ముంబై: పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్‌సైకిల్స్‌పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.
నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్ ఎక్స్ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment