Pure
-
ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌లోకి ప్యూర్ ఈవీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ప్యూర్ తాజాగా ‘స్మార్ట్ ఇన్వర్టర్ల’ విభాగంలోకి ప్రవేశించింది. గృహ, వాణిజ్య అవసరాల కోసం ‘ప్యూర్‌పవర్’ పేరిట విద్యుత్ స్టోరేజీ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. ఇవి 3 కేవీఏ, 5 కేవీఏ, 15 కేవీఏ సామర్థ్యంతో లభిస్తాయి. ధర రూ. 74,999 నుంచి రూ. 1,74,999 వరకు ఉంటుంది. సాంప్రదాయ ఇన్వర్టర్ల కన్నా మెరుగ్గా ఏసీలు, ఇతరత్రా ఉపకరణాలను కూడా ఉపయోగించుకునేందుకు అవసరమైనంత విద్యుత్‌ను ఇవి బ్యాకప్‌గా అందించగలవు.వీటికి బుకింగ్స్ ఏప్రిల్ 1 నుంచి, డెలివరీలు ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ దొంగారి తెలిపారు. వీటిని పునరుత్పాదక విద్యుత్‌కు కూడా అనుసంధానించుకోవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం (4 ఎండబ్ల్యూహెచ్ సామర్థ్యంతో) ప్యూర్‌పవర్ గ్రిడ్ ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.దేశీయంగా పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం, మొత్తం వాహనాల్లోఈవీల వాటాను 40 శాతానికి పెంచుకోవాలనేది లక్ష్యమని చెప్పారు. -
విద్యుత్ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ప్యూర్(Pure) సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఇళ్లతోపాటు, వాణిజ్య, గ్రిడ్స్థాయిలో ఉపయోగపడే ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ (విద్యుత్తును నిల్వ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా వాడుకునేందుకు వీలు కల్పించే) ఉత్పత్తులను ‘ప్యూర్-పవర్(Pure-Power)’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఇవి సాధారణ యూపీఎస్‌లలో మాదిరిగా వీటిల్లో లెడ్ ఆక్సైడ్ బ్యాటరీలు కాకుండా.. అత్యాధునిక లిథియం-అయాన్ బ్యాటరీలు ఉండటం ఒక ప్రత్యేకతైతే.. సౌర విద్యుత్తు లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా ఎటువంటి అదనపు పరికరాల అవసరం లేకుండా నిల్వ చేసుకోగలగడం ఇంకో ప్రత్యేకత. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే.. మీ ఇంటిపైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ‘ప్యూర్-పవర్: హోం’ను వాడటం మొదలుపెట్టారనుకోండి.. మీ ఇంటికి కావాల్సిన విద్యుత్తును అక్కడికక్కడ ఉత్పత్తి చేసుకుని వాడుకోవడమే కాకుండా.. మిగిలిపోయిన విద్యుత్తును నేరుగా ప్రభుత్వానికి అమ్ముకోవచ్చునన్నమాట. నీతీఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి.కె.సారస్వత్ మంగళవారం హైదరాబాద్‌లోని నోవోటెల్లో ప్యూర్-పవర్ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్యూర్ సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిశాంత్ దొంగరి మాట్లాడుతూ ‘‘దేశం మొత్తమ్మీద రానున్న 18 నెలల్లో 300 మంది డీలర్ల ద్వారా ‘ప్యూర్-పవర్’ ఉత్పత్తులను మార్కెట్ చేయనున్నాము’’ అని తెలిపారు. యూపీఎస్‌లతో పోలిస్తే ప్యూర్-పవర్ ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనవని, నానో పీసీఎం మెటీరియల్ ద్వారా భద్రతకు పెద్దపీట వేశామని ఆయన తెలిపారు. ప్యూర్-పవర్లో ప్రస్తుతం రెండు రకాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని, గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’ను వచ్చే ఏడాది లాంచ్ చేస్తామన్నారు. ఇళ్లల్లో, అపార్ట్మెంట్లలో వాడుకోగలిగిన ‘ప్యూర్-పవర్:హోం’ 3 కిలోవోల్ట్ ఆంపియర్ (కేవీఏ), 5కేవీఏ, 15కేవీఏ సామర్థ్యాల్లో లభిస్తాయని ధర రూ.74,999తో ప్రారంభమవుతాయని చెప్పారు.దుకాణాలు, కార్యాలయాలు, టెలికాం టవర్స్ వంటి వాటి కోసం 25 కేవీఏ నుంచి 100 కేవీఏల సామర్థ్యం గల ‘ప్యూర్-పవర్’ కమర్షియల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని నిశాంత్ వివరించారు. వీటి వాడకం ద్వారా డీజిల్ జనరేటర్ల అవసరాన్ని లేకుండా చేసుకోవచ్చునని తెలిపారు. ప్యూర్-పవర్ మూడో ఉత్పత్తి గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకునేదని, 20 అడుగుల పొడవైన కంటెయినర్లోకి ఇమిడిపోయే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’లో ఏకంగా నాలుగు మెగావాట్ల విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చునని ఆయన వివరించారు. సోలార్ పార్కుల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటే.. విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఎక్కువ ఉన్న సమయంలో సరఫరా చేసేందుకు వీలేర్పడుతుందన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ ఉత్పత్తులను బుక్ చేసకోవచ్చునని, నెలాఖరు నుంచి డెలివరీ మొదలవుతుందని తెలిపారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..దేశ అభివృద్ధికి కీలకం..2070 నాటికి కర్బన్ ఉద్గారాలను సున్నాస్థాయికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో విద్యుత్తు వాహనాలతోపాటు ప్యూర్-పవర్ లాంటి ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్ స్పష్టం చేశారు. ప్యూర్-పవర్ ఉత్పత్తుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2030 నాటికి వాహనాల్లో 40 శాతం విద్యుత్తుతో నడిచేవిగా చేయాలని ప్రభుత్వం తీర్మానించిందని, కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సంకల్పించిందని వివరించారు. అయితే ప్రస్తుతం దేశం మొత్తమ్మీద ఉన్న విద్యుత్తు వాహనాల సంఖ్య (అన్ని రకాలు కలుపుకుని) ఇరవై లక్షలకు మించడం లేదని తెలిపారు. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ కోసం గ్రిడ్‌ను వాడటం మొదలుపెడితే గ్రిడ్‌పై అధిక భారం పడుతుందని, ఈ నేపథ్యంలోనే ప్యూర్-పవర్ వంటి ఉత్పత్తులకు ప్రాధాన్యం ఏర్పడుతోందని అన్నారు. బ్యాటరీల ధరలు తగ్గించేందుకు, మరింత సమర్థమైన వాటిని తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలితస్తే మరింత మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్యూర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వడేరా తదితరులు పాల్గొన్నారు. -
ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్
ముంబై: పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్సైకిల్స్పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్ ఎక్స్ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు. -
200 కి.మీ రేంజ్లో కొత్త ఈ-స్కూటర్ : బుకింగ్స్ షురూ! ధర మాత్రం!
Pure EV ePluto 7G Max electric scooter: ప్యూర్ ఈవీ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. 201 కిమీ పరిధితో ePluto 7G మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దేశంలో 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తున్న 2-వీలర్ EVలలో ePluto 7G మాక్స్ ఒకటిగా నిలిచింది. ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ePluto 7G MAX ఫీచర్లు : AIS-156 సర్టిఫికేట్, స్మార్ట్ BMS , బ్లూటూత్ కనెక్టివిటీతో 3.5 KWH బ్యాటరీని అమర్చింది. స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ,స్మార్ట్ AI వంటి ఫీచర్లతో వస్తుంది. ఇవి బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్). రాష్ట్ర స్థాయి సబ్సిడీలు , RTO రుసుములను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. వచ్చే పండుగ సీజన్ నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే , వైట్ నాలుగు రంగులలో లభించనుంది. (ODI WC 2023 Revenue Prediction: ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్ రోజుకు 100 కి.మీ డ్రైవ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా తెలిసారు. మరోవైపు కంపెనీ దాదాపు అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాలలో తన డీలర్ నెట్‌వర్క్‌ను దూకుడుగా విస్తరిస్తోంది, FY24 చివరి నాటికి 300 కంటే ఎక్కువ టచ్పాయింట్లను లక్ష్యంగా చేసుకుంది. -
బజాజ్ గుడ్ న్యూస్:100 శాతం ప్యూర్ హెన్నా
ముంబై: బజాజ్ కన్జ్యూమర్ కేర్ 100 శాతం స్వచ్ఛమైన హెన్నా ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అత్యధిక నాణ్యమైన హెన్నా ఆకుల నుంచి దీన్ని తయారు చేశామని, ఎలాంటి రసాయనాలు వాడలేదని సంస్థ ప్రకటించింది. నూరు శాతం సహజసిద్ధ సురక్షితమైన ఉత్పత్తి అని పేర్కొంది. ఇదీ చదవండి: వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర చేతులు, పాదాలకు సైతం వినియోగించుకోవచ్చని తెలిపింది. శిరోజాలకు మంచి కండీషన్‌తోపాటు సహజ రంగును ఇస్తుందని పేర్కొంది. తమ కస్టమర్లకు వినూత్నమైన, సహజ, సురక్షితమైన ఉత్పత్తులు అందించాలన్న నిబద్ధతకు ఈ ఉత్పత్తి నిదర్శనమని బజాజ్ కన్జ్యూమర్ కేర్ ఎండీ జైదీప్ నంది ప్రకటించారు. 25 గ్రాముల ప్యాకెట్ ధర రూ.10 కాగా, 75 గ్రాముల ధర రూ.35గా సంస్థ నిర్ణయించింది. రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు) -
పూర్ కోసం ప్యూర్...
ఆమె వయసు ఏడు పదులు.. మనసుకు మాత్రం రెండు పదులే.. అందుకే కాబోలు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా.. నేనున్నానంటూ చకచక పరుగులు తీస్తారు.. ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాలలో 350 మంది కార్యకర్తలతో వేలాదిమందికి సేవలు అందిస్తున్నారు. నిరాడంబర జీవితం.. నిరంతర సేవానిరతి... అన్నీ కలిపితే... హైదరాబాద్ కిస్మత్పూర్లో పచ్చని చెట్ల మధ్య ఫలవృక్షంలా జీవిస్తున్న సంధ్య గోళ్లమూడి.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టిన సంధ్య తమ ఇంట్లో తాతముత్తాతల నుంచి దేశసేవ చేయటం చూస్తూ పెరిగారు. దాంతో తాను కూడా బడుగు, బలహీన వర్గాల వారికోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనకు బీజం పడింది. భర్త బ్యాంకు ఉద్యోగి డాక్టర్ శాంతారామ్... రైతుల కోసం ఏర్పాటు చేసిన ఫార్మర్స్ సొసైటీలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఉద్యోగరీత్యా అనేక పల్లెసీమలకు తిరిగేవారు. ఈ క్రమంలో తనకు తారసపడిన నిరుపేదలకు అండగా నిలబడాలనుకున్నారామె. అందుకోసం బుట్టలు అల్లటం,పెట్టీకోట్స్ కుట్టడం, ఎంబ్రాయిడరీ... వంటి పనులు నేర్చుకున్నారు. పేద స్త్రీలకు వీటన్నింటినీ ఉచితంగా నేర్పించారు. పేదలకు అండగా.. నెల్లూరు వచ్చాక, ట్యూషన్లు చెబుతూ డబ్బు సంపాదించి, సంఘసేవ కోసం ఖర్చుచేశారు. తన సేవాకార్యక్రమాలకోసం భర్త మీద ఆధారపడదలచుకోలేదు. తన సంపాదన నుంచే ఖర్చు పెట్టేవారు. అందుకోసం టీచింగ్ దగ్గర నుంచి చిరు వ్యాపారాల వరకు ఎన్నో పనులు చేసేవారు. ఖమ్మంలో ఒక స్కూల్లో పుస్తకాలు లేక తండా పిల్లలు చదువు మానేసి మిరప చేలలో కూలికి వెళ్తున్న సంగతి తెలుసుకున్న సంధ్య తమ కుమార్తె శైలజ సహకారంతో సుమారు యాభైవేల రూపాయలు సేకరించి ఆ మొత్తాన్ని ఆ పిల్లలకు అందించి, వారి చదువు సజావుగా సాగేలా చూశారు. ‘‘అదే సమయంలో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ద్వారా అవసరంలో ఉన్నవారికి సహాయ పడాలనుకున్నాను. మా అమ్మాయి, తన స్నేహితులు అందరూ లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ చేశారు. సంస్థకు pure (people for rural and urban education) అని పేరు పెట్టి, 2016 మార్చిలో రిజిస్టర్ చేశాం. నేను చలాకీగా ఉండటంతో డైరెక్టర్‌గా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 69 సంవత్సరాలు’’ అంటారు సంధ్య గోళ్లమూడి. విపత్తు సమయంలో అండగా... కేరళలో వరదలు వచ్చిన సమయంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, సహాయ కార్యక్రమాలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద పిల్లలకు కావలసిన ఆర్వో వాటర్, బెంచీలు, లైబ్రరీ, కిచెన్ డెవలప్మెంట్, నోట్‌బుక్స్, టాయిలెట్స్, ఆడపిల్లలకు ప్యాడ్స్.. ఇలా ఇబ్బంది లేకుండా చదువుకోవటానికి అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. 2017 – 2018 మధ్య ప్రాంతంలో 1,75,000 కి.మీ. డ్రైవర్ ని పెట్టుకుని ఒంటరిగా వివిధ పాఠశాలలకు ప్రయాణించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏడువేల స్లమ్స్‌లో ప్రతి బుధవారం ఒక్కో స్లమ్‌లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులకు మోదుగ ఆకుల విస్తర్లు కుట్టడానికి అనువుగా రెండు మెషీన్లు అందించారు. వారే మా వలంటీర్లు.. ‘‘సమాజసేవ చేయాలనుకునే టీచర్లే మాకు ప్రతినిధులు. ఆయా ప్రాంతాల ఎన్జీఓ ల సహాయంతో ఈ పనులు చేయగలుగుతున్నాం. కడపలో కోవిడ్ కారణంగా మరణించిన వారి కోసం వ్యాన్, ఐస్ బాక్స్ అందచేశాం’’ అని చెబుతారు సంధ్య గోళ్లమూడి. అమ్మమ్మ... అభ్యాస పాఠశాలలు.. అటవీ ప్రాంతాలలో కొండ మీద నివసించేవారి కోసం అభ్యాస విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ‘‘అందరూ నన్ను ‘మా అమ్మమ్మ’ అని ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటారు’’ అంటున్న సంధ్య గోళ్లమూడి, వివిధ సమస్యల మీద ఛందోబద్ధంగా 3000 కవితలు రాశారు. 65 సంవత్సరాల వయసులో కూచిపూడి నాట్యం చేసి, ఫేస్బుక్లో పెట్టారు. ఋతువులను అనుసరించి ఇల్లు సర్దుకుంటారు. ‘‘ప్రతిదీ ప్రభుత్వమే చేయాలంటే కుదరకపోవచ్చు. అందరం ప్రభుత్వంలో భాగస్వాములమే కనుక దేశపౌరులుగా ఇది మనందరి బాధ్యత’’ అంటారు ఎంతో హుందాగా. –వైజయంతి పురాణపండ లాక్డౌన్ విధించటానికి ముందే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కావలసిన నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ని సప్లయి చేశాం. సమతుల ఆహారాన్ని అందించాం. వివిధ ప్రాంతాలకు చెందినవారు వారి ఇళ్లకు చేరుకోవటం కోసం రెండు బస్సులు ఏర్పాటు చేశాం. రెండు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మేం నడిపిన కోవిడ్ సెంటర్లలో అందరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క మరణం కూడా లేదు. – సంధ్య గోళ్లమూడి సంధ్య గోళ్లమూడి -
ప్యూర్ నుంచి పాక్...
పేరులో నేముంది పాక్ అంటే ఉర్దూలోప్యూర్ అని అర్థం. స్థాన్ అంటే భూమి అని అర్థం. దీనిని బట్టి పాకిస్థాన్‌కు స్వచ్ఛమైన భూమి అనే అర్థం వస్తుంది. ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని కలలు కన్న చౌధురి రహమత్ అలీ అనే ఒక ముస్లిం జాతీయవాది అంతకు దాదాపు ఒక దశాబ్దం క్రితమే ‘నౌ ఆర్ నెవర్’ అనే ఒక కరపత్రం ప్రచురించి, దానిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముందుంచాడు. భారతదేశంలో సుమారు 30 మిలియన్ల మంది ముస్లిములు స్వాతంత్య్రం కోసం అభిలషిస్తున్నారని, వారికోసం ప్రత్యేకంగా ఒక దేశం ఉండాలన్నదే దాని సారాంశం. దేశంలో ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే ప్రాంతాలైన పంజాబ్, అఫ్ఘన్ ప్రావిన్స్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్‌లను కలుపుతూ పాకిస్థాన్ పేరిట ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాలని రహమత్ అలీ ఆ పత్రంలో నివేదించాడు. అలా చెప్పినట్టుగా ఈ అయిదు ప్రదేశాలలో మొదటి అక్షరాలని వరుసగా పేరిస్తే పాకిస్థాన్ అవుతుంది. మొత్తానికి ఈ సూచన సంగతి ఎలా ఉన్నా, దేశవిభజన జరిగింది. మన దేశంలోని స్వచ్ఛమైన భూభాగం కాస్తా విడిపోయి పాకిస్థాన్ ఏర్పడింది. -
గంగరాజు పాలు గరిటెడైనను...
తెల్లవారగానే పాలకార్డు పుచ్చుకుని పాల బూత్‌కి వెళ్తే పాలు దొరుకుతాయి! కాని ఆ ఇంటికి ఏ కార్డూ తీసుకువెళ్లక్కర్లేదు... అర్ధరాత్రి ఒంటి గంటకైనా సరే ఆ ఇంటికి వెళ్లి తలుపు త డితే చాలు.. పాల వంటి స్వచ్ఛమైన చిరునవ్వుతో తలుపులు తెరుచుకుంటాయి... మనకు కావలసిన కల్తీ లేని పాలు దొరుకుతాయి... మూడు తరాలుగా పాల వ్యాపారాన్ని సేవా దృక్పథంతో నడుపుతూ పాల గంగరాజుగా పేరు పొందారు ఆయన... తరవాతి తరం కూడా అదే పేరుతో అ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. రాజమండ్రి టి.నగర్‌లోని ఆ వీధిలోకి అడుగు పెడుతుండగానే ఆమడ దూరం నుంచే కమ్మటి వాసనలు కమ్ముకు వస్తుంటే... అప్రయత్నంగానే మన కాళ్లు అటువైపు దారి తీస్తాయి. ఆ ఇంటి ముందు బారులు తీరిన జనం కనిపిస్తారు. ఒకరు నెయ్యి కావాలంటే, ఒకరు పాలు కావాలంటారు. ఒకరు పెరుగు కావాలంటే మరొకరు పాలకోవా కావాలంటారు. ఇంతలోనే ఇంకొకరు వచ్చి పూతరేకులు రెడీయేనా అని అడుగుతారు. అడిగిన వాటన్నింటినీ ఆలస్యం చేయకుండా అందజేస్తారు ఆ ఇంటిలోని వాళ్లు. మూడు తరాలుగా అక్కడి ప్రజలకు రుచికరమైన పాలు, పాల పదార్థాలు అందిస్తోంది పాల గంగరాజు డైరీ. తెలుగువారి అభిమాన నటుడు అక్కినేని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ కూడా గంగరాజు పాలకోవా తిన్నవారే. ఇలా మొదలైంది...: పశ్చిమగోదావరి జిల్లా పశివేదల గ్రామం (1950) లో నిమ్మలపూడి వీరన్న అనే రైతు ఇతర ప్రాంతాల నుంచి పాలు సేకరించి విక్రయించేవారు. కుమారుడు గంగరాజు తన 24వ ఏట వీరన్న ప్రారంభించిన పాల వ్యాపారాన్ని రాజమండ్రి దాకా తీసుకువచ్చారు. అక్కడ అప్పుడప్పుడే విస్తరిస్తున్న హోటళ్లకు... పశివేదల, ఉంగుటూరు పరిసర గ్రామాల నుంచి పాలను సేకరించి రాజమండ్రిలో విక్రయించేవారు. ఆయన పాలు తేకపోతే ఆ రోజు అక్కడి హోటళ్లు ఇంక బందే. ‘‘మా నాన్నగారు అలా పాలు సరఫరా చేస్తుండటంతో ఆయన పేరు పాల గంగరాజుగా మారిపోయింది’’ అంటారు ఆయన తదనంతరం ‘గంగరాజు పాల ఖ్యాతి’ ని దేశ విదేశాలకు వ్యాపింపచేసిన ఆయన కుమారుడు గోవిందు. పాల బండి వచ్చిందంటే...: విజయవాడ నుంచి రాజమండ్రికి ఉదయం పూట ప్యాసింజరు రైలు నడిచేది. ‘‘మా నాన్నగారు రోజూ ఇదే రైలులో పాలను బిందెలతో రాజమండ్రికి తెచ్చేవారు. పశ్చిమగోదావరి నుంచి పాలు అమ్మేందుకుగాను ఇదే రైల్లో మరికొందరు రాజమండ్రి వచ్చేవారు. అందరూ ఆ రైలును పాల బండి అని పిలిచేవారు. మా నాన్నగారు అందులో వుండేవారు. మిగులు పాలతో మొదలైంది వ్యాపారం: పాల సేకరణ పరిమాణం పెంచుతూ పోవడంతో పాలు మిగిలిపోయేవి. దీంతో రాజమండ్రిలో కూడా పాలు అమ్మేవారు గంగరాజు. అలా మా తాతగారు పశివేదలలో ఉండగానే నాన్నగారు రాజమండ్రి ఇన్నీసుపేటలోని త్యాగరాజనగర్‌కు మకాం మార్చారు. తాతగారు పంపిన పాలు హోటళ్లకు పోయగా మిగిలిన పాలను ఇంటి దగ్గర కొన్ని అమ్మి, మరికొన్ని పాలను పెరుగుగా మార్చి విక్రయించేవారు. ’’ అంటూ గతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు గోవిందు. స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్...: గంగరాజు డైరీలో... పాలు, పెరుగుతోపాటు పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాకుండా నెయ్యి, వెన్న, పనీరు, పచ్చి కోవా, పూతరేకులు కూడా తయారు చేస్తారు. గంగరాజు పాలకోవా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సుపరిచితం. ఫోన్లో ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్లో డబ్బులు పంపితే వాళ్లు సూచించిన వారికి డెలివరీ ఇస్తారు. ఇదో కుటుంబ పరిశ్రమ: మూడు తరాల ఆ కుటుంబ పరిశ్రమ నేడు గంగరాజు డైరీ అనే వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచింది. ‘‘లీటరు 30 పైసల రేటుతో ప్రారంభమైన మా పాల సేకరణ ఇప్పుడు 52 రూపాయల ధరలో కొనసాగుతోంది’’ అంటూ తమ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందిందో చెబుతారు గోవిందు.వీరు తయారుచేసే పాలకోవా విదేశాలలో ఉన్నవారిని సైతం ఆకర్షిస్తోంది. అమ్మ చేతి పాలకోవా... ‘‘ఎన్ని పాలు విక్రయించినా ఇంకా పదిహేను లీటర్ల పాలు మిగిలిపోయేవి. మా అమ్మ సత్యవతి అలా మిగిలిన పాలతో కోవా చేసేవారు. ఇంటి ముందే వాటిని అమ్మేవారు. అమ్మ చేతి ఆ స్వచ్ఛమైన పాలకోవా గంగరాజు డైరీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ విదేశాల్లో ఉండే భారతీయులు కోవాను పోస్టు ద్వారా తెప్పించుకుంటున్నారంటే అది అమ్మ చేసిన కమ్మని పాలకోవా మహిమే!’’ - గోవిందు - దేవళ్ల సూర్యనారాయణమూర్తి, సాక్షి ప్రతినిధి, రాజమండ్రి ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి