ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ హీరో ఎలక్ట్రిక్ తాజాగా ఆధునిక బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన బెంగళూరు సంస్థ లాగ్ 9 మెటీరియల్స్‌తో చేతులు కలిపింది. తద్వారా కంపెనీ రూపొందిస్తున్న ఈవీలకు ఇన్‌స్టా చార్జింగ్ బ్యాటరీ ప్యాక్‌లను అందించేందుకు వీలు కలగనుంది. లాగ్ 9 రూపొందిస్తున్న ర్యాపిడ్‌ఎక్స్ బ్యాటరీలను బీటూబీ కస్టమర్లకు వీలుగా హీరో ఎలక్ట్రిక్ టూవీలర్లలో అమర్చనుంది. ఇవి 15 నిముషాల సమయంలోనే పూర్తిస్థాయిలో చార్జ్‌కాగలవని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది.
ర్యాపిడ్‌ఎక్స్ పేరుతో 9 రెట్లు వేగవంత చార్జింగ్, ఉత్తమ నాణ్యత, మన్నికలతో బ్యాటరీలను రూపొందిస్తున్న కంపెనీ ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బైక్‌మేనియా తదితర బీటూబీ కంపెనీల ద్వారా పరిశీలనాత్మక విక్రయాలు చేపట్టింది. కాగా.. తాజా భాగస్వామ్యంతో రెండు కంపెనీలూ ఈ బ్యాటరీలను బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్(బీఏఎస్‌ఎస్) బిజినెస్ పద్ధతిలో మార్కెటింగ్ చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment