గోరింటాకుతో తయారు చేసే హెన్నా తలకు మంచి కండిషనర్‌గా ఉంటుందని పెడుతుంటారు. అందరికీ తెలిసిందే కానీ ఒక్కొసారి అది పడకపోతే లేనిపోని చర్మ సమస్యలు ఎదుర్కొనక తప్పదు. అందరికి ఒకేలా ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలావరకు సహజసిద్ధంగా తయారు చేసిన హెన్నాతో ఇబ్బందులు ఉండవు. ఒక్కొసారి అవి బాగా ఎరుపుగా పండాలని వాటిలో కెమికల్స్ కలుపుతారు. అవి అందరి శరీరానికి పడవు. రియాక్షన్ ఇచ్చి కాలినగాయాల మాదిరిగా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి చేదు అనుభవమే యూకేలో ఓ చిన్నారికి ఎదురైంది.
వివరాల్లోకెళ్తే..కిర్ట్సీ న్యూటన్ తన ఏడేళ్ల చిన్నారి మటిల్డాను టర్కీలో విహారయాత్రకు వెళ్లింది. అక్కడ ఓ హోటల్‌లో చిన్నారి చేతిపై బ్లాక్‌హెన్నాతో(మెహందీ) టాటు వేయించుకుంది. సీతాకోక చిలుక మాదిరి డిజైన్ వేయించుకుంది. ఆ తర్వాత అది రియాక్షన్ ఇచ్చి దురద, మంట రావడం మొదలైంది చిన్నారికి. దీంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా ఆ హెన్న టాటు కారణంగా ఇలా అయ్యిందన్నారు. అందులో ఉండే కెమికల్స్ చర్మ సంబంధిత అలెర్జీలు ఇస్తాయని చెప్పారు. దీంతో ఆ టాటు వేయించుకున్న ప్రదేశం అంతా కాలిన గాయంలా ఎర్రగా అయిపోయింది.
వైద్యులు దురద రాకుండా, పుండులా ఏర్పడకుండా ఉండేలా యాంటి బయోటిక్ క్రీమ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి నెమ్మదిగా కోలుకుంటోంది. జుట్టుకి కూడా వినియోగించే ఈ బ్లాక్ హెన్నా ఇంత చేటు తెస్తుందని ఊహించలేదని ఆ చిన్నారి తల్లి వాపోయింది. ఇక తలకు కూడా ఆ హెన్నాను ఉపయోగించాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది. దయచేసి తల్లిదండ్రులు ఇలాంటివి చిన్నారులకు అలవాటు చేయకండి. అవి మీ చిన్నారుల లేత చర్మాన్ని గాయపరుస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. సహజంగా గోరింటాకు చెట్లతో ఉన్న వాటితోనే ఏమైన వేసుకోండి గానీ ఇలా ఏదైనా హోటల్, షాపింగ్ మాల్‌లో హెన్న టాటులు(మెహిందీలు) వేయించుకోకండని హెచ్చరించారు. సహజ సిద్ధంగా గోరింటాకు చెట్లతో తయారు చేసిన వాటినే నేరుగా పెట్టకోకండి అని సూచిస్తోంది ఆ బాధిత చిన్నారి తల్లి.
(చదవండి: ఆ ఒక్క సంజ్ఞతో..ఆ ఆవుల మందను కదలకుండా చేశాడు!)
Comments
Please login to add a commentAdd a comment