Henna
-
జుట్టుకు హెన్నా పెడుతున్నారా?ఈ తప్పులు అస్సలు చేయకండి
మెహందీలో ఇవి కలిపితే... ►జుట్టుకు మెహందీ పెట్టుకునేటప్పుడు అరటిపండుని కలిపితే కురులకు మరిన్ని పోషకాలు అందుతాయి. అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ మాడు దురదను తగ్గిస్తాయి. అరటిపండుని మెత్తగా చిదుముకుని మెహందీలో వేసి కలపాలి. ఈ మెహందీని జుట్టుకి పట్టించి గంట తరువాత కడిగేయాలి. ► కొబ్బరిపాలను కొద్దిగా వేడి చేసి కొన్ని చుక్కలు ఆలివ్ ఆయిల్‌ను వేసి కలపాలి. ఈ పాలను మెహందీలో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే... కొబ్బరి పాలలోని లారిక్ ఆమ్లం మంచి యాంటీబయోటిక్‌గా పనిచేసి, మాడు సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. కండీషనర్స్, షాంపులలో కొబ్బరిపాలను వాడతారు. ఇలా మెహందీలో కొబ్బరిపాలు కలపడం వల్ల మెహందీ మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. ►టేబుల్ స్పూను హెన్నా, టేబుల్ స్పూను ముల్తానీ మట్టిని తీసుకుని నీటిలో నానబెట్టి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని తలలో బాగా దురదపెడుతోన్న భాగంలో రాసి, అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. హెన్నా రాసేముందు ఈ తప్పులు చేస్తున్నారా? మెహందీ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇది ఎలా అప్లై చేయాలి? ఎంత సమయం పెట్టాలో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. మెహందీని అప్పటికప్పుడు కలుపుకోకుండాముందు రోజు రాత్రే కనీసం 4-5 గంటల పాటు స్టోర్ చేసుకోవాలి. ఇక హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచితే, అంత బాగా జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు.కానీ, ఇలా ఎక్కువ సేపు ఉంచితే, హెన్నా జుట్టులోని తేమను గ్రహిస్తుంది. జుట్టు విపరీతంగా పొడిగా మారుతుంది. హెన్నా వల్ల స్కాల్ప్ బ్లాక్ అయ్యే సమస్య కూడా ఉంటుంది. కాబట్టి 1-2 గంటలకు మించి పెట్టరాదు. చాలామంది పొడి జుట్టు మీదే మెహందీని పెడుతుంటారు. ఇలా అస్సలు చేయొద్దు. దీని వల్ల జుట్టు మరింత డ్రైగా కనిపిస్తుంది. రంగు కూడా బాగా కనిపించదు. దీని కోసం, ముందుగా హెయిర్ కండీషనర్‌ని వాడండి, ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. దీనివల్ల జుట్టు పొడిగా మారదు. అలాగే, మెహందీని అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్య ఉండదు. కొంతమందికి హెన్నా పడకపోవచ్చు. కానీ, ఇది జుట్టు రాలడం, అలెర్జీలకు దారితీయవచ్చు. అందువల్ల,జుట్టుకు రాసేముందే కాస్తంత హెన్నాను తీసుకొని చర్మంపై రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మెహందీ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని కొందరు వారం రోజులకు ఒకసారి కూడా పెడుతుంటారు. అలా అస్సలు చేయొద్దు. హెన్నాను నెలకు ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. అతిగా వాడొద్దు. -
చిన్నారుల చేతులకు మెహెందీ పెడుతున్నారా..?
గోరింటాకుతో తయారు చేసే హెన్నా తలకు మంచి కండిషనర్‌గా ఉంటుందని పెడుతుంటారు. అందరికీ తెలిసిందే కానీ ఒక్కొసారి అది పడకపోతే లేనిపోని చర్మ సమస్యలు ఎదుర్కొనక తప్పదు. అందరికి ఒకేలా ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలావరకు సహజసిద్ధంగా తయారు చేసిన హెన్నాతో ఇబ్బందులు ఉండవు. ఒక్కొసారి అవి బాగా ఎరుపుగా పండాలని వాటిలో కెమికల్స్ కలుపుతారు. అవి అందరి శరీరానికి పడవు. రియాక్షన్ ఇచ్చి కాలినగాయాల మాదిరిగా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి చేదు అనుభవమే యూకేలో ఓ చిన్నారికి ఎదురైంది. వివరాల్లోకెళ్తే..కిర్ట్సీ న్యూటన్ తన ఏడేళ్ల చిన్నారి మటిల్డాను టర్కీలో విహారయాత్రకు వెళ్లింది. అక్కడ ఓ హోటల్లో చిన్నారి చేతిపై బ్లాక్హెన్నాతో(మెహందీ) టాటు వేయించుకుంది. సీతాకోక చిలుక మాదిరి డిజైన్ వేయించుకుంది. ఆ తర్వాత అది రియాక్షన్ ఇచ్చి దురద, మంట రావడం మొదలైంది చిన్నారికి. దీంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా ఆ హెన్న టాటు కారణంగా ఇలా అయ్యిందన్నారు. అందులో ఉండే కెమికల్స్ చర్మ సంబంధిత అలెర్జీలు ఇస్తాయని చెప్పారు. దీంతో ఆ టాటు వేయించుకున్న ప్రదేశం అంతా కాలిన గాయంలా ఎర్రగా అయిపోయింది. వైద్యులు దురద రాకుండా, పుండులా ఏర్పడకుండా ఉండేలా యాంటి బయోటిక్ క్రీమ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి నెమ్మదిగా కోలుకుంటోంది. జుట్టుకి కూడా వినియోగించే