తన తండ్రిని ఎలాగైనా ఒప్పించి ఎలాగైనా ముషీరాబాద్ బరిలో నిలవాలని అనిల్ పట్టదలతో ఉన్నారు. అయితే తండ్రి, కొడుకులు ఇద్దరూ తమ రాజకీయ భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారా అనే అనుమానం కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తండ్రీ కొడుకుల్లో ఎవరో ఒకరు త్యాగం చేసి తప్పుకోకపోతే.. ఇద్దరూ నష్టపోతారని హితవు చెబుతున్నారు అంజన్‌కుమార్ సన్నిహితులు. హైకమాండ్ కరుణిస్తే ఓకే లేదంటే.. కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధన కాంగ్రెస్ హైకమాండ్ కచ్చితంగా అమలు చేస్తే ముషీరాబాద్ నుంచి అంజన్‌కుమార్ పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయని, ఇద్దరికీ టిక్కెట్లు ఇస్తే చెరో నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. ఒకే సీటు కోసం తండ్రీ కొడుకులు పోటీ పడుతుండటం విచిత్రంగా ఉందని గాంధీభవన్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఒక్కరికే సీటిస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంజన్కుమార్యాదవ్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి తండ్రి కోసం కొడుకు సీటు త్యాగం చేస్తాడా? అయితే టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ కూడా ముషీరాబాద్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తండ్రీ కొడుకుల్లో ఎవరికైనా దక్కుతుందా? లేక పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా మూడో వ్యక్తికి ఇస్తారా అనేది చూడాలి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ముగిసిన అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ!
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి యంగ్ ఇండియా లిమిటెడ్ కేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్(హైదరాబాద్), మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడి విచారణ ముగిసింది. ఈ మేరకు రెండు గంటలపాటు ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ కేసులో అంజన్ కుమార్‌కు నోటీసులు జారీ చేయడంతో.. నేడు ఆయన ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కక్ష్య పూరిత చర్య.. కాంగ్రెస్ నాయకులపై ఈడీ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని అంజన్ కుమార్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు రూ.20 లక్షలు విరాళం ఇచ్చినట్లు ఈడీ ముందు ఒప్పుకున్నానని చెప్పారు. సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్లను వదిలేసి.. తమలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఈడీ పనిచేస్తోందని ఆరోపించారు. గతేడాది నవంబర్‌లో విచారణకు హాజరైన సందర్భంగా అంజన్ కుమార్‌ను ఈడీ మూడు గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చానని అంజన్ కుమార్ గత విచారణ సందర్భంగా ఈడీ అధికారులకు తెలిపిన విషయం తెలిసిందే. ఆ టైంలో దాదాపు రెండున్నర గంటలపాటు అంజన్ కుమార్‌ను విచారించిన ఈడీ.. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడం గమనార్హం. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్: దంగల్ మే దమ్ (ఫొటోలు)
-
ముగిసిన అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెర మీదికి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. యంగ్ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అంజన్ కుమార్‌ను విచారించిన ఈడీ.. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు. విచారణ అనంతరం అంజన్ కమార్ యాదవ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఈడి అధికారులకు తెలిపినట్లు చెప్పారు. సంస్థ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందనే స్వచ్చందంగా విరాళాలు ఇచ్చానన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేతలను విచారిస్తుందని విమర్శించారు. మళ్ళీ విచారణ ఉంటే పిలుస్తామని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు -
21న ‘ఈడీ’ ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా గాంధీ కుటుంబాన్ని వేధిస్తోందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ అంజన్‌కుమార్‌యాదవ్ ఆరోపించారు. ఈనెల 21న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ, ఏర్పాట్లపై గాంధీభవన్‌లో సోమవారం నేతలు సమావేశమయ్యారు. అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవితో కలిసి అంజన్‌కుమార్‌యాదవ్ విలేకరులతో మాట్లాడారు. 21న ఉదయం 11గంటలకు నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఇందులో పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొంటారని చెప్పారు. 22న అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌గాంధీలపై ఈడీ కేసులు పెడుతున్నారని పార్టీ నేతలు గీతారెడ్డి, మల్లు రవి ఆరోపించారు. -
డ్రగ్స్ కేసులో అంజన్ కుమార్ కొడుకు.. ఆయన కామెంట్స్ ఇవే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అరవింద్ కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ స్పందిస్తూ..‘‘ నా కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా కుటుంబం అలాంటిది కాదు. దీనిలో నిజానిజాలు తేల్చాలి. సిటీలో ఉన్న అన్ని పబ్‌లను మూసివేయాలి. మద్యపాన నిషేధం విధించాలి’’ అని అన్నారు. -
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వరుస ఓటములతో దెబ్బపై దెబ్బ పడుతోంది. పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే ముఖ్యనేతలు ఒక్కొక్కరు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలకు క్యూ కడుతుండగా, తాజాగా అంజన్‌కుమార్ యాదవ్ తన పదవికి రాజీనామా చేయడంతో నగర అధ్యక్ష పీఠం కూడా ఖాళీ అయింది. పీసీసీ ప్రమోషన్ కోసమే పదవికి రాజీనామా చేశానని అంజన్‌కుమార్ పేర్కొంటున్నా.. జీహెచ్ఎంసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయనను పక్కన పెట్టడమే అసలు కారణంగా తెలుస్తోంది. మరోవైపు యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయన కుమారుడు అనిల్ కుమార్‌కు సైతం సరైన ప్రాధాన్యం ఇవ్వక పోవడం లాంటి రాజకీయ పరిస్థితులు రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది. కష్టకాలంలో ఒక వైపు అధికార పార్టీ దూకుడు..మరోవైపు పార్టీలో ఆధిపత్య పోరు కోసం కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు పార్టీ శ్రేణులను మరింత కుంగతీస్తున్నాయి. సంస్థాగతంగా... గత ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనపడి పరిస్థితి నిర్వీర్యంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకాగా, అప్పట్లో గ్రేటర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పక్షంలో చేరగా, గత రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభా ఎన్నికల అనంతరం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజల మద్దతు కూడగట్టుకోలేక పోవడంతో పాటు సంస్థాగతంగా బలపడడటంలో కూడా వెనుకబడి.. ఉనికిని కోల్పోయినట్లయింది. బల్దియా ఓటమి నేపథ్యం.. నగర కాంగ్రెస్ పార్టీలో బల్దియా ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపాయి. మాజీ మేయర్ కార్తీక రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ పార్టీకి గుడ్‌బై చెప్పగా, పాతబస్తీ మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందే అగ్రనేతలతోపాటు పలువురు డివిజన్ స్థాయి ముఖ్య నేతలు సైతం పార్టీకి దూరమయ్యారు. మరోవైపు అగ్రనేతలు గూడురు నారాయణరెడ్డి, విజయశాంతి తదితరులు కూడా ఇతర పార్టీల్లో చేరారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి అధికార పక్షం ముందు కాంగ్రెస్ నిలబడలేపోయింది. తాజా రాజకీయ పరిణామాలతో ప్రదేశ్ కాంగ్రెస్‌తో పాటు నగర కాంగ్రెస్ రథసారథులు సైతం పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థంకంగా తయారైంది. -
కాంగ్రెస్‌లో లొల్లి, అలిగిన అంజన్‌కుమార్?!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికలో దుమ్ములేపాలని భావించిన కాంగ్రెస్ పార్టీ.. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడదామని భావిస్తే.. నాయకులు ఒక్కొక్కరుగా ‘హస్తా’నికి హ్యాండ్ ఇస్గున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, శేరిలింగంపల్లి ఇన్ఛార్జ్ రవికుమార్‌యాదవ్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ కూడా అలిగినట్లు సమాచారం. గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల సమావేశానికి అంజన్ కుమార్ డుమ్మాకొట్టారు. తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్లు కేటాయిస్తున్నారని అధిష్టానంపై అంజన్ కుమార్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ బీజేపేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆశావహులకు బీజేపీ ఎర.. కాంగ్రెస్ దూకుడు!) -
కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : సచివాలయ ఆవరణలో నల్ల పోచమ్మ ఆలయం, మసీదులు కూల్చివేతలకు బాధ్యులైన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రావన్ దాసోజు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను, మత పరమైన విశ్వాసాలను గాయపరుస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చట్ట విరుద్ధంగా, రాజ్యంగానికి వ్యతిరేకంగా నియంతత్వ పోకడలతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అత్యంత ప్రాచీనమైన ప్రార్థనా స్థలాలను మూడో కంటికి తెలియకుండా చట్ట వ్యతిరేకంగా దుర్మార్గంగా కూల్చివేశారని విమర్శించారు. వీటిలో ఓమసీదు 1889 వ సంవత్సరంలో ఆనాటి నిజాం రాజు నిర్మించిన తెలంగాణ వారసత్వ సంపద అని, అంతేకాకుండా సీ బ్లాక్ పక్కనే ఉన్న మసీదు ఇఫ్తార్ - ఏ - ముతామాది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రార్థనా మందిరమని గుర్తుచేశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ పాల్గొన్నారు. -
విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన బుధవారం ఇందిరా భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బడే భాయ్.. ఛోటా భాయ్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సచివాలయాన్ని కూల్చి వేయాలని చూస్తుంటే .. మోదీ పార్లమెంట్ కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశ ఆర్థిక పరిస్థితిని హృతిక్ రోషన్ సినిమా కలెక్షన్లతో పోల్చడాన్ని కుంతియా తప్పుబట్టారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం కేసీఆర్ పట్టించుకోక పోవడంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెజార్టీ రైతులకు రైతుబంధు డబ్బులు అందలేదన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అదేవిధంగా ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలతో పాటు 16న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను జనంలోకి ఉద్యమ రూపంలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోమాలో.. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు వెంటిలేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు. మోదీ విధానాలు అన్నీ సామాన్యులకు వ్యతిరేకంగా ఉండడంతో.. పారిశ్రామిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆర్సీ కుంతియా, హెచ్‌కే పాటిల్, భట్టి విక్రమార్క, జానా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బోసు రాజు, దాసోజు శ్రవణ్, బొల్లు కిషన్, కోదండ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
హస్తానికి నవ సారథులు
సాక్షి,సిటీబ్యూరో: కాంగ్రెస్ పార్టీ నగర నూతన అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ నియమితులయ్యారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కూనశ్రీశైలంగౌడ్, రంగారెడ్డి జిల్లాకు చల్లా నర్సింహారెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ ముగ్గురు నాయకులు పార్టీలోసీనియర్లు కావడంతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారే. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అంజన్‌కుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇచ్చారు. ఈయన సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. మేడ్చల్ జిల్లా బాధ్యతలు తీసుకోనున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ గతంలో కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. అదే నియోకజవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. గురువారం అంజన్‌కుమార్, శ్రీశైలంగౌడ్ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ 2004 నాటికి వైభవం తీసుకువస్తామని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో సత్తా చాటుతామని తెలిపారు. పార్టీకి దూరమైన వారితో పాటు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళతామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త సారథిగా నియమితులైన చల్లా నర్సింహారెడ్డి గతంలో సరూర్‌నగర్ నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పగ్గాలు అందుకోవడం కోసం చల్లాతో పాటు జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఏనుగు జంగారెడ్డి, మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వేణుగౌడ్, దండెం రాంరెడ్డి పోటీపడ్డారు. అయితే, ఇందులో చివరి వరకు చల్లా, జంగారెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించినప్పటికీ, నర్సింహారెడ్డి వైపే మొగ్గు చూపింది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చల్లా నాయకత్వాన్ని సిఫార్సు చేశారు. ఈమేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ పీసీసీకి లేఖ రాశారు. దీంతో ఆయన సారథ్యానికి అధిష్టానం పచ్చజెండా ఊపింది. మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడకు చెందిన చల్లా నర్సింహారెడ్డి 1984లో కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఎన్ఎస్యూఐలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1988 నుంచి 1991 వరకు జిల్లెలగూడ గ్రామ అధ్యక్షుడిగా, 1991 నుంచి 1994 వరకు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1994 నుంచి 2002 వరకు సరూర్‌నగర్ మండల అధ్యక్షుడిగా, 2002–2009 మధ్య మలక్‌పేట్ అసెంబ్లీ బి–బ్లాక్ అధ్యక్షుడిగాను, అనంతరం రాష్ట్ర పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా 1988లో జిల్లెగూడ గ్రామ ఉప సర్పంచ్‌గాను, 1994లో సర్పంచ్‌గా, 2001లో సరూర్‌నగర్ మండల జడ్పీటీసీగా ఉన్నారు. డీసీసీ పదవిని ఆశించిన ఏనుగు జంగారెడ్డి.. తనను ఎంపిక చేయకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా చల్లా పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించిన తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే! -
ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తా...
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వారసుడిగా కాకుండా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టిన విధానంలో రెండు పర్యాయాలు యువజన కాంగ్రెస్ కమిటీకి ఎన్నికయ్యానని, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ టికెట్ అభ్యర్థిస్తున్నానని అనిల్‌కుమార్ అన్నారు. సామాన్య ఎన్ఎస్యూఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగి రాష్ట్రవ్యాప్తంగా యువజన చైతన్యయాత్ర చేపట్టానని పేర్కొన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా టికెట్ ఆశించడంలో తప్పేంటని ప్రశ్నించారు. బుధవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తనకు గట్టి పట్టు ఉందని, స్థానిక సమస్యలపై మంచి అవగాహన ఉందని, ఎన్నికల బరిలో దిగి తప్పనిసరిగా విజయం సాధిస్తానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలకు దక్షిణ భారతదేశ బడ్జెట్ చాలదని, నిరుద్యోగభృతి అసలు సాధ్యంకాదని ఇదివరకు పేర్కొన్న కేసీఆర్ తమ మేనిఫెస్టోలోని అంశాలను ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన నిరుద్యోగభృతికి 16 రూపాయలు అదనంగా పెంచి ప్రకటించారని, అదే టీఆర్ఎస్ లక్కీ నంబరైతే, ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 16 సీట్లకే పరిమితమవుతుం దని ఆయన జోస్యం చెప్పారు. -
సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పాటు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ ఏర్పాటు అయిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా వ్యాక్యానించారు. ఆదివారం ముషీరాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్సీ కుంతియాతో పాటు కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, బోసురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థుల బలిదానం చూసి చలించి సోనియా తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ 9 నెలల ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని సూటిగా అడిగారు. మోదీ, ఎన్డీఏ గ్రాఫ్ తగ్గుతోంది..రాహుల్ గ్రాఫ్ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకుని కుమ్మక్కయ్యారని ఆరోపించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ..హైదరాబాద్‌ని అన్నిరంగాల్లో అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నెంబర్ వన్ పిట్టలదొర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలే చెబుతాడు తప్ప..చేతలుండవన్నారు. ఏఐసీసీ నేత బోసురాజు మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్‌కు సెపరేట్‌గా మేనిఫెస్టో సబ్ కమిటీ వేస్తామని తెలిపారు. గ్రేటర్ సమస్యలపై సబ్‌కమిటీ చర్చిస్తుందన్నారు. 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..తెలంగాణ ఇచ్చింది..తెచ్చింది కాంగ్రెస్సేనని, తెలంగాణాకు అందరూ సపోర్ట్ చేసినా అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ వద్దన్నారని విమర్శించారు. గ్రేటర్లో 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. -
పాతబస్తీలో జెండా ఎగరేస్తాం
సాక్షి, సిటీబ్యూరో: ‘ముందస్తు’ ఎన్నికల్లో పాతబస్తీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, మజ్లిస్ కంచుకోటను బద్దలు కొడతామని ఆ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలో బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతామని చెప్పారు. పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పాతబస్తీ ఏదో ఒక్క పార్టీ సొత్తు కాదని... ఇప్పటి వరకు దానిపై సీరియస్‌గా దృష్టి సారించలేదని, ఈ ఎన్నికల్లో తాడోపేడో తెల్చుకుంటామన్నారు. మిత్రపక్షాలతో కలిసి నగరంలో క్లీన్‌స్వీప్ చేస్తామని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒక్కటే సెక్యూలర్ పార్టీ అని... మజ్లిస్, టీఆర్ఎస్, బీజేపీ మూడూ ఒక్కటేనని ఆరోపించారు. మజ్లిస్ టీఆర్ఎస్కు సహకరిస్తోందని, టీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని ఆమోదంతోనే కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్... బీజేపీతో జత కట్టడం ఖాయమని పేర్కొన్నారు. దీంతో మజ్లిస్, టీఆర్ఎస్లకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. అక్కడందరూ తెలంగాణ ద్రోహులే... టీఆర్ఎస్లో రాజ్యమేలుతోంది తెలంగాణ ద్రోహులేనని అంజన్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన మజ్లిస్... టీఆర్ఎస్కు మిత్రపక్షమైందన్నారు. తెలంగాణ ద్రోహులైన తుమ్మల, తలసాని తదితరులకు మంత్రి పదవులిచ్చి అందలం ఎక్కించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఉద్యమంలో భాగస్వామలైన వారికి, అమరులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో గళం విప్పింది కాంగ్రెస్ ఎంపీలేనన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 12సార్లు పార్లమెంట్‌ను అడ్డుకున్నామని గుర్తు చేశారు. ‘తెలంగాణ ఇచ్చింది... తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేసీఆర్ ఒక్కడితోనే సాధ్యం కాలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం మాయమాటలతో అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముందస్తు ఎన్నికల్లో చీటింగ్ టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. అన్నింట్లో వైఫల్యం... నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ నగరాభివృద్ధికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. వాగ్దానాల అమలుకు సంబంధించి కేసీఆర్ అన్నింటా వైఫల్యమయ్యారని అన్నారు. పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని మభ్య పెట్టాడన్నారు. మెట్రో, కృష్ణ జలాల ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, పనులు పూర్తయిన తర్వాత ప్రారంభించడంలో గొప్పేమిటని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే పాత నగరానికి మెట్రోను విస్తరించాలన్నారు. కార్యకర్తలకు పెద్దపీట... రానున్న ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని అంజన్‌కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. నగరంలోని 15 అసెంబ్లీ స్థానాల టికెట్ల కోసం సుమారు 100 మంది దరఖాస్తు చేసుకున్నారని, సర్వే ప్రకారం గెలుపు గుర్రాలకు అవకాశం రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో సమర్థులను బరిలో దింపుతామని, టికెట్ ఆశించి భంగపడ్డ వారు నిరాశ పడకుండా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. కష్టకాలంలో పనిచేసిన వారిని పార్టీ మరవదని, అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. -
ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న నేతలు వీరే!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో కొత్త కిరికిరి మొదలైంది! మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో రచ్చకు దారి తీశాయి. తాను ఈసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉంటానని ఆయన బహిరంగంగా ప్రకటించడంతో ఇక్కడ్నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంజన్‌కుమార్ యాదవ్ భగ్గుమన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఆవేశంతో ఊగిపోయారు. తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని, వీటిని కొంద రు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన నగర కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎంపీ అజహరుద్దీన్‌పై విరుచుకుపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, తాను సికింద్రాబాద్ నుంచే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అజహరుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయవచ్చని సవాల్ విసి రారు. అంజన్‌కుమార్ మాట్లాడుతుండగానే మాజీ ఎంపీ వీహెచ్ సమావేశం నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ లోక్‌సభ విషయంలో జరుగుతున్న వివాదమే పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో నెలకొనడం గమనార్హం. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు పోటీ పడుతుండటం చూస్తుంటే టికెట్ల సమయంలో తల నొప్పులు తప్పేలా లేవన్న చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల పార్టీ బరిలోకి దింపాలని భావిస్తున్న అభ్యర్థులు పోటీకి సుముఖంగా లేకపోవడం గమనార్హం. టికెట్లు ఆశిస్తున్న వారి వివరాలివీ.. ♦ మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని అంటున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ తన కుమా ర్తె శ్రుతిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ్నుంచి బీసీలకు సీటు ఇవ్వాల్సి వస్తే రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశముంది. ♦ నాగర్‌కర్నూల్ నుంచి నంది ఎల్లయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వయసు, ఆరోగ్యం రీత్యా ఈసారి పోటీ చేయకుంటే మాజీ ఎంపీ మల్లు రవి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన గతంలో పోటీచేసిన జడ్చర్ల స్థానంలో జనరల్ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయి. ♦నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే తాను కాంగ్రెస్ నుంచి బరి లో ఉండి ఓడిస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈయనతో పాటు సీఎల్పీ నేత జానారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే జానా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ కూడా నల్లగొండ లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు. ♦ భువనగిరి పార్లమెంటు సీటు నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయ న సోదరుడు వెంకటరెడ్డి నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీచేస్తే రాజగోపాల్ అసెంబ్లీ బరిలో ఉంటారు. అప్పుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలకు అవకాశం ఉంటుంది. దాసోజు శ్రవణ్ కూడా భువనగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ చేవెళ్ల పార్లమెంటు సీటు నుంచి గత ఎన్నికల్లో పటోళ్ల కార్తీక్‌రెడ్డి పోటీ చేశారు. ఆయన ఈసారి రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం బరిలో నిలవాలనే ఆలోచనలో ఉన్నందున ఆయన తల్లి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల నుంచి పోటీకి దింపాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. ♦ మల్కాజ్గిరి బరిలో రేణుకా చౌదరి ఉంటారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు ఈసారి జనరల్ సీటు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దనరెడ్డి కూడా ఆసక్తి చూపుతున్నారు. ♦ ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదం నేపథ్యంలో గతంలో పోటీచేసిన నరేశ్‌జాదవ్‌కు టికెట్ ఇవ్వడంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆదివాసీల ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న సోయం బాపూరావు ఇక్కడ్నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయి. ♦ పెద్దపల్లి లోక్‌సభకు గతంలో పోటీచేసిన వివేక్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. ఇక్కడ్నుంచి ప్రస్తు తం తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ సుగుణకుమారి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ లేదా ఉమ్మడి ప్రతిపక్షా ల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌ను బరిలోకి దిం పాలనే ఆలోచన కూడా టీపీసీసీ పెద్దల్లో ఉంది. జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, స్థానిక నేతలు గజ్జెల కాంతం, గోమాస శ్రీనివాస్, గుమ్మడి కుమారస్వామిల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ♦ కరీంనగర్‌కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్‌కు మధుయాష్కీగౌడ్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ♦ వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రాజయ్య మళ్లీ బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఎస్సీ కోటాలో ఈ సీటును ఆశిస్తున్నారు. మాజీ మంత్రి విజయరామారావు పేరు కూడా వినిపిస్తోంది. ♦ మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఎల్‌హెచ్‌పీఎస్ నేత బెల్లయ్య నాయక్ కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ♦ జహీరాబాద్ లోక్‌సభ సీటుకు గతంలో పోటీచేసిన సురేశ్ షెట్కార్ ఈసారి పోటీకి ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఇక్కడ ఇటీవలే పార్టీలో చేరిన మదన్మోహన్రావును బరిలో దింపే అవకాశాలున్నాయి. ♦ మెదక్ నుంచి గతంలో పోటీ చేసిన శ్రవణ్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మావతి పేర్లు వినిపిస్తున్నాయి. ♦ హైదరాబాద్ లోక్‌సభ సీటుకు మాజీ క్రికెటర్ అజహరుద్దీనే సరైన అభ్యర్థి అని హైకమాండ్ భావిస్తోంది. ఆయన ఇక్కడి నుంచి పోటీచేసేందుకు ఇష్టపడకపోతే గతంలో అసదుద్దీన్‌పై పోటీచేసిన జాహెద్ అలీ ఖాన్‌కు మద్దతివ్వడం లేదంటే మరో మైనార్టీ అభ్యర్థి ని బరిలో నిలిపే అంశాలను టీపీసీసీ పరిశీలిస్తోంది. n ఖమ్మం లోక్‌సభ విషయంలో ఇంకా స్పష్టత రా లేదు. సీపీఐతో పొత్తు కుదిరితే ఆ స్థానాన్ని వారికి వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ చేయాల్సి వస్తే రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి లేదా టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు (కాంగ్రెస్‌లోకి వస్తే)లో ఒకరు బరిలో ఉండొచ్చు. -
కాంగ్రెస్ పార్టీలో ‘గ్రేటర్’ చిచ్చు
-
అంజన్ వర్సెస్ అజార్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ‘గ్రేటర్’ చిచ్చు రాజుకుంది. ఈ చిచ్చు కారణం మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అజహరుద్దీన్ ఇటీవల చేసిన ప్రకటన.. గ్రేటర్ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. అజార్ ప్రకటనపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ భగ్గుమన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి ఈ సారి తానే పోటీ చేయబోతున్నట్లు ఆయన సమావేశంలో స్పష్టం చేశారు. అజహరుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంజన్ కుమార్ మాట్లాడుతుండగా మాజీ ఎంపీ వీ హనుమంతరావు విసురుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అంజన్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా, అజహరుద్దీన్‌కు వ్యతిరేకంగా కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. మధ్యలో కల్పించుకున్న మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ.. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ అంజన్‌దేనని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని నచ్చజెప్పారు. మరోవైపు ఈ సమావేశానికి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్, ఆయన తనయుడు విక్రమ్‌గౌడ్‌లు హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. -
ఆయన వల్లే కాంగ్రెస్‌కు బ్రహ్మాండమైన మెజారిటీ
హైదరాబాద్ : 2004లో అంజన్ కుమార్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం వల్లే కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..గత 4 ఏళ్లలో కాంగ్రెస్ కొంత పట్టుకోల్పోయింది కానీ అంజన్ నాయకత్వంలో మళ్లీ పూర్వ వైభవం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందని అన్నారు. తెలంగాణ రాష్ర్ట అవతరణ వేడుకలు అన్ని పార్టీల వేడుకగా జరగాలి కానీ కేసీఆర్ సొంత వేడుకలా జరుపుతున్నారని ధ్వజమెత్తారు. మెట్రో ట్రైన్ కేసీఆర్ సాధించారని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంగా వైఎస్ఆర్, కేంద్రమంత్రిగా తాను మెట్రో సాంక్షన్ చేయించుకోగలిగామని తెలిపారు. ‘ కేసీఆర్ ఇప్పుడు బీజేపీతో స్నేహం చేస్తున్నారు. అది అక్రమ సంబంధం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కంటే ఎక్కువగా వినయం ప్రదర్శిస్తున్నారు. తన అవినీతిపై కేసులు పెడతారేమోనని భయపడుతున్నారు. తాను పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ముడి చమురు ధర ఇప్పటికి డబుల్ ఉంది. అయినా ధర తగ్గటం లేదు. బీజేపీ నాయకులు మా చేతుల్లో ఏం లేదంటున్నారు. టాక్సులు పెంచి రేట్లు తగ్గించకుండా ప్రజలను మోదీ వంచిస్తున్నారు. మోదీ టాక్స్ టెర్రరిస్ట్, ఎక్సైజ్ టాక్స్ టెర్రరిస్ట్ లేకపోతే ఈ రేట్లు ఏంటి. 2019లో కాంగ్రెస్ రాహుల్ నాయకత్వంలో మిగిలిన పక్షాలను కలుపుకుని ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామ’ ని వ్యాఖ్యానించారు. -
బాధ్యతలు స్వీకరించిన అంజన్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం నాంపెల్లి రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా గాంధీభవన్ చేరుకున్నారు. అనంతరం టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానా రెడ్డిల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. త్వరలో నగరం అంతా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, సర్వేసత్యనారాయణలతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘సీఎం కేసీఆర్‌కు సిగ్గు, శరం ఉంటే..’
సాక్షి, హైదరాబాద్ : తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా నియమించినందుకు ఉత్తమ కుమార్ రెడ్డికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ నాయకులు కృషి చేశారన్న అంజన్ కుమార్.. సీఎం కేసీఆర్‌కు సిగ్గు, శరం ఉంటే కాంగ్రెస్ నేతలకు సన్మానం చేయాలని సూచించారు. ఇంకా చెప్పాలంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రావడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 కార్పొరేట్ సీట్లు గెలిచారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్‌లపై ప్రజలకు నమ్మకం పోయిందని, నగరమంతా త్వరలో పాదయాత్ర చేస్తానన్నారు. కేసీఆర్ చెప్పకముందే అన్ని కులాలకు ముందే కుల సంఘాలు ఉన్నాయని.. కులాల ప్రకారం తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను కేసీఆర్ గందర గోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. నాంపల్లి నుండి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీతో వేలమందితో గాంధీ భవన్ వెళ్లి అక్కడ సభ నిర్వహిస్తామన్నారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని హామీలిచ్చి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు పాపం తగులుతుందన్నారు అంజన్ కుమార్ యాదవ్. -
రాహుల్ లిస్ట్.. అంజన్‌కు కీలక పదవి
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నియామకాల భర్తీని వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ పలు తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి 13 డీసీసీలకుగానూ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. వారిలో చాలా వరకు పాతముఖాలే. కాగా, కీలకమైన హైదరాబాద్ డీసీసీ పీఠం.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు దక్కింది. మాజీ మంత్రి దానం నాగేందర్ స్థానంలో అంజన్‌ను నియమించారు. ఒకదశలో అంజన్ గులాబీ గూటికి చేరుతారన్న వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. బీజేపీతో విడాకులు తీసుకుని టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందనే ఊహాగానాల నడుమ.. సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి డీసీసీ అధ్యక్షుడి నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామగుండం సిటీ, కరీంనగర్ సిటీ, వరంగల్ సిటీలను ప్రత్యేక డీసీసీగా పేర్కొనడం గమనార్హం. డీసీసీ పేరు.. అధ్యక్షులు నిజామాబాద్: తాహెర్ బిన్ హమ్దాన్ కరీంనగర్ : కటకం మృత్యుంజయం ఆదిలాబాద్ : మహేశ్వర రెడ్డి మెదక్ : సునీతా లక్ష్మారెడ్డి రంగారెడ్డి : క్యామ మల్లేశం మహబూబ్ నగర్ : ఓబెదుల్లా కొత్వాల్ నల్గొండ: బిక్షమయ్య గౌడ్ వరంగల్ : రాజేందర్ రెడ్డి నిజామాబాద్ సిటీ : కేశ వేణు కరీంనగర్ సిటీ : రాజశేఖర్ వరంగల్ సిటీ: శ్రీనివాస రావు రామగుండం సిటీ :లింగస్వామి యాదవ్ హైదరాబాద్ సిటీ : అంజన్ కుమార్ యాదవ్ -
ప్రణాళికలు వేస్తున్నాం.. గెలుపు మాదే
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు ఎం. అంజన్‌కుమార్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ మహ్మద్‌గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణలో నియంతలా వ్యవహరిస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నగరంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తగిన ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. తన నివాసానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి అంతకుముందు అంజన్‌కుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. -
నాంపల్లిలో టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్ : విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు పేద, మధ్య తరగతి వర్గాలు భరించలేవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. శనివారం విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా నాంపల్లి చౌరస్తాలో టీ.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఇతర పార్టీలతో కలసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఛార్జీలు పెంచడమా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, గండ్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గోషామహాల్ పీఎస్‌కు తరలించారు. -
అబద్ధాల యూనివర్శిటీకి వీసీగా కేసీఆర్
హైదరాబాద్: అబద్ధాల విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వీసీగాను, ప్రొఫెసర్లుగా ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవితను నియమించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి, టీఆర్ఎస్ ఆకర్ష్ పథకంపై నిన్న విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పార్లమెంటు పరిధిలో 35 కార్పొరేటర్ స్థానాల్లో 25 గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పూటకో మాటను జనం నమ్మే పరిస్థితుల్లో లేరని, తెలంగాణ తెచ్చింది తామేనని, కృష్ణా, గోదావరి జలాలు మాజీ సీఎం వైఎస్సార్ హయాంలోనే మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. -
మాటలతో మాయలు చేస్తుండు
► కేసీఆర్‌పై షబ్బీర్‌అలీ ధ్వజం బంజారాహిల్స్: కల్లబొల్లి మాటలు చెబుతూ సీఎం కేసీఆర్ ప్రజలను మో సం చేస్తున్నారని శాసనమండలి ప్రతి పక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. బంజారాహిల్స్‌రోడ్ నెం.10లో ఏడాది క్రితం బంజారాభవన్, కొమరం భీమ్ భవన్, బాబు జగ్జీవన్‌రాం భవన్లకు ముఖ్యమంత్రి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారని, తీరా చూస్తే అది వివాదాస్పద స్థలమని తేలడంతో శిలాఫలకాలు తొలగించారని ఇప్పుడు ఆ భవనాలు ఎక్కడ కడతారని ప్రశ్నించారు. శిలాఫలకాలు వేసిన స్థానంలో సీఎం తీరుకు నిరసనగా ఆదివారం షబ్బీర్‌అలీతో పాటు అంజన్ కుమార్ యాదవ్, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలంటే కేసీఆర్‌కు చిన్నచూపని దుయ్యబట్టారు. బీసీలకు, ముస్లింలకు, గిరిజనులకు విడుదల చేసిన నిధుల్లో 70 శాతం నిధులు విడుదల కాలేదన్నారు. కమీషన్ల కోసం వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ పనులకు మాత్రం నిధులు విడుదల చేశారని దుయ్యబట్టారు. మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చే జీవోలకు అడ్డూ అదుపు లేకుండాపోతుందని అన్నారు.అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలను అవమానపరుస్తున్నారన్నారు. అయుత చండీయాగం ద్వారా కేసీఆర్ బుద్దిమారాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, నాగేందర్, మాజీ డిప్యూటీ మేయర్రాజ్కుమార్ పాల్గొన్నారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే వారికే నష్టం.. ఎంఐఎం అదినేత అసుద్దీన్ ఓవైసీ మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటం తగదని, ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే మైదానంలోకి రావాలని షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. ఆదివారం బంజారాహిల్స్‌రోడ్ నెం. 10లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే వాళ్లు పాముకు పాలు పోసినట్లేనని ఆరోపించారు. కాల్‌మనీలో ఎంఐఎం నేతలు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు.