Hero Electric Company
-
ఇక నుంచి అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్లు
-
హీరో ఎలక్ట్రిక్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ నూతన ప్లాంటును రాజస్థాన్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. లుధియానా వద్ద నెలకొల్పుతున్న ప్లాంటు నిర్మాణ దశలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని పీతాంపుర వద్ద ఉన్న మహీంద్రా గ్రూప్ ప్లాంటును వినియోగించుకునేందుకు ఆ సంస్థతో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. 2022–23లో ఒక లక్ష యూనిట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల యూనిట్ల విక్రయాలను కంపెనీ ఆశిస్తోంది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భాగస్వాములతో కలిసి పనిచేస్తునట్టు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజాల్ తెలిపారు. రెండు మూడేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకం స్థాయికి చేరతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 ఏళ్లలో కంపెనీ ఇప్పటి వరకు 6 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. మూడు కొత్త మోడళ్లు.. హీరో ఎలక్ట్రిక్ తాజాగా కొత్త ఆప్టిమా సీఎక్స్5.0 (డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా సీఎక్స్2.0 (సింగిల్ బ్యాటరీ), ఎన్వైఎక్స్ (డ్యూయల్ బ్యాటరీ) మోడళ్లను ప్రవేశపెట్టింది. ధర రూ.85 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంది. జపనీస్ మోటార్ టెక్నాలజీ, జర్మన్ ఈడీయూ సాంకేతికతతో ఇవి తయారయ్యాయి. బ్యాటరీ సేఫ్టీ అలారమ్, డ్రైవ్ మోడ్ లాక్, రివర్స్ రోల్ ప్రొటెక్షన్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి హంగులు ఉన్నాయి. 3 కిలోవాట్ అవర్ సీ5 లిథియం అయాన్ బ్యాటరీతో ఆప్టిమా సీఎక్స్5.0 తయారైంది. ఒకసారి చార్జింగ్‌తో 113 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో ఎన్వైఎక్స్ 113 కిలోమీటర్లు, సీఎక్స్2.0 మోడల్ 89 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ రెండు మోడళ్లూ గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయి. -
త్వరలో విడుదలకానున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేవారు రోజురోజుకి ఎక్కువవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాపులర్ కంపెనీల దగ్గర నుంచి, చిన్న కంపెనీల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో ఎలక్ట్రిక్' ఒక కొత్త స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హీరో ఎలక్ట్రిక్ త్వరలో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను కంపెనీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో హీరో కొత్త స్కూటర్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆప్టిమాను పోలి ఉందని తెలుస్తోంది. ఇది ఈ నెల 15న (2023 మార్చి 15) విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, దీని ఫ్రంట్ కౌల్ టాప్ పొజిషన్లో ఎల్ఈడీ హెచ్ల్యాంప్, సెంటర్లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కర్వీ సీట్, గ్రాబ్ రెయిల్, బ్లూ పెయింట్ థీమ్‌తో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రానున్న ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్) కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. ఇప్పటికే కంపెనీ ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇప్పుడు రాబోయే మోడల్ 8 వ స్థానంలో ఉంటుంది. A new era of intelligent and sustainable mobility is all set to dawn! Are you ready to experience the newest electrifying ride from Hero Electric? Watch this space to know more 🛵⚡#TheSmartMove pic.twitter.com/0nH6eSvFkO — Hero Electric (@Hero_Electric) March 12, 2023 -
ఈ–వీ అమ్మకాల్లో రికార్డ్ సేల్స్.. ఆ కంపెనీ బైకులను ఎగబడి కొంటున్న జనం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాల్లో హీరో ఎలక్ట్రిక్ కొత్త రికార్డు నమోదు చేసింది. సవాళ్లు ఉన్నప్పటికీ 2022లో ఏకంగా 1,00,000 పైచిలుకు యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. దశాబ్దానికి పైగా మార్కెట్లో సంస్థ నాయకత్వాన్ని అమ్మకాల మైలురాయి ప్రతిబింబిస్తుందని హీరో తెలిపింది.ఆరు లక్షలకుపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది. మూడేళ్లలో 50 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు. 25,000 మంది మెకానిక్‌లకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో శిక్షణ, పునర్ శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. భాగస్వాముల సహకారంతో దేశవ్యాప్తంగా 20,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
జపాన్ కంపనీ నైడెక్తో హీరో ఎలక్ట్రిక్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ మోటార్స్ తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం నైడెక్ కార్పొరేషన్‌తో హీరో ఎలక్ట్రిక్ ప్రాధాన్య భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హీరో తయారీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో నైడెక్ రూపొందించిన ఎలక్ట్రిక్ మోటార్స్‌ను వినియోగిస్తారు. 2023 ఫిబ్రవరిలో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు కావాల్సిన మోటార్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు నైడెక్తో రెండేళ్ల క్రితమే చేతులు కలిపినట్టు హీరో ఎలక్ట్రిక్ వెల్లడించింది. తమ సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడంలో జపాన్ నైడెక్తో భాగస్వామ్యం తోడ్పడుతుందని, ఉత్పత్తుల శ్రేణిలో పవర్‌ట్రెయిన్ భాగాలను క్రమంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని హీరో ఎలక్ట్రిక్సీఈవో సోహిందర్గిల్ అన్నారు. అలాగే భారతీయ పరిస్థితులకు తగినఆధునిక అధునాతన సాంకేతికతతో కూడిన హబ్ మోటార్ అభివృద్ధికి హీరో ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం ఉపయోగపడనుందని నైడెక్ ప్రతినిధి సంతోషం వ్యక్తం చేశారు. -
10 వేలకుపైగా ఉద్యోగాలు...ఈవెన్ కార్గోతో హీరో ఎలక్ట్రిక్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెలివరీ సేవల్లో ఉన్న ఈవెన్ కార్గోతో హీరో ఎలక్ట్రిక్ చేతులు కలిపింది. ఇందులో భాగంగా 2025 నాటికి 10,000 మందికిపైగా మహిళలను ఈవెన్ కార్గో వేదికపైకి తీసుకు వచ్చేందుకు హీరో ఎలక్ట్రిక్ సాయం చేస్తుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను సమకూరుస్తారు. ఈవెన్ కార్గో డెలివరీ ప్రతినిధులుగా పూర్తిగా మహిళలే ఉండడం విశేషం. పేద కుటుంబాలకు చెందిన మహిళలను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. చదవండి: ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్థిక శాఖ కీలక నిర్ధేశం..! -
ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ తాజాగా చార్జింగ్ మౌలిక వసతుల రంగంలో ఉన్న బోల్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏడాదిలో దేశవ్యాప్తంగా 50,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే 4.5 లక్షల పైచిలుకు వినియోగదార్లకు ప్రయోజనం కలిగించేందుకు 750కిపైగా హీరో ఎలక్ట్రిక్ విక్రయ కేంద్రాల్లో బోల్ట్ చార్జర్స్‌ను అందుబాటులో ఉంచుతారు. 2,000 మంది హీరో ఎలక్ట్రిక్ కస్టమర్ల ఇళ్ల వద్ద చార్జింగ్ యూనిట్లను ఉచితంగా నెలకొల్పుతారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 10 లక్షలకుపైగా చార్జింగ్ పాయి ంట్లను ఏర్పాటు చేయాలన్నది బోల్ట్ లక్ష్యం. చదవండి: రష్యాలో వ్యాపారానికి టాటా స్టీల్ గుడ్‌బై -
బంపరాఫర్,జాక్ పాట్ కొట్టేసిన 'హీరో'ఎలక్ట్రిక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. డెలివరీ సేవల్లో ఉన్న షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్‌కు 25,000 యూనిట్ల ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సరఫరా చేయనుంది. సంస్థ ఖాతాలో 2024 నాటికి ఈ–వెహికల్స్ వాటాను 75 శాతానికి చేర్చనున్నట్టు షాడోఫ్యాక్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ 7,000 పిన్‌కోడ్స్‌లో డెలివరీ సేవలు అందిస్తోంది. నెలకు 2 కోట్ల డెలివరీలను నమోదు చేస్తోంది. నమోదిత యూజర్లు 10 లక్షలకుపైమాటే. స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, బిగ్‌బాస్కెట్, లీషియస్ వంటి 100కుపైగా బ్రాండ్స్‌తో భాగస్వామ్యం ఉంది. -
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్..రేంజ్లో కూడా అదుర్స్..! ధర ఎంతంటే...?
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ త్వరలోనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్‌ఫోలియోలోని ఆప్టిమా హెచ్ఎక్స్ సిరీస్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ 2022 హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. CX, CX ER వేరియంట్లలో రానుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ వేరియంట్ సింగిల్ బ్యాటరీతో వస్తుండగా..సీఎక్స్ ఈఆర్ డ్యూయల్ బ్యాటరీతో రానుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్‌మునుపటి మోడల్ కంటే 25 శాతం ఎక్కువ శక్తివంతమైనదిగా అంచనా వేయబడింది.దాంతో పాటుగా ఎలక్ట్రిక్ మోటారు సామర్థ్యం మునుపటి కంటే 10 శాతం ఎక్కువగా ఉండనుంది. రేంజ్ ఎంతంటే..? హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ స్పెక్స్ వివరాలలోకి వెళితే...ఈ స్కూటర్లో 52.2Volt, 30ah లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. బేస్ CX వేరియంట్ 82 కిమీ పరిధిని అందించే ఒకే యూనిట్‌ను పొందుతుంది, అయితే CX ER డ్యూయల్ బ్యాటరీలతో అందించబడుతుంది. దీంతో ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కిమీల రేంజ్ వరకు ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్ 550W ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తాయి, ఇది గరిష్టంగా 45kmph వేగంతో 1.2kW (1.6 bhp) గరిష్ట అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ సమయం దాదాపు 4-5 గంటలు. ఫీచర్ల విషయానికి వస్తే..! హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్, సీఎక్స్ ఈఆర్ రెండు వేరియంట్లలో ఒకే రకపు ఫీచర్లుతో రానున్నాయి. క్రూయిజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్, రివర్స్ మోడ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, LED హెడ్‌ల్యాంప్‌లు, రిమోట్ కీతో కూడిన యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లను అందిస్తుంది. ధరల విషయానికొస్తే, Optima CX స్కూటర్ ధర Optima HX సిరీస్ కంటే కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఈ రెండు మోడల్స్ ధరలు రూ. 60,000 నుంచి రూ. 70,000 మధ్య ఉండవచ్చునని తెలుస్తోంది. ఆప్టిమా సీఎక్స్ రెండు వేరియంట్లు బ్లూ, గ్రే , వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయి. చదవండి: కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన కియా ఇండియా..! -
Hero Electric Eddy: రూ.72 వేలకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. విడుదల అప్పుడే!
Hero Electric launches Eddy: దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ భారత వినియోగదారుల కోసం మరో కొత్త మోడల్ "ఎడ్డీ(Eddy)" ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కూటర్‌ను తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ హీరో ఎడ్డీ స్కూటర్లో ఫైండ్ మై బైక్, ఈ-లాక్, లార్జ్ బూట్ స్పేస్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్లో, లైట్ బ్లూ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. అయితే, ఈ స్కూటర్ తొలడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. అలాగే, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అని సంస్థ తెలిపింది. ఈ స్కూటర్ ధర సుమారు రూ.72,000గా ఉండే అవకాశం ఉంది. కొత్తగా తీసుకొని రాబోయే స్కూటర్ గురించి హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజల్ మాట్లాడుతూ.. "స్మార్ట్ ఫీచర్లు, స్టైలిష్ లుక్స్ కలిగిన అద్భుతమైన ప్రొడక్ట్ హీరో ఎడ్డీని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం" అని అన్నారు. ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే రెండు ప్రముఖ మోడల్స్ Hero Electric Atria LX, Hero Electric Flash LX వంటి వాహనాలను విక్రయిస్తుంది. (చదవండి: ప్రాంతీయ విమాన సేవలకు ప్రత్యేక పాలసీ!) -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుదారులకు ఎస్బీఐ బంపరాఫర్, రూ.250కే ఈఎంఐ లోన్!!
ఎలక్ట్రిక్ కొనుగోలుదారులకు ఎస్బీఐ-ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ హీరో బంపరాఫర్లు ప్రకటించాయి. నిబంధలనకు అనుగుణంగా ఎంపికైన కస్టమర్లకు అతితక్కువకే ఫైనాన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపాయి. హీరో సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్స్ పై కస్టమర్లకు ఫైనాన్స్ అందించేందుకు ఎస్ బీఐతో జతకడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఎస్బీఐ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ యోనో యాప్ ద్వారా చేసిన చెల్లింపులపై అదనంగా రూ.2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాదు అర్హులైన కొనుగోలుదారులు ఎస్బీఐ యోనో యాప్‌లో ఎస్బీఐ ఈజీ రైడ్ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్‌పై 4 సంవత్సరాల పాటు రూ.251 కంటే తక్కువ ఈఎంఐ సౌకర్యంతో రూ.10వేల లోన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో ఈఎంఐను మరింత సులభతరం చేయడం ద్వారా దేశంలోని గ్రీన్ మొబిలిటీ విప్లవానికి నాంది పలికినట్లవుతుందని ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బిజినెస్ యూనిట్ చీఫ్ జనరల్ మేనేజర్ దేవేంద్ర కుమార్ అన్నారు. హీరోఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ..ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్ ఉంది. ఈనేపథ్యంలో కొనుగోలుదారుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఎస్బీఐతో భాగస్వామి అవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ భాగస్వామ్యం గ్రీన్ మొబిలిటీ విప్లవానికి ఆజ్యం పోసేందుకు ఉత్తమ వడ్డీ రేట్లు, ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు. -
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి హీరోఎలక్ట్రిక్ గుడ్‌న్యూస్..!
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను సొంతం చేసుకునే కస్టమర్ల కోసం యాక్సిస్‌బ్యాంక్‌తో హీరోఎలక్ట్రిక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఆయా ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారులకు సులభమైన రిటైల్ ఫైనాన్సింగ్ లభించనుంది. మరింత సులువుగా..! హీరో ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలోని ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలుపై సులభమైన, అవాంతరాలు లేని రిటైల్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను కొనుగోలుదారులకు అందించనుంది .ఈ ఫైనాన్సింగ్ సౌకర్యం 750 కంటే ఎక్కువ డీలర్ల వద్ద లభించనుంది. యాక్సిస్ బ్యాంకుతో కంపెనీ చేసుకున్న భాగస్వామ్యంతో హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లు కనీస డాక్యుమెంటేషన్‌తో భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చునని కంపెనీ వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్టుగా..! గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిమాండ్ నెలకొంది. డిమాండ్‌కు తగ్గట్లుగా ఈవీ స్కూటర్ల కొనుగోలులో కస్టమర్లకు ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని హీరో ఎలక్ట్రిక్ CEO సోహిందర్ గిల్ చెప్పారు. పెరుగుతున్న డిమాండ్‌తో నాన్-టైర్ 1 నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు మరింత వేగంగా ఈవీ స్కూటర్లను తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం గ్రీన్ మొబిలిటీని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని గిల్ పేర్కొన్నారు. చదవండి: భారత్‌లో లాంఛ్‌కు ముందే బుకింగ్‌కు టయోటా బ్రేకులు! క్లారిటీ ఇచ్చిన కంపెనీ -
ఈవీ డిమాండ్ పెరగడంతో జతకట్టిన హీరో-మహీంద్రా..!
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో వాహనాల కొరతను అధిగమించేందుకు భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలలో ఒకటైన హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా & మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒప్పందాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రా గ్రూప్‌కి చెందిన పితంపూర్ ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా, ఎన్ వైఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నారు. ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొరతను అధిగమించే అవకాశం ఉంది. హీరో ప్రస్తుతం తనకున్న లూధియానా ప్లాంట్ విస్తరణతో 2022 నాటికి ఏడాదికి 1 మిలియన్ ఈవీలను తయారు చేయాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలదు. ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రకు చెందిన ప్యుగోట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ తయారు చేసే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం వల్ల కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీలను తయారు చేయడానికి ఆర్ అండ్ డి బృందాల మధ్య ఎటువంటి ఆటంకం లేకుండా నాలెడ్జ్ షేరింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం భవిష్యత్‌లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొరత ఏర్పడకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది రెండు కంపెనీలు తెలిపాయి. హీరో ఎలక్ట్రిక్ ఇప్పటివరకు 12 మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా 4 లక్షల కస్టమర్లను సంపాధించుకుంది. అలాగే, ఇండియా మొత్తం ఇప్పటి వరకు 2 వేల ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసింది. (చదవండి: బేర్ దెబ్బకు 18 వేల పాయింట్స్ కిందకు పడిపోయిన నిఫ్టీ..!) -
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు శుభవార్త!
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు హీరో ఎలక్ట్రిక్ శుభవార్త చెప్పింది. భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్ సర్వీసింగ్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పింది. ఇందుకోసం హీరో ఎలక్ట్రిక్ తాజాగా ఆటోమోటివ్ మల్టీ సైడెడ్ ప్లాట్‌ఫామ్.. స్పేరిట్తో చేతులు కలిపింది. తద్వారా ప్రయివేట్ గ్యారేజ్ యజమానులకు ఎలక్ట్రిక్ వాహన సర్వీసింగులో శిక్షణ ఇవ్వడంతోపాటు.. ఆయా సంస్థల నెట్‌వర్క్‌ను వినియోగించుకోనుంది. వెరసి తమ ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని సర్వీసింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. స్పేరిట్తో ఒప్పందం కారణంగా ప్రయివేట్ గ్యారేజ్ యజమానులతోపాటు.. కంపెనీకి చెందిన బీటూబీ, బీటూసీ క్లయింట్లకు సైతం ఎలక్ట్రిక్ వాహన సర్వీసులను అందించనున్నట్లు తెలిపింది. చదవండి: రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు -
లాగ్ 9తో హీరో ఎలక్ట్రిక్ జత
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ హీరో ఎలక్ట్రిక్ తాజాగా ఆధునిక బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన బెంగళూరు సంస్థ లాగ్ 9 మెటీరియల్స్‌తో చేతులు కలిపింది. తద్వారా కంపెనీ రూపొందిస్తున్న ఈవీలకు ఇన్‌స్టా చార్జింగ్ బ్యాటరీ ప్యాక్‌లను అందించేందుకు వీలు కలగనుంది. లాగ్ 9 రూపొందిస్తున్న ర్యాపిడ్ఎక్స్ బ్యాటరీలను బీటూబీ కస్టమర్లకు వీలుగా హీరో ఎలక్ట్రిక్ టూవీలర్లలో అమర్చనుంది. ఇవి 15 నిముషాల సమయంలోనే పూర్తిస్థాయిలో చార్జ్కాగలవని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. ర్యాపిడ్ఎక్స్ పేరుతో 9 రెట్లు వేగవంత చార్జింగ్, ఉత్తమ నాణ్యత, మన్నికలతో బ్యాటరీలను రూపొందిస్తున్న కంపెనీ ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బైక్మేనియా తదితర బీటూబీ కంపెనీల ద్వారా పరిశీలనాత్మక విక్రయాలు చేపట్టింది. కాగా.. తాజా భాగస్వామ్యంతో రెండు కంపెనీలూ ఈ బ్యాటరీలను బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్(బీఏఎస్ఎస్) బిజినెస్ పద్ధతిలో మార్కెటింగ్ చేయనున్నాయి. -
దేశ చరిత్రలో రికార్డు.. ఎలక్ట్రిక్ వాహనాల జోరు తగ్గట్లేదుగా!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబర్ 2020లో 12,858 యూనిట్లు, అక్టోబర్ 2021లో 38,715 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2021 నెలలో సుమారు 42,067 యూనిట్ల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకోవడంతో దిగ్గజ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఒక నెలలో 40,000 మార్కును దాటడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఏప్రిల్-నవంబర్ 2021 కాలంలో మొత్తం 1.98 లక్షల-ప్లస్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ల అమ్మకాలు పండుగ సీజన్ తర్వాత కూడా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల బూమ్ కొనసాగుతుంది. నవంబర్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు ఊపందుకోవడంతో మొత్తంగా ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు పెరిగాయి. 2020 నవంబరులో సుమారు 4,000 అమ్మకాలతో పోలిస్తే 2021 నవంబరులో నమోదైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఐదు రెట్లు పెరిగి 22,450 యూనిట్లగా ఉన్నాయి. సీఈఈఈ(కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్) అందించిన వివరాల ప్రకారం నెల నెలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 17 శాతం పెరుగుతున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, అథర్, ప్యూర్ ఈవీ వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీలు భారీగా వృద్దిని నమోదు చేశాయి. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారికి గుడ్‌న్యూస్..!) దేశంలో భారీగా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లీడర్ హీరో ఎలక్ట్రిక్ ప్రతినిధి మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే కాలంలో 11,339 యూనిట్లతో పోలిస్తే అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15, 2021 కాలంలో 24,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మినట్లు పేర్కొంది. అథర్ అమ్మకాలు కూడా గత ఏడాది నవంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక పక్క ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ కంపెనీల అమ్మకాల పెరుగుతుండటం, మరోపక్క కొత్త కంపెనీలు రంగ ప్రవేశం చేయడంతో ఈవీ వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో భారీగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరుగుతాయని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. ఎలక్ట్రిక్ ఆటో, కార్ల అమ్మకాలు నవంబర్ నెలలో రిజిస్టర్డ్ త్రి వీలర్(ప్యాసింజర్, కార్గో టైప్ రెండూ) అమ్మకాలు 18,011 యూనిట్లుగా ఉన్నాయి, అక్టోబర్ 2021 రిజిస్ట్రేషన్ల కంటే కేవలం 7 యూనిట్లు మాత్రమే పెరిగాయి. ప్యాసింజర్ ఈ3డబ్ల్యు అమ్మకాలు దాదాపు అలాగే ఉండగా, కార్గో ఈ3డబ్ల్యు అమ్మకాలు గత నెల అమ్మకాలు 2 శాతం పడిపోయాయని జేఎంకే రీసెర్చ్ తెలిపింది. నవంబర్ నెలలో ఎలక్ట్రిక్ కార్ల మొత్తం అమ్మకాలు 1,539 యూనిట్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, ఎంజి మోటార్స్ ఈ-కార్ల అమ్మకాలలో తమ సత్తా చాటుతున్నాయి. టాటా మోటార్స్ వాటా గత నెల 80 శాతంతో పోలిస్తే 89 శాతానికి పెరిగింది. (చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్..!) -
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు!
దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం తక్కువ ధరకు మంచి రేంజ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. గత ఏడాది కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ప్రముఖ కంపెనీకి చెందిన ఈ-స్కూటర్లు భారీగా అమ్ముడవుతున్నాయి. 'భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ' అనే బిరుదును హీరో ఎలక్ట్రిక్ ఇటీవల దక్కించకుంది. హీరో ఎలక్ట్రిక్: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనలను విక్రయించినట్లు తెలిపింది. భారతదేశ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో 36 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీ కలిగి ఉంది. సోలార్, విండ్ & ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్ పరిశోధన సంస్థ జెఎంకె రీసెర్చ్ అండ్ ఎనలిటిక్స్ ఇటీవల ఒక సర్వేను చేపట్టింది. ఆ సర్వేలో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల పరంగా భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచాయి. కరోనావైరస్ మహమ్మారి వల్ల మార్కెట్లో మందగమనం ఏర్పడినప్పటికి ఈ ఏడాది దేశంలోని ప్రధాన కేంద్రాల్లో గరిష్ట సంఖ్యలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. జనవరి 2021 నుంచి ఈవీ తయారీదారు హీరో ఎలక్ట్రిక్ 65,000కు పైగా స్కూటర్లను విక్రయించింది. హీరో ఎలక్ట్రిక్ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 700 డీలర్ షిప్‌లు, 2000 ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. త్వరలో భారతదేశంలో మరో 20,000 ఈవి ఛార్జింగ్ స్టేషన్లను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ తన తయారీ సామర్ధ్యాన్ని కూడా విస్తరిస్తుంది. 2025 నాటికి ఏడాదిలో 1 మిలియన్ ఈవీలను తయారు చేయాలని యోచిస్తోంది. (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్ గుడ్‌న్యూస్) -
చార్జర్‌తో హీరో ఎలక్ట్రిక్ జట్టు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయాల సంస్థ చార్జర్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు విద్యుత్ వాహనాల సంస్థ హీరో ఎలక్ట్రిక్ వెల్లడించింది. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1 లక్ష చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తొలి ఏడాదిలో టాప్ 30 నగరాల్లో చార్జర్ 10,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుందని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహీందర్ గిల్ వివరించారు. వినియోగదారుల సౌకర్యార్ధం హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కిరాణా స్టోర్స్, అపార్ట్మెంట్లు, ఆఫీసులు, మాల్స్ మొదలైన చోట్ల విస్తృతమైన చార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చార్జర్ సహ వ్యవస్థాపకుడు సమీర్ రంజన్ జైస్వాల్ తెలిపారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే చార్జర్‌కు హైదరాబాద్, వైజాగ్‌తో పాటు 20 నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. -
జోరందుకున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీసంస్థ హీరో ఎలక్ట్రిక్ అక్టోబర్ నెలలో గణనీయంగా అమ్మకాలు జరిపింది. గత నెలలో తన 6,366 హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ నెలలో 6,500 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది అమ్మకాల(314 యూనిట్లు)తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 1900 శాతం ఎక్కువగా పెరిగాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం అమ్మకాలు 50,331 యూనిట్లకు చెరినట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. "వినియోగదారులకు 50,000 బైక్ లను డెలివరీ చేయడం మాకు సంతోషంగా ఉన్నప్పటికీ, డెలివరీల కోసం వెయిటింగ్ జాబితాలో ఉన్న మరో 16,500 మంది కస్టమర్లకు మేము క్షమాపణ చెప్పాలి. పెరుగుతున్న డిమాండ్లకు తగ్గట్టు రాబోయే రోజుల్లో వాహన డెలివరీ చేయడానికి సంస్థ తన సామర్థ్యాలను పెంచాలని చూస్తోందని" ఆయన అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీని ఐదు లక్షల యూనిట్ల వరకు విస్తరించనున్నట్లు కంపెనీ ఇంతకు ముందు తెలిపింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు ఐఓసీఎల్ గుడ్‌న్యూస్!) హైస్పీడ్ కేటగిరీలో హీరో ఎలక్ట్రిక్ సిటీ స్పీడ్ స్కూటర్లు ఆప్టిమా, ఎన్ వైఎక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య కాలంలో ఈ రెండు ఎలక్ట్రిక్ హైస్పీడ్ స్కూటర్లు భారత్ అంతటా 15,000 అమ్ముడయ్యాయి. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం దేశం అంతటా 1650 ఛార్జింగ్ స్టేషన్లను హీరో ఎలక్ట్రిక్ కలిగి ఉంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్!
మీరు దసరా, దీపావళి పండుగ సందర్భంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తునారా? అయితే, మీకు అదిరిపోయే శుభవార్త. హీరో ఎలక్ట్రిక్ '30 రోజులు, 30 స్కూటర్లు' పేరుతో పండుగ ఆఫర్ ప్రకటించింది. మీరు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాలంటే అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న 700+ హీరో డీలర్ షిప్ లేదా వెబ్సైట్ లో స్కూటర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేసే వినియోగదారులలో ఒక లక్కీ కస్టమర్ తను కోరుకున్న హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ 30 రోజుల్లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు అందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా తీయనున్నారు. ఎలక్ట్రిక్ వాహనం కొన్న తర్వాత వాహనం ఎక్స్ షోరూమ్ ధరను పూర్తిగా రీఫండ్ చేస్తారు. హీరో ఎలక్ట్రిక్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ సర్వీసులు అందిస్తుంది. కస్టమర్లు హీరో ఎలక్ట్రిక్ వెబ్సైట్ లేదా దేశవ్యాప్తంగా 700 టచ్ పాయింట్ల వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. హీరో ఎలక్ట్రిక్ తక్కువ ధరతో ఈఎమ్ఐ సులభమైన ఫైనాన్సింగ్ సౌకర్యం అందిస్తుంది. అంతేగాక, వినియోగదారులకు లిథియం అయాన్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 5 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అయితే, నాలుగు ఏళ్ల తర్వాత బ్యాటరీ, చార్జర్ పై ఎటువంటి వారంటీ వర్తించదు. (చదవండి: టాటా రయ్.. ఝున్‌ఝున్‌వాలా ఖాతాలో 375 కోట్లు!) -
ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ కష్టాలకు చెక్!
ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగదారులకు శుభవార్త. దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్ భాగస్వామ్యంలో దేశం మొత్తం మీద ఈ ఏడాది చివరి నాటికి 10వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ తెలిపారు. పెట్రో ధరలు పెరగడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసినా..వాటి ఛార్జింగ్ నిర్వహణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పలు ఆటోమొబైల్ కంపెనీలు దేశ వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా హీరో ఎలక్ట్రిక్ సంస్థ వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం 20వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సందర్భంగా సోహిందర్ గిల్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్రం ఈవీ వెహికల్స్ వినియోగాన్ని ప్రోత్సహించడంపై ఆటోమొబైల్ సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్ సైతం ఈవీ విభాగంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహించేలా తక్కువ ధరకే ఛార్జింగ్ స్టేషన్లను తయారు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1650 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం. 2022 చివరి నాటికి 20వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అంతేకాదు ఇటీవల తాము నిర్వహించిన సర్వేలో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం ఎలా ఉందో గుర్తించాం. అవసరానికి తగ్గేట్లే ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ చెప్పారు. చదవండి: మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్, మిగిలిన వాటితో పోలిస్తే ధర తక్కువే -
పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహన అమ్మకాలు నిలిపివేయాలి
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజల్ 2027 నాటికి ఇంధనాలతో నడిచే ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొనే వారి సంఖ్య చైనా వంటి దేశాల కంటే చాలా తక్కువ అని అన్నారు. అధిక ధరలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఈవీ రంగం దెబ్బతింటుంది అని పేర్కొన్నారు. ప్రపంచ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో చైనా 97 శాతం వాటా కలిగి ఉండగా, అదే భారతదేశం అమ్మకాల్లో 1 శాతం కంటే తక్కువ అని అన్నారు. ఇంధనాలతో నడిచే ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధిస్తే ఇతర దిగ్గజ కంపెనీలు వేగంగా ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అని ఆయన అన్నారు. ఒకసారి ప్రధాన కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వైపు అడుగు వేస్తే అన్నీ మౌలిక సదుపాయాల కొరత వంటి ఇతర సమస్యలు అన్నీ తగ్గే అవకాశం ఉంది అని అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ వేహికల్ మేకర్ తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు విస్తరించడానికి 700 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆలోచిస్తోంది. హీరో ఎలక్ట్రిక్ ఈవీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారతదేశం అంతటా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఎగుమతుల ద్వారా ఐరోపా, లాటిన్ అమెరికా వంటి మార్కెట్లలో తన ఉనికిని చాటాలని యోచిస్తోంది.(చదవండి: Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?) -
ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ తాజాగా వీల్స్ ఈఎంఐతో చేతులు కలిపింది. సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు హీరో కస్టమర్లకు వీల్స్ ఈఎంఐ రుణం అందిస్తుంది. అలాగే తక్కువ పత్రాలతో ఆకర్శణీయ వడ్డీ రేటు, సౌకర్యవంతమైన, అందుబాటు ధరలో నెల వాయిదాలు ఆఫర్ చేస్తుందని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. 13 రాష్ట్రాల్లో 100కుపైగా నగరాల్లో వీల్స్ ఈఎంఐ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రతి నెల 10 వేలకుపైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను హీరో ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. ఇందులో 40 శాతం వాటా గ్రామీణ ప్రాంతాలు కైవసం చేసుకున్నాయి. చదవండి : ‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’టార్గెట్ అదే! -
హీరో ఎలక్ట్రిక్ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్
ప్రముఖ ఈవీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ తన ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్ కల్పించింది. కంపెనీలో కనీసం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగీకి కొన్ని ప్రయోజనాలను కలిపించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి సమాన స్థాయిలో ప్రయోజనాలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది.(చదవండి: e-Shram: కార్మికులకు అండగా ఇ-శ్రమ్) రెండు ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కంపెనీలో ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ ఉపాధిని కల్పించడం. ఉద్యోగులకు వాహన రుణాలను అందించడం, అలాగే అదనపు సెలవులు ఇవ్వడం. దీర్ఘకాలిక గృహ రుణాలను స్థిర వడ్డీకి హీరో కేర్ అందిస్తుంది. ఉద్యోగులకు ప్రసూతి సెలవుల కింద 15 రోజులు సెలవులు ఇవ్వడం, 6 నెలల వరకు నచ్చిన సమయంలో పనిచేసే అవకాశం, మొదటి 3 నెలల్లో 10 రోజుల వరకు ఇంట్లో నుంచి పనిచేయవచ్చు. 20-25 సంవత్సరాల వయస్సు ఉన్న ఉద్యోగులు పనితీరు ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యా రుణాలు, స్కాలర్ షిప్స్ ఇవ్వనుంది. పరీక్షల సమయంలో వారికి ఫ్లెక్సీబుల్ టైమింగ్స్ కల్పించనుంది. హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజల్ మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు కొన్ని ప్రయోజనాలు కల్పించడమే కాకుండా వారి కుటుంబాన్ని వారి కెరీర్ లో ముందే ఉండే విధంగా సంస్థ సహాయం అందిస్తుంది. మా ఉద్యోగులు గత రెండు సంవత్సరాలుగా కష్టపడి పనిచేయడం వల్ల ఈ రోజు మేము ఈ స్థాయికి చేరుకున్నాము అని" అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు మాజీ హీరో క్లబ్ లోచేరి తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది అని అన్నారు. క్లబ్ లో జాయిన్ అయిన వారికి ఐదు సంవత్సరాల వరకు ఉచిత వార్షిక ఆరోగ్య చెకప్స్ చేయనున్నారు. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న హీరో ఎలక్ట్రిక్!
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ హీరో ఎలక్ట్రిక్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15,000కు పైగా హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అమ్మినట్లు ప్రకటించింది. భారతదేశంలోని ఏ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనా కంపెనీ కూడా దీనికి దగ్గరలో లేదు. జెఎంకె నివేదిక ప్రకారం.. జూలై నెలలో 4,500కు పైగా హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో కంపెనీ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు సంవత్సరానికి 3 లక్షల ఈవీలను తయారు చేయడానికి భారీగా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తుండటంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాలనాలకు డిమాండ్ పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లు ఆప్టిమా, నైక్స్ ధరలు రూ.53,600 ప్రారంభం కావడంతో డిమాండ్ మరింత పెరిగినట్లు హీరో సంస్థ భావిస్తుంది. గత నెలల్లో కంపెనీ గణనీయమైన సంఖ్యలో బుకింగ్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అధిక డిమాండ్ గురించి హీరో ఎలక్ట్రిక్ డీలర్ శ్రీ రాజేష్ జడం మాట్లాడుతూ.. "జూన్ 11 తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 10 రేట్లకు పైగా పెరిగింది. మేము దాదాపు 8 సంవత్సరాలుగా హీరో ఎలక్ట్రిక్ డీలర్లుగా ఉన్నాము. జూలై నెలలో మాకు భారీగా బుకింగ్స్ కోసం ఎక్కువగా ఎంక్వైరీలు వచ్చినట్లు" అని పేర్కొన్నారు. "హీరో స్కూటర్ల ధరలు ఇప్పుడు రూ.70,000 కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఇది చాలా తక్కువ, వినియోగదారులు టెస్ట్ రైడింగ్ చేసిన వెంటనే వాటిని బుక్ చేస్తున్నారు. సుమారు 90% స్కూటర్లు బుక్ చేశారు" అని డీలర్ అన్నారు.