
న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్.. హెవీ డ్యూటీ, హై–స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రెండు అధునాతన స్కూటర్లను రూపొందించి మార్కెట్లోకి విడుదలచేసినట్లు ప్రకటించింది. ఆప్టిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్ ఈఆర్ పేర్లతో ఇవి అందుబాటులోకి రాగా, వీటి ధరల శ్రేణి రూ.68,721–రూ.69,754 (ఢిల్లీ–ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఈ వాహనాలకు ఫేమ్–2 పథకం కింద రాయితీ వర్తిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ డీలర్ల వద్ద స్కూటర్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ సీఈఓ సోహిందర్ గిల్ వివరించారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బెంగళూరులో కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ఈ సందర్భంగా కంపెనీ ప్రకటించింది.