ప్యూర్ నుంచి పాక్...
పేరులో నేముంది
పాక్ అంటే ఉర్దూలోప్యూర్ అని అర్థం. స్థాన్ అంటే భూమి అని అర్థం. దీనిని బట్టి పాకిస్థాన్‌కు స్వచ్ఛమైన భూమి అనే అర్థం వస్తుంది. ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని కలలు కన్న చౌధురి రహమత్ అలీ అనే ఒక ముస్లిం జాతీయవాది అంతకు దాదాపు ఒక దశాబ్దం క్రితమే ‘నౌ ఆర్ నెవర్’ అనే ఒక కరపత్రం ప్రచురించి, దానిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముందుంచాడు. భారతదేశంలో సుమారు 30 మిలియన్ల మంది ముస్లిములు స్వాతంత్య్రం కోసం అభిలషిస్తున్నారని, వారికోసం ప్రత్యేకంగా ఒక దేశం ఉండాలన్నదే దాని సారాంశం.
దేశంలో ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే ప్రాంతాలైన పంజాబ్, అఫ్ఘన్ ప్రావిన్స్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్‌లను కలుపుతూ పాకిస్థాన్ పేరిట ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాలని రహమత్ అలీ ఆ పత్రంలో నివేదించాడు. అలా చెప్పినట్టుగా ఈ అయిదు ప్రదేశాలలో మొదటి అక్షరాలని వరుసగా పేరిస్తే పాకిస్థాన్ అవుతుంది. మొత్తానికి ఈ సూచన సంగతి ఎలా ఉన్నా, దేశవిభజన జరిగింది. మన దేశంలోని స్వచ్ఛమైన భూభాగం కాస్తా విడిపోయి పాకిస్థాన్ ఏర్పడింది.