సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత బండారు దత్తాత్రేయను ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అభినందించారు.
న్యూఢిల్లీ : సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత బండారు దత్తాత్రేయను ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అభినందించారు. దత్తాత్రేయ సోమవారం ఉదయం రాజ్నాథ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాజ్నాథ్ అభినందనలు తెలిపారు. కాగా దత్తాత్రేయకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ హోదాతో ఆయనను రైల్వే శాఖ వరించవచ్చని సమాచారం. దత్తాత్రేయ సికింద్రబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్పై 50వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.