అబద్ధాల యూనివర్శిటీకి వీసీగా కేసీఆర్
హైదరాబాద్: అబద్ధాల విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వీసీగాను, ప్రొఫెసర్లుగా ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవితను నియమించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి, టీఆర్‌ఎస్ ఆకర్ష్ పథకంపై నిన్న విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పార్లమెంటు పరిధిలో 35 కార్పొరేటర్ స్థానాల్లో 25 గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పూటకో మాటను జనం నమ్మే పరిస్థితుల్లో లేరని, తెలంగాణ తెచ్చింది తామేనని, కృష్ణా, గోదావరి జలాలు మాజీ సీఎం వైఎస్సార్ హయాంలోనే మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు.