
కేసీఆర్ ఏనాడూ పార్లమెంటులో పోరాడలేదు
తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ పార్లమెంటులో పోరాడలేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.
చెస్ట్ ఆస్పత్రి, సచివాలయం తరలింపు లాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని అంజన్ మండిపడ్డారు. పేదల సంక్షేమాన్ని విస్మరిస్తూ, తన కుటుంబానికి మాత్రమే లాభం చేకూర్చేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.