ఈ బ్లాక్ హెన్నా ఇంత చేటు తెస్తుందని ఊహించలేదని ఆ చిన్నారి తల్లి వాపోయింది. ఇక తలకు కూడా ఆ హెన్నాను ఉపయోగించాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది. దయచేసి తల్లిదండ్రులు ఇలాంటివి చిన్నారులకు అలవాటు చేయకండి. అవి మీ చిన్నారుల లేత చర్మాన్ని గాయపరుస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. సహజంగా గోరింటాకు చెట్లతో ఉన్న వాటితోనే ఏమైన వేసుకోండి గానీ ఇలా ఏదైనా హోటల్, షాపింగ్ మాల్లో హెన్న టాటులు(మెహిందీలు) వేయించుకోకండని హెచ్చరించారు. సహజ సిద్ధంగా గోరింటాకు చెట్లతో తయారు చేసిన వాటినే నేరుగా పెట్టకోకండి అని సూచిస్తోంది ఆ బాధిత చిన్నారి తల్లి. (చదవండి: ఆ ఒక్క సంజ్ఞతో..ఆ ఆవుల మందను కదలకుండా చేశాడు!) -
బజాజ్ గుడ్ న్యూస్:100 శాతం ప్యూర్ హెన్నా
ముంబై: బజాజ్ కన్జ్యూమర్ కేర్ 100 శాతం స్వచ్ఛమైన హెన్నా ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అత్యధిక నాణ్యమైన హెన్నా ఆకుల నుంచి దీన్ని తయారు చేశామని, ఎలాంటి రసాయనాలు వాడలేదని సంస్థ ప్రకటించింది. నూరు శాతం సహజసిద్ధ సురక్షితమైన ఉత్పత్తి అని పేర్కొంది. ఇదీ చదవండి: వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర చేతులు, పాదాలకు సైతం వినియోగించుకోవచ్చని తెలిపింది. శిరోజాలకు మంచి కండీషన్‌తోపాటు సహజ రంగును ఇస్తుందని పేర్కొంది. తమ కస్టమర్లకు వినూత్నమైన, సహజ, సురక్షితమైన ఉత్పత్తులు అందించాలన్న నిబద్ధతకు ఈ ఉత్పత్తి నిదర్శనమని బజాజ్ కన్జ్యూమర్ కేర్ ఎండీ జైదీప్ నంది ప్రకటించారు. 25 గ్రాముల ప్యాకెట్ ధర రూ.10 కాగా, 75 గ్రాముల ధర రూ.35గా సంస్థ నిర్ణయించింది. రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు) -
Blouse Mehndi: మెహందీని ఇలా కూడా వాడుతున్నారా!
చేతి నిండా ఎర్రగా పండే.. ‘మెహందీ’ అంటే ఇష్టంలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు మెహంది అనగానే చేతులు, కాళ్లు, కొన్ని సార్లు తెల్లజట్టుకు వేసుకోవటం తెలుసు. అయితే రోజురోజుకు మహిళలు కొత్త ఫ్యాషన్ ఫాలో అవుతూ ట్రెండీగా మెరిసిపోతున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి ఫ్యాషన్ బ్రాండ్లను వాడుతున్నారు. భిన్నమైన చుడీదార్లు, డిజైన్ శారీలు, బ్లౌజులు వేసుకొని ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా మెహందీ బ్లౌజ్ వేసుకున్న ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను థానోస్ జాట్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మెహందీ బ్లౌజ్ ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే సాధారణంగా ధరించే బ్లౌజ్‌కు బదులుగా శరీరంపై హెన్నా(మెహంది) డిజైన్ వేసుకోవడం. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘కొత్తగా ఉంది డిజైన్’.. ‘మెహందీని ఇలా కూడా వాడుతున్నారా?’.. అసలు బ్లౌజ్‌గా మెహందీని వేసుకోవడం ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanos (@thanos_jatt) -
తెల్ల జట్టు సమస్యా.. హెన్నా పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే!
Beauty Tips in Telugu: వయసుతో పనిలేకుండా అందరి జుట్టు తెల్లబడుతుంది. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు వివిధ రకాల రంగులు, హెన్నాలను వాడుతుంటారు. హెన్నా జుట్టుకు ఎంతో మేలు చేసినప్పటికీ హెన్నా తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. ►జుట్టుకు కండీషనర్‌గా హెన్నా పెట్టాలనుకున్నప్పుడు హెన్నాలో ఉసిరిపొడి, పెరుగు లేదా గుడ్డు తెల్లసొన కలిపి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఉసిరిపొడి లేనప్పుడు బాదం నూనెను హెన్నాలో కలుపుకోవచ్చు. ►హెన్నా పెట్టడడం వల్ల పొడిబారిన జుట్టును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పెరుగు ప్యాక్ బాగా పనిచేస్తుంది. కప్పు పెరుగులో రెండు స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనె, నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►అరటి పండు గుజ్జుకు అలోవెరా జెల్ రెండు స్పూన్లు, స్పూను కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మరసం, వెనిగర్, గుడ్డు తెల్ల సొనలను తీసుకుని అన్నిటినీ బాగా కలిపి జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తరువాత హెడ్‌బాత్ చేస్తే కురులు మృదువుగా మారతాయి. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! డిప్రెషన్‌తోపాటు.. -
ఢాకాలో తాతల మేకోవర్..
ఢాకా : అక్కడి వృద్ధులు తాము మానసికంగా యువకులమే అంటున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎరుపు, నారింజ రంగు గడ్డాలతో తాతలంతా తళతళా మెరుస్తున్నారు. స్టైల్‌ను ప్రతిబింబించేలా భిన్న రంగుల్లో హెన్నా లభిస్తుండటంతో వయసు పైబడిన వాళ్లంతా వయసు దాచేందుకు వీటిని ఎంచుకుంటున్నారు. తాను రెండు నెలల నుంచి తన జుట్టుకు ఈ రంగులు వాడుతున్నానని 60 ఏళ్లకు చేరువైన మహబుల్ బషర్ తన తాజా లుక్కు ముచ్చటపడుతూ చెప్పుకొచ్చారు. స్ధానిక కూరగాయల మార్కెట్లో పోర్టర్‌గా పనిచేస్తున్న 60 ఏళ్ల అబుల్ మియా కూడా సరికొత్త రంగులు తమ మేకోవర్‌కు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ‘ఇలా రంగువేసుకోవడం బావుంది..తాను ఇప్పుడు యంగ్‌గా, హ్యాండ్సమ్గా కనిపిస్తున్నానని కుటుంబ సభ్యులు చెబుతున్నా’రని ఆయన సంబరపడ్డారు. బంగ్లాలో హెన్నా వాడకం దశాబ్ధాలుగా సాగుతున్నా ఇప్పుడు దీని ప్రాచుర్యం శిఖరాలకు చేరింది. ఢాకా వీధుల్లో ప్రస్తుతం సరికొత్త రంగుల్లో గడ్డంతో మెరిసిపోయే వారు ఎటు చూసినా కనిపిస్తారు. గడ్డం, మీసాలు, తల వెంట్రుకలు సహా జుట్టుకు ఆరంజ్ హెన్నాను అప్లై చేసేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. హెన్నా పెట్టుకోవడం ఇటీవల కాలంలో ఫ్యాషన్ ఛాయిస్‌గా మారిందని కాన్వాస్ మేగజైన్లో ఫ్యాషన్ జర్నలిస్ట్ దిదారుల్ దిపు చెప్పారు. ఈ పౌడర్ అన్ని చోట్లా దుకాణాల్లో లభ్యమవుతుందని, అందరూ సులభంగా దీన్ని అప్లై చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఇమామ్‌లు సైతం తమ ఇస్లాం మూలాలు చాటేందుకు హెన్నా వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మహ్మద్ ప్రవక్త సైతం తన గడ్డానికి హెన్నా వాడారని తనకు కొందరు మత ప్రభోదకులు చెప్పారని అందుకే తానూ వాడుతున్నానని ఢాకాకు చెందిన అబూ తాహెర్ చెప్పారు. -
తెల్లజుట్టు సమస్యా.. ఇలా చేయండి!
ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపంజేసేది శిరోజాలే అంటారు. ఇక ఆడవాళ్లైతే శిరోజాలనే తమ అందానికి గుర్తుగా భావిస్తానరడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటిది ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం అనే సమస్య అందరినీ వేధిస్తోంది. అంతేకాదు జుట్టు తక్కువగా ఉన్నా సరే బాగుంటే చాలు అనుకునే వారు తెల్లజుట్టు రావడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి కాస్త విముక్తి పొందవచ్చు. బ్లాక్ టీ తెల్లజుట్టు నివారణలో బ్లాక్ టీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని(పాలు కలపకుండా) దానిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్లకు చేరేలా మర్దనా చేసి.. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. సేజ్ ఆకులు ఎండిన సేజ్(జాజికాయ) ఆకులను తీసుకుని మరుగుతున్న నీటిలో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అనంతరం దీనికి నాలుగైదు చుక్కల గ్లిజరిన్ కలపాలి. తద్వారా జుట్టు పోషణకు అవసరమైన విటమిన్-ఇ అందుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం ద్వారా సహజ పద్ధతిలోనే నల్లని జుట్టు పొందవచ్చు. హెన్నా తెల్ల జట్టు సమస్య నుంచి బయటపడేందుకు దాదాపుగా అందరూ పాటించే చిట్కా ఇది. మార్కెట్లో దొరికే నాణ్యమైన హెన్నా పౌడర్ తీసుకుని.. దానికి పెరుగు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు నీటిలో మరగబెట్టాలి. 12 నుంచి 15 గంటల పాటు ఒక నానబెట్టిన తర్వాత.. జుట్టుకు పట్టించి మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం షాంపూతో కడిగేస్తే సరి. అయితే రాత్రి మొత్తం నానబెట్టి తెల్లవారి హెన్నా పెట్టుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ తలస్నానం చేసే ఇబ్బంది ఉండదు. ఉసిరి నల్లని శిరోజాలు పెంపొందించడంలో ఉసిరిది ప్రధాన పాత్ర. ఎండిన ఉసిరి కాయలను నీళ్లలో నానబెట్టాలి. ఒక రోజంతా నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఉసిరిని నానబెట్టిన నీళ్లలో హెన్నా పౌడర్, గ్రైండ్ చేసిన ఉసిరి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత దీనికి ఐదు చెంచాల నిమ్మకాయ రసం, కాఫీ, పచ్చి గుడ్డు తెల్లని సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడిగేసి.. షాంపూ అప్లై చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె, అల్లం కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలను వేడి చేసి కాసేపు మరగబెట్టాలి. ఒక రాత్రంతా ఈ మిశ్రమాన్ని నానబెట్టి... దీనికి కాసింత తేనె కలిపి జుట్టుకు పట్టించి మర్దనా చేయాలి. మెరుగైన ఫలితం కోసం ఉసిరితో పాటు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. -
అరచేతి అందం
మెహెందీ కోన్స్‌తో అరచేత అందమైన డిజైన్లు తీర్చిదిద్దుకోవాలని ముచ్చటపడు తుంటారు అతివలు. కానీ, చర్మ సమస్యలు వస్తాయేమో అనే భయం. అలాంటి భయాలేవీ లేకుండా ఇంట్లోనే కోన్ని తయారుచేసుకోవచ్చు. తయారీ స్టెప్ :1 పై పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి, బాగా కలపాలి. స్టెప్ :2 కొద్దిగా నీళ్లతో చిక్కటి మిశ్రమం అయ్యేవరకు కలపాలి. స్టెప్ :3 హెæన్నా ఉన్న గిన్నెను ప్లాస్టిక్ షీట్‌తో పూర్తిగా మూసి, 15 నిమిషాలసేపు ఆ గిన్నెను పక్కన పెట్టేయాలి. స్టెప్ :4 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే మిశ్రమం మృదువుగా తయారవుతుంది. దీంట్లో మరికొద్దిగా నీళ్లు, ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. తర్వాత మళ్ళీ ప్టాస్టిక్ షీట్‌తో కవర్ చేసి, ఈసారి గంటసేపు వదిలేయాలి. పంచదార కరిగి మిశ్రమం చిక్కబడుతుంటుంది. స్టెప్ :5 ప్లాస్టిక్ షీట్ తీసేసి, మిశ్రమాన్ని మళ్లీ ఒకసారి కలపాలి. మిశ్రమంలో ఎక్కడా పొడి తాలూకు గడ్డలు లేకుండా మృదువుగా అవుతుంది. స్టెప్ :6 ప్లాస్టిక్ షీట్‌తో కోన్స్ తయారుచేసుకోవాలి. నోట్: హ్యాండ్ రోల్డ్ ఎమ్టీ కోన్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. స్టెప్ :7 కోన్‌లో ముప్పావు భాగం వరకు హెన్నా మిశ్రమం నింపి, టేప్‌తో మూసేయాలి. తర్వాత నచ్చిన డిజైన్ తీర్చిదిద్దుకోవాలి. ఈ పదార్థాలు అవసరం.. ∙హెన్నా పొడి – 100 గ్రాములు ∙ఆర్గానిక్ గోరింటాకు పొడి (హెర్బల్ స్టోర్స్‌లో లభిస్తుంది) ∙డిస్టిల్డ్ ఎసెన్షియల్ ఆయిల్ – 30 ఎం.ఎల్ (హెన్నా ముదురు రంగులో తేలాలంటే టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్, ఇలాచీ పొడులు కూడా కలుపుతుంటారు) ∙మంచినీళ్లు ∙పంచదార – 3 టేబుల్ స్పూన్లు (హెన్నా మిశ్రమం గట్టిగా అవడానికి) -
తనువింట గోరింట
ఏ పండగ వచ్చినా, వేడుక ఏదైనా చేతులు గోరింటతో ఎరుపెక్కితే అది ఓ అందమైన కళ. అందమైన డిజైన్‌కి మేను కాన్వాస్ అయితే అది ముచ్చటైన కళ. అర చేతులే కాదు అరిపాదాలూ అబ్బురపరిచే చిత్రరాజాలే. కాలి అందియలుగా, మెడలో హారాలుగా గోరింటనేఆభరణంగా రూపుదిద్దుకుంటే.. ఇదిగో ఇలా అందమంతా మేనింట పండగే అవుతుంది. (బారసాల ఉత్సవం కమనీయం , వెస్ట్రన్ పార్టీకి వెరైటీ డిజైన్ , వధూవరుల ప్రణయం ) (వెన్నుకు వన్నెలు...మెడలోన జిలుగులు , పాదాలకు ముచ్చటైన పట్టీలు గోరింటతోనే సింగారాలు ) -
జీతూ–హీనా జంట పసిడి గురి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నమెంట్లో తొలి రోజే భారత్ పసిడి బోణీ చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత స్టార్ షూటర్స్ జీతూ రాయ్–హీనా సిద్ధూ ద్వయం స్వర్ణ పతకాన్ని సాధించింది. ఐదు జోడీలు పాల్గొన్న ఫైనల్లో జీతూ–హీనా జంట 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాన్ని మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు. గొబెర్‌విల్లీ–ఫౌకెట్ (ఫ్రాన్స్–481.1 పాయింట్లు) జంట రజతం నెగ్గగా... యాంగ్ వీ–కాయ్ జియోజుయ్ (చైనా–418.2 పాయింట్లు) జోడీ కాంస్యం సాధించింది. ఈ ఏడాది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కు లభించిన మూడో స్వర్ణమిది. న్యూఢిల్లీ, గబాలాలలో జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో జీతూ–హీనా జంట పసిడి పతకాలు గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో దీపక్ –మేఘన (భారత్) జోడీ నాలుగో స్థానంలో నిలిచింది. -
నల్లని జుట్టుకోసం...
