
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం నాంపెల్లి రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా గాంధీభవన్ చేరుకున్నారు. అనంతరం టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానా రెడ్డిల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. త్వరలో నగరం అంతా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, సర్వేసత్యనారాయణలతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.