
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ తాజాగా వీల్స్ ఈఎంఐతో చేతులు కలిపింది. సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు హీరో కస్టమర్లకు వీల్స్ ఈఎంఐ రుణం అందిస్తుంది.
అలాగే తక్కువ పత్రాలతో ఆకర్శణీయ వడ్డీ రేటు, సౌకర్యవంతమైన, అందుబాటు ధరలో నెల వాయిదాలు ఆఫర్ చేస్తుందని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. 13 రాష్ట్రాల్లో 100కుపైగా నగరాల్లో వీల్స్ ఈఎంఐ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రతి నెల 10 వేలకుపైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను హీరో ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. ఇందులో 40 శాతం వాటా గ్రామీణ ప్రాంతాలు కైవసం చేసుకున్నాయి.
చదవండి : ‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’టార్గెట్ అదే!