
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. డెలివరీ సేవల్లో ఉన్న షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్‌కు 25,000 యూనిట్ల ఎన్‌వైఎక్స్ హెచ్‌ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సరఫరా చేయనుంది.
సంస్థ ఖాతాలో 2024 నాటికి ఈ–వెహికల్స్ వాటాను 75 శాతానికి చేర్చనున్నట్టు షాడోఫ్యాక్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ 7,000 పిన్‌కోడ్స్‌లో డెలివరీ సేవలు అందిస్తోంది. నెలకు 2 కోట్ల డెలివరీలను నమోదు చేస్తోంది.
నమోదిత యూజర్లు 10 లక్షలకుపైమాటే. స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, బిగ్‌బాస్కెట్, లీషియస్ వంటి 100కుపైగా బ్రాండ్స్‌తో భాగస్వామ్యం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment