ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జోరును అడ్డుకునేందుకు ఎస్పీ, బీఎస్పీలు జట్టు కట్టనున్నాయా? తాజా ఘటనలు అవుననే చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్యల రాజీనామా కారణంగా జరుగుతున్న రెండు లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ పరోక్షంగా మద్దతు తెలిపింది.