సీమాంధ్రులపై ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
హైదరాబాద్: సీమాంధ్రులపై ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారంటూ చెప్పుకుంటున్న సీమాంధ్ర వాసులు ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..‘ హైదరాబాద్ నిజంగా మా సొత్తే. హైదరాబాద్‌ను సీమాంధ్రులు అభివృద్ధి చేయలేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీమాంధ్ర వాసులు ఇక్కడి సంస్కతిని నాశనం చేసి, బాంబుల సంస్కతిని తీసుకోచ్చారన్నారు. నగరంలోని కులవృత్తులను నాశనం చేశారని ఆయన విమర్శించారు. వారు హైదరాబాద్‌ను అభివృద్ది చేసేందేమీ లేదని, వారే ఇక్కడకు వచ్చి అభివృద్ధి చెందారన్నారు. చౌక ధరలకే భూములను కాజేశారని అంజన్ తెలిపారు.