tieup
-
లాగ్ 9తో హీరో ఎలక్ట్రిక్ జత
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ హీరో ఎలక్ట్రిక్ తాజాగా ఆధునిక బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన బెంగళూరు సంస్థ లాగ్ 9 మెటీరియల్స్‌తో చేతులు కలిపింది. తద్వారా కంపెనీ రూపొందిస్తున్న ఈవీలకు ఇన్‌స్టా చార్జింగ్ బ్యాటరీ ప్యాక్‌లను అందించేందుకు వీలు కలగనుంది. లాగ్ 9 రూపొందిస్తున్న ర్యాపిడ్ఎక్స్ బ్యాటరీలను బీటూబీ కస్టమర్లకు వీలుగా హీరో ఎలక్ట్రిక్ టూవీలర్లలో అమర్చనుంది. ఇవి 15 నిముషాల సమయంలోనే పూర్తిస్థాయిలో చార్జ్కాగలవని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. ర్యాపిడ్ఎక్స్ పేరుతో 9 రెట్లు వేగవంత చార్జింగ్, ఉత్తమ నాణ్యత, మన్నికలతో బ్యాటరీలను రూపొందిస్తున్న కంపెనీ ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బైక్మేనియా తదితర బీటూబీ కంపెనీల ద్వారా పరిశీలనాత్మక విక్రయాలు చేపట్టింది. కాగా.. తాజా భాగస్వామ్యంతో రెండు కంపెనీలూ ఈ బ్యాటరీలను బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్(బీఏఎస్ఎస్) బిజినెస్ పద్ధతిలో మార్కెటింగ్ చేయనున్నాయి. -
యాక్సిమ్‌తో జట్టు కట్టిన మెజెంటా
ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో దేశీ కంపెనీలుగా దినదినాభివృద్ధి చెందుతున్న యాక్సి్‌మ్, మెజెంటా కంపెనీలు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. మెజెంటా సంస్థ ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ విభాగంలో పని చేస్తుండగా యాక్సి్‌మ్ సంస్థ ఈవీ ఛార్జర్లు, కాంపోనెంట్ల తయారీలో ఉంది. దేశీయంగా ఈవీ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజుకో కంపెనీ ఈవీ వెహికల్స్ తయారీలోకి వస్తున్నాయి. టూ వీలర్ మొదలు భారీ ట్రక్కుల వరకు త్వరలో ఈవీ వెహికల్స్ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. అయితే ఛార్జింగ్ పాయింట్లు అనేది ఈవీ వెహికల్స్‌కి అతి ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఈ రంగంలో మౌలిక సదుపాయాలు వేగంగా కల్పించే దిశగా యాక్సిమ్, మెజెంటాలు కలిసి పని చేయనున్నాయి. -
శ్రీరామ్ ఆటోమాల్.. ఎక్సేంజీలో భారత్ బెంజ్ ట్రక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహన రంగంలో ఉన్న దైమ్లర్ ఇండియా కమర్షియల్‌వెహికిల్స్ తాజాగా పాత వాహనాల క్రయ విక్రయాల్లో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదార్లు తమ పాత ట్రక్స్‌ను ఎక్సే్ంజ్ కింద భారత్ బెంజ్ శ్రేణి కొత్త, పాత వెహికిల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. శ్రీరామ్ ఆటోమాల్ వేదికగా భారత్ బెంజ్, ఇతర ఓఈఎంల వాహనాలను విక్రయిస్తారు. -
బుల్లితెర క్వీన్ ఏక్తా కపూర్ మరో ప్రయోగం
ముంబై: వీడియో షేరింగ్ సోషల్ మీడియా సంస్థ రోపోసో తాజాగా ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్‌తో చేతులు కలిపింది. ‘ఈకే’ బ్రాండ్ పేరిట గృహాలంకరణ, గృహోపకరణాలను ఆవిష్కరించింది. స్థానిక కళాకారులకు ఊతమిచ్చేందుకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఇది తోడ్పడగలదని ఏక్తా కపూర్ తెలిపారు. మొబైల్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ కంపెనీ ఇన్మొబీలో భాగమైన గ్లాన్స్కి రోపోసో అనుబంధ సంస్థగా ఉంది. కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్, గ్లాన్స్ మధ్య జాయింట్ వెంచర్ సంస్థ అయిన గ్లాన్స్ కలెక్టివ్ ’ఈకే’ బ్రాండ్ కింద మొట్టమొదటి కలెక్షన్ అందిస్తోందని ఇన్‌మొబి సీఈవో నవీన్ తివారీ తెలిపారు. ఈ కేటలాగ్‌లో కుషన్ కవర్లు, వాల్ ఆర్ట్ మొదలైన ఉత్పత్తులు గ్లాన్స్, రోపోసో ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ధరలు రూ.299 నుంచి ప్రారంభమవుతాయి -
దీదీ దూరమౌతుందా?
న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పాంత్రీయ పార్టీలతో సానిహిత్యం పెంచుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి భిన్నంగా బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ వేర్వేరుగా పోటి చేస్తున్నాయి. తృణమూల్‌తో పొత్తుకు కాంగ్రెస్ మొదటి నుంచి ప్రయత్నించినా మమత బెనర్జీ మాత్రం కాంగ్రెస్‌ను దూరంగా ఉంచారు. జాతీయ స్థాయిలో మోదీని ఓడించేందుకు లౌకిక శక్తులన్ని ఏకం కావాలని మమత పిలిపునిచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలతో సానిహిత్యంగా మెలుగుతున్న మమత కాంగ్రెస్‌కు మాత్రం మొదటి నుంచి కొంత దూరంగా ఉంటున్నారు. ఇటివల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తుకు మమత సిద్ధంగాలేరని, పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత పొత్తుల గురించి ఆలోచిస్తామని టీఎంసీ సీనియర్ నేత తెలిపారు. మమత మొదటి నుంచి బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నోట్ల రద్దు, జీఎస్టీ, వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మమత తీవ్ర స్థాయిలో కృషిచేస్తున్నారు. ఢిల్లీలో ఇటివల సోనియా గాంధీ విపక్ష పార్టీ నేతలకు ఇచ్చిన విందుకు మమత హాజరు కాలేదు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇచ్చిన విందుకు మాత్రం మమత హాజరై సంఘీభావం తెలిపిన విషయం విధితమే. కాగా 2016లో బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్- లెఫ్ట్ జతకట్టాయి. -
ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు!
-
ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జోరును అడ్డుకునేందుకు ఎస్పీ, బీఎస్పీలు జట్టు కట్టనున్నాయా? తాజా ఘటనలు అవుననే చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్యల రాజీనామా కారణంగా జరుగుతున్న రెండు లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ పరోక్షంగా మద్దతు తెలిపింది. బీజేపీని ఓడించగల అభ్యర్థికే తమ పార్టీ కార్యకర్తలు ఓటేస్తారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం ప్రకటించారు. అలాగే, త్వరలో జరగనున్న రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో అవగాహనకు వచ్చినట్లు మాయావతి చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలిచేలా ఎస్పీ సాయ పడుతుందనీ, అనంతరం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఆ పార్టీకి సాయపడేలా అవగాహన కుదిరిందన్నారు. -
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాదారులకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడి పథకాన్ని అందుబాటులోకి తెచ్చేలా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో)తో ఒక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు గురువారం ఒక అంగీకారానికి వచ్చింది. తద్వారా ఇ.పి.ఎఫ్.ఒ. తన చందాదారుల కోసం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏఐ) ద్వారా ప్రవేశపెట్టిన హౌసింగ్ పథకం ప్రయోజనాలను మౌలీకృతం చేస్తుంది. పిఎంఏ పరిధిలో సరసమైన గృహాలను కొనుగోలు చేసేందుకు రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీని సభ్యులకు అందించనుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ, వడ్డీ సబ్సిడీని పొందేందుకు గృహనిర్మాణ, పట్టణ అభివృద్ధి సంస్థతో ఇపిఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2022 నాటికి అందరికీ ఇల్లు అనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుందని ఒక అధికారిక ప్రకటనలో ఈపీఎఫ్‌వో తెలిపింది. హడ్కోతో కుదుర్చుకున్న ఈ ఒప్పదం ప్రకారం రూ. 2.67 లక్షల వరకు గృహ సబ్సిడీ ఇపిఎఫ్ సభ్యులు పొందుతారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్, హడ్కో సీఎండీ ఎం.రవి కంత్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. ఇపిఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్ ఈ ఒప్పందంపై మాట్లాడుతూ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇపిఎఫ్ఓ చందాదారులకు ఇళ్లు కొనుగోలు చేయడానికి చౌకైన రుణాలు వంటి వివిధ ప్రయోజనాలను అందించనున్నట్టు చెప్పారు.