
ముంబై: బజాజ్ కన్జ్యూమర్ కేర్ 100 శాతం స్వచ్ఛమైన హెన్నా ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అత్యధిక నాణ్యమైన హెన్నా ఆకుల నుంచి దీన్ని తయారు చేశామని, ఎలాంటి రసాయనాలు వాడలేదని సంస్థ ప్రకటించింది. నూరు శాతం సహజసిద్ధ సురక్షితమైన ఉత్పత్తి అని పేర్కొంది.
ఇదీ చదవండి: వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర
చేతులు, పాదాలకు సైతం వినియోగించుకోవచ్చని తెలిపింది. శిరోజాలకు మంచి కండీషన్‌తోపాటు సహజ రంగును ఇస్తుందని పేర్కొంది. తమ కస్టమర్లకు వినూత్నమైన, సహజ, సురక్షితమైన ఉత్పత్తులు అందించాలన్న నిబద్ధతకు ఈ ఉత్పత్తి నిదర్శనమని బజాజ్ కన్జ్యూమర్ కేర్ ఎండీ జైదీప్ నంది ప్రకటించారు. 25 గ్రాముల ప్యాకెట్ ధర రూ.10 కాగా, 75 గ్రాముల ధర రూ.35గా సంస్థ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment