
సాక్షి, హైదరాబాద్ : సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గెలిచే టైంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దానం నాగేందర్‌కు ఇచ్చినందుకే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు’
నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భజనగాళ్లు ఇవ్వలేదు. లాలూప్రసాద్.. సోనియాకు చెప్పి ఇప్పించారు. పదవి ఇవ్వొద్దని ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి అడ్డు తగిలారు. నేను కేంద్రమంత్రి కాకుండా కొందరు అడ్డుకున్నారు. గెలిచే టైమ్‌లో నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. పక్క పార్టీ నుంచి తెచ్చి దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్ ఇచ్చారు. జీవన్‌రెడ్డి ఓడినా టికెట్ ఎందుకు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక భజన సంఘాలు వచ్చి చేరాయాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.