బ్యూటిప్స్ బీరకాయను చెక్కు తీసి ముక్కలుగా కోయాలి. వాటిని బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి మరిగించి తలకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే... నెరిసిన జుత్తు మెల్లమెల్లగా నల్లబడుతుంది. ఓ కప్పు హెన్నా పొడిలో రెండు చెంచాల కాఫీ పొడి, చెంచాడు నిమ్మరసం, చెంచాడు పుదీనా పొడి, అర చెంచాడు వెనిగర్, పెరుగు వేసి చిక్కగా కలపాలి. దీన్ని తలకు పట్టించి, గంట తర్వాత శుభ్రంగా తలంటుకోవాలి. జుత్తు నెరిసి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గుప్పెడు నువ్వుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయమే లేచి మెత్తగా రుబ్బాలి. దీనిలో కాసింత పెరుగు కానీ ఎగ్ వైట్ కానీ కలిపి మాడుకు, జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత తలంటుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే తెల్ల జుత్తు నల్లబడటంతో పాటు కుదుళ్లు బలపడి జుత్తు పొడవుగా పెరుగుతుంది. -
గోరింటా పూచింది..
-
నిమిషాల్లో నిగారింపు
బ్యూటిప్స్ రసాయనాలతో తయారు చేసిన క్రీమ్స్, కండీషనర్స్ లాంటివి ఉపయోగించకుండా, ఇంటి చిట్కాలు వాడితే అందంతో పాటు ఆరోగ్యమూ మీ సొంతం అవుతుంది.అనుకోకుండా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే ఇంట్లో చక్కటి ఫేషియల్ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ పెరుగు తీసుకొని బాగా కలపాలి. ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్ వేసుకొని, 15 నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. ఇంట్లోనే జుట్టుకు కండీషనర్ తయారు చేసుకోవడం చాలా సులువు. ఒక ఇనుప పాత్రలో అరకప్పు కాఫీ పొడి, అరకప్పు హెన్నా పౌడర్ తీసుకొని వాటికి నిమ్మరసం కానీ పెరుగు కానీ కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలంటు స్నానం చేసిన మరుసటి రోజు మాడుకు, జుట్టుకు అప్లై చేసుకొని, అది పూర్తిగా ఆరిపోయాక కడిగేసుకోవాలి. అలా చేస్తే చుండ్రు సమస్య పోవడంతో పాటు జుట్టు ముదురు రంగులో నిగారిస్తుంది. తరచూ పెదాలు పగులుతూ, అందంగా కనిపించట్లేదని బాధపడే వారికి ఈ చిట్కాతో మంచి ఫలితం దక్కుతుంది. చిన్న పాత్రలో అర టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ ఆముదం, అర టీస్పూన్ గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న డబ్బాలోకి తీసుకొని ప్రతి రోజూ పెదాలకు రాసుకుంటే పగలకుండా ఉంటాయి. దాంతో మీ పెదాలు అందంగా తయారవుతాయి. -
గోరింట రిమూవర్‌గా ఉప్పు
బ్యూటిప్స్ చేతులకు పెట్టుకున్న గోరింటాకు రంగు మారడంతో ఇబ్బందిగా అనిపిస్తోందా? అయితే ఆ రంగును తొలగించి మళ్లీ కొత్తగా పెట్టుకొని చేతులకు అందాన్ని తెచ్చుకోండి. ఆ మారిన రంగు పోవాలంటే గోరు వెచ్చటి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి చేతులను ఓ 20 నిమిషాల పాటు అందులో నానపెడితే చాలు. మీ సమస్య తీరుతుంది. చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఎరుపు రంగులోకి రావాలంటే ఓ కొత్త చిట్కా ఉంది. ఆరిన గోరింటాకును తీసేశాక వెంటనే కడిగేసుకోకుండా చేతులకు విక్స్ బామ్ కానీ జండూ బామ్ కానీ రాసుకోవాలి. అది ఎరుపును ముదురు రంగులోకి మార్చేందుకు తోడ్పడుతుంది. అలా ఓ అయిదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో చేతులను కడుక్కుంటే సరి. మందారం లాంటి ఎరుపురంగు గోరింటాకు మీ చేతుల సొంతం. -
గోరింటాకు తంటా..!
మెహందీ పెట్టుకోలేదని పెళ్లికి నిరాకరణ పోలీసుల అదుపులో వరుడు పంజగుట్ట: వధువు గోరింటాకు పెట్టుకోలేదన్న కోపంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈనెల 8న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. కంచన్‌బాగ్ ఉమర్ కాలనీలో నివాసముంటున్న మీర్ మసూద్ అలీ(32) దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి గతంలో వివాహమైంది. భార్యతో గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఎంఎస్ మక్తాకు చెందిన ఎండీ గౌస్ పాషా కుమార్తె(23)తో రెండో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు . ఈనెల 8న వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. పెళ్లి సమయంలో వరుడికి ఇవ్వాల్సిన సామగ్రి మొత్తం ముందుగానే ఇచ్చేశారు. 7వ తేదీ రాత్రి మసూద్ అలీ బంధువులు వధువును పెళ్లి కూతురును చేసేందుకు గౌస్ పాషా ఇంటికి వచ్చారు. అప్పటికి ఆమె మెహందీ పెట్టుకోకపోవడాన్ని గమనించిన వారు ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని వరుడికి చెప్పారు. తాను పెళ్లి చేసుకోవడంలేదని గౌస్‌కు ఫోన్ చేశాడు అలీ. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బంధువులందరికీ పెళ్లి కార్డులు పంచామని, ఈ సమయంలో వివాహం రద్దు చేసుకోవద్దని ప్రాధేయపడ్డా వరుడు వినిపించుకోలేదు. బాధితులు చేసేది లేక ఖైరతాబాద్ కార్పొరేటర్ మహ్మద్ షరీఫ్ సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సోమవారం వరుడు మసూద్ అలీని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. -
గోరింటా పూసిందీ...
మతాలకు అతీతమైనది. వయసు తేడా లేనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మగువ మనసుకు ముచ్చట కలిగించేది... గోరింట. ఈ మాసం ఆషాఢం. ఓ వైపు రంజాన్, మరో వైపు తెలుగు పండగలు వరసగా వస్తున్నాయి. అతివ చేతుల్లో గోరింట మందారంలా పూసి, మెరిసి, మురిసిపోయే రోజులే ఇక ముందన్నీ... అందుకే ఎర్రన్ని గోరింట ముస్తాబు... ఈ వారం... గోరింట చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, కావలసిన ఆకారంలో చేతులకు పెట్టి, రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే చేతులు ఎరుపు రంగులోకి మారతాయి. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. చర్మసంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజెన్లైన్నో సృష్టించారు సృజనకారులు. వీటిని మగువలతో పాటు మగవారూ తమ భుజాలు, వీపు, ఛాతీ భాగాలలో టాటూగా వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. తెలుగింటి పల్లెపడుచు చేతుల్లో నిండుగా... క్రిస్టియన్ పెళ్లి వేడుకలలో కాంతిమంతంగా... ముస్లిమ్ మగువ ముంజేతులలో ఆకర్షణీయంగా.. గోరింట రూపురేఖలు మార్చుకొని మెహెందీ డిజైన్లుగా ఆకట్టుకుంటోంది. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్,.. ఏ మతమైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. ప్రపంచం మొత్తమ్మీద గోరింటతో శారీరక అలంకరణలో రకరకాల ప్రయోగాలు చేసేది ఇండియా, అరబ్ దేశాలు మాత్రమే. అదృష్టానికి, ఆరోగ్యానికి ప్రతీకగా అరబ్దేశాలలో ఐదు వేల ఏళ్ల క్రితమే గోరింటను వాడినట్టు, హెన్నా పదం అక్కడి నుంచే వచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్టు ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని, మంచి ఆలోచనలు వస్తాయని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకునేవారు. వీటివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు మెరుగవుతుందని భావించేవారు. ఇప్పటికీ మన దేశ గ్రామీణ ప్రాంతాలలో ఈ నమ్మకం ఉంది. ఈజిప్ట్ ‘మమ్మీ’ల జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకును వాడేవారని ఒక వివాదాస్పద వార్త కూడా ఉంది. క్రీ.పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిప్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని, అప్పటి నుంచి అతివల చేతులు, పాదాలపై గోరింట ఎర్రగా పూయడం మొదలుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చారిత్రకపరంగా చూస్తే మనుషులకు గోరింటాకు ఔషధంగా... వస్త్రం, లెదర్, కేశాలు రంగు మారడానికి ‘డై’గా వాడేవారని తెలుస్తోంది. ఉత్తరాదిన కడ్వాచౌత్, దీపావళి, దక్షిణాదిన అట్లతద్ది వంటి పండగలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తోంది. ఉత్తరభారత వివాహ సంప్రదాయం ఇటీవల దక్షిణాదినీ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుతున్నారు. బాలీవుడ్ సినిమాలలో ‘మెహెందీ వేడుక’ ఒక ప్రధానాంశం. ఈ సినిమాల వల్ల నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులలో వివాహవేడుకల సమయాలలో అలంకరణలో భాగంగా మెహెందీ ప్రథమస్థానంలో నిలిచింది. ఆ విధంగా 1990 నుంచి మెహెందీ అలంకరణలలో నూతన పోకడలు వచ్చి చేరాయి. నాటి నుంచి ఈ డిజైన్లను ‘హెన్నా టాటూస్’గా పిలవడం ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు హెన్నా డిజైన్స్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ డిజైన్లని ముస్లిమ్ మహిళలు అలవోకగా వేయడం అక్కడి నుంచే మొదలైంది. వేదాలలో గోరింటరంగును సూర్యునికి ప్రతీకగా చె ప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. మనిషి లోపల ఉన్న జ్ఞాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు. డిజైన్లలో వైవిధ్యం ఇటీవల కాలంలో బ్రైడల్, ఇండియన్, అరబిక్... మెహెందీ డిజైన్లు పోటీ పడుతున్నాయి. వీటిలోనే షేడెడ్, ఫ్లోరల్, మోటిఫ్స్... ఇలా తీర్చిన డిజైన్లలో రంగురంగుల రాళ్లు, పూసలు, గ్లిట్టర్ (మెరుపుతో ఉండే పచ్చని రంగు)ను కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు నేరుగా అచ్చులతో రంగు డిజైన్లను నిమిషాలలో ఒంటి మీద ముద్రించుకుంటున్నారు. ఇంకొందరు ప్లాస్టిక్ డిజైన్ల్లో వచ్చిన స్టిక్కర్స్నీ అతికించుకుంటున్నారు. జీవనశైలి వేగవంతంగా మారుతుండటంతో ఈ డిజైన్లలోనూ ఆధునిక పోకడలు వేగం పుంజుకుంటున్నాయి. మెహెందీ.. ఇలా మేలు.. మెహెందీ కోన్లు మార్కెట్లో విస్తృతంగా లభిస్తున్నాయి. వీటితో డిజైన్ వేసుకోవడానికి ముందు ఆ మెహెందీ మన చర్మానికి సరి పడుతుందా లేదా అనేది పరీక్షించుకోవడం తప్పనిసరి. చెవి వెనుక భాగంలో (చెవి వెనుక భాగం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని ఏ రియాక్షన్ అయినా త్వరగా తెలిసిపోతుంది) లేదా మోచేతి దగ్గర మెహెందీ రాసుకొని, 3-4 రోజుల తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదంటే అప్పుడు డిజైన్ వేయించుకోవడం ఉత్తమం. మరీ ముఖ్యంగా బ్లాక్ మెహెందీలో ఎక్కువ అలెర్జీ కారకాలు ఉంటున్నాయి. డిజైన్ నల్లగా రావడానికి వీటిలో హానికారక రసాయనాలు కలుపుతున్నారు. మెరుపులు వచ్చే గ్లిట్టర్ తరహా మెహెందీలు సైతం చర్మానికి పడక చాలా మంది ప్రమాదకరమైన స్థితిలో ఆసుపత్రికి వస్తుంటారు. ముఖంతో పాటు గాలి పీల్చుకునే శ్వాసవాహిక కూడా ఉబ్బి పోతుంది. చేతులు, పాదాలపై మెహెందీ డిజైన్ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోయి, పొక్కులు, చీము కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును ఉపయోగించడాన్నే ప్రోత్సహించాలి. - శైలజ సూరపనేని, కాస్మటిక్ డెర్మటాలజిస్ట్ - నిర్మలారెడ్డి -
నీతా చేతి గోరింటాకు!
కళ గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం మాత్రమే కాదు కళ కూడా. మెహెందీ పేరుచెప్పగానే ఏ మహిళైనా వెంటనే చేయి చాపుతుంది. ఆసక్తిని కాస్తా ఆర్ట్‌గా మార్చుకున్న నీతా దేశాయ్ శర్మ మనదేశంలో టాప్‌టెన్ మెహందీ డిజైనర్లలో ఒకరు. సామాజిక సేవకురాలిగా పనిచేస్తున్న నీతా దేశాయ్ పుణెలో జన్మించారు. సేవాకార్యక్రమాల్లో భాగంగా...విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో నీతా మెహెందీ కళపై దృష్టి పెట్టారు. చిన్నప్పటి నుంచి మెహందీని ఇష్టపడే నీతాకు అప్పటికే బోలెడు డిజైన్లు వచ్చు. ఇండియన్, పాకిస్తాన్, అరబ్ మెహందీ డిజైన్లపై ప్రత్యేకంగా చేసిన సాధన నీతాలోని ఓ కళాకారిణిని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసింది. మెహందీ డిజైన్లపై నీతా చేసిన ప్రయోగాలన్నింటికీ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఉన్న నీతా విదేశీ పర్యటనలో భాగంగా ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, యూరప్‌లలో తన మెహెందీ డిజైన్లను పరిచయం చేసింది. ఆమె కనుగొన్న కొత్తడిజైన్లకు సంబంధించి రెండు పుస్తకాలు కూడా వేసింది. ఇక ఇండియన్ డిజైన్ల విషయానికొస్తే ఎడమ చేతిపై పెళ్లికూతురు ముఖాన్ని, కుడి చేతిపై పెళ్లికొడుకు ముఖాన్ని కోన్‌తో వేయడం నీతా ప్రత్యేకతన్నమాట. మెహెందీ కళలో మేమంటే మేము...అంటూ పోటీపడేవాళ్లలో నీతా ఎప్పుడూ ముందంజలో ఉంటున్నారంటూ కితాబిచ్చారు వరల్డ్ ఫ్యాషన్ మ్యాగజైన్వారు. -
ఆడపడచుల ఆటపాటల పండుగ... అట్లతద్దె
ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్లతద్దె నోము నోచుకోని తెలుగువారు అరుదు. అందుకే అష్టాదశ వర్ణాలకు అట్లతద్దె అని సామెత. కన్నెపిల్లలు తమకు సలక్షణమైన భర్త రావాలని, వివాహితలు తమ కాపురం కలకాలం సంతోషంగా సాగాలనీ కోరుతూ నోచే నోము అట్లతద్దె. ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. తూరుపు తెలతెలవారకముందే కన్నెపిల్లలు, కొత్తపెళ్లికూతుళ్ల కాళ్లు పారాణితోనూ, చేతులు గోరింటాకుతోనూ, నోరు తాంబూలంతోనూ, చెంపలు సిగ్గుతోనూ ఎర్రగా పండే పండుగ అట్లతద్దె. కొత్త పరికిణీ, వోణీ, మువ్వల పట్టాలు ధరించి ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్- ముద్దపప్పోయ్ మూడట్లోయ్... పీటకిందా పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లారా లేచిరండోయ్.. ’ అంటూ ముచ్చటగొలిపే ఆటపాటలతో ఆడపిల్లలు ఊరంతా సందడి చేస్తారు. సాయంత్రం సంజెచీకట్లు పడేసరికల్లా అట్లతద్దెనోము చంద్రోదయ వేళకు గౌరమ్మను షోడశోపచారాలతో పూజించి- పసుపు, కుంకుమ, రవికెల గుడ్డ సమర్పించి అట్లు నివేదించి, ముత్తయిదువలకు పండు, తాంబూలం, అట్లు వాయనమిస్తారు. వారు నిండు మనస్సుతో ‘‘మంచి మొగుడొచ్చి పిల్లాపాపలతో నీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా సాగాలి’’ అంటూ ఆశీస్సులందిస్తారు. వ్రతవిధానం: ఆశ్వయుజ బహుళ తదియనాడు కన్నెపిల్లలు, కొత్తగా పెళ్లయిన ఆడపడచులు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, పొట్లకాయకూర, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో భుజించి తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత తిన్న అన్నం వంటబట్టేదాకా ఆటపాటలతో గడపాలి. హాయిగా ఊయలలూగాలి. అనంతరం స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్ర ం ఆకాశంలో తారాచంద్రులు తొంగి చూసే సమయానికి శుచిగా తయారై, గౌరీ పూజ చేసి అమ్మవారికి వారి వారి ఆనవాయితీ ప్రకారం నిర్ణీత సంఖ్యలో అట్లు నివేదించాలి. తర్వాత ఒక ముత్తయిదువను గౌరీదేవి ప్రతిరూపంగా భావించి, ఆమెకు అలంకారం చేసి, అట్లు, పండు తాంబూలం వాయనంగా ఇవ్వాలి. ఉద్యాపన విధానం: పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇవ్వాలి. అనంతరం వారికి భోజనం పెట్టి సంతుష్టి పరచి వారి వద్ద నుండి ఆశీస్సులందుకోవాలి. శాస్త్రీయ దృక్పథం: మన పెద్దలు ఏర్పరచిన ప్రతి సంప్రదాయం వెనుకా ఎంతో అమూల్యమైన శాస్త్రీయ దృక్పథం ఉంది. అట్లతద్ది నోములో కూడా అంతే విశిష్ఠత ఉంది. నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి. కుజునికి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారంలో ఎటువంటి అడ్డంకులూ రావు. రజోగుణం కల కుజుడు స్త్రీలకు రుతుసంబంధమైన సమస్యలు, గర్భధారణ సమస్యలకు కారకుడు. కుజునికి అట్లు నివేదించడం వల్ల అటువంటి సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడే మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమంలో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. అందువల్ల ఈ రెండూ కలిసిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుంది. గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున మసక మసక వెలుతురులో ముందురోజే చెట్లకొమ్మకి కట్టి ఉంచిన ఉయ్యాలలు ఊగేందుకు వెళుతూ తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. ఆ చప్పట్లకీ ఆటపాటలకీ, కోలాహలానికీ గలగల నవ్వుల సవ్వడికీ సాటి ఆడపిల్లలు, వారికి తోడుగా ఈడైన కుర్రకారు అక్కడికొచ్చి సందడి చేస్తారు. మొత్తం మీద అట్లతద్దె అంటే సంప్రదాయకంగా నోచే నోము మాత్రమే కాదు, ఆటపాటలతో గడిపే సంబరం కూడా. - డి.వి.ఆర్ అట్లతద్ది సందేశం: అట్లతద్ది రోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి.