సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నియామకాల భర్తీని వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ పలు తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి 13 డీసీసీలకుగానూ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. వారిలో చాలా వరకు పాతముఖాలే.
కాగా, కీలకమైన హైదరాబాద్ డీసీసీ పీఠం.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు దక్కింది. మాజీ మంత్రి దానం నాగేందర్ స్థానంలో అంజన్‌ను నియమించారు. ఒకదశలో అంజన్ గులాబీ గూటికి చేరుతారన్న వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. బీజేపీతో విడాకులు తీసుకుని టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందనే ఊహాగానాల నడుమ.. సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి డీసీసీ అధ్యక్షుడి నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామగుండం సిటీ, కరీంనగర్ సిటీ, వరంగల్ సిటీలను ప్రత్యేక డీసీసీగా పేర్కొనడం గమనార్హం.
డీసీసీ పేరు.. అధ్యక్షులు
నిజామాబాద్: తాహెర్ బిన్ హమ్దాన్
కరీంనగర్ : కటకం మృత్యుంజయం
ఆదిలాబాద్ : మహేశ్వర రెడ్డి
మెదక్ : సునీతా లక్ష్మారెడ్డి
రంగారెడ్డి : క్యామ మల్లేశం
మహబూబ్ నగర్ : ఓబెదుల్లా కొత్వాల్
నల్గొండ: బిక్షమయ్య గౌడ్
వరంగల్ : రాజేందర్ రెడ్డి
నిజామాబాద్ సిటీ : కేశ వేణు
కరీంనగర్ సిటీ : రాజశేఖర్
వరంగల్ సిటీ: శ్రీనివాస రావు
రామగుండం సిటీ :లింగస్వామి యాదవ్
హైదరాబాద్ సిటీ : అంజన్ కుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment