ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాన్వాయ్‌పై ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అనుచరులు దాడి చేశారు. అఖిలేష్ భద్రతా సిబ్బంది వెళ్తున్న వాహనంపై దాడికి పాల్పడ్డారు. బంజారాహిల్స్లోని హోటల్ హయత్ వద్ద ఈ ఘటన జరిగింది. సీఎం అఖిలేష్ వెంట వెళ్లేందుకు అంజన్‌కుమార్, ఆయన కుమారుడు అనిల్ ప్రయత్నించారు. అప్పటికే వాహనం నిండిపోవడంతో వెనుక వాహనంలో వెళ్లేందుకు యత్నించగా అఖిలేష్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా వాహనం ఎక్కేందుకు వీల్లేదని వారించారు. దీంతో ఆగ్రహించిన అంజన్ అనుచరులు రాళ్లతో దాడి చేశారు. యూపీ భద్రతాధికారిపై చేయిచేసుకున్నారు. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు అఖిలేష్ భద్రతా సిబ్బంది నిరాకరించారు.