tatoo
-
దిశా పటానీ టాటూ గోల.. ప్రభాస్ పేరుతో లింక్ ఎందుకు..?
ముంబయి బ్యూటీ దిశా పటానీ చాలా ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో టాలీవుడ్‌కు టచ్‌లోకి వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్, స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే , కల్కి సినిమాతో మళ్లీ టాలీవుడ్లో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు (టాటూ) సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.దిశా పటానీ పచ్చబొట్టులో "PD" అనే రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. దీని అర్థం ఏంటి అంటూ చాలామందిలో ప్రశ్నలు తలెత్తాయి. అయితే, లాజిక్స్ మాత్రమే చూసే కొందరు PD అంటే 'ప్రభాస్ డార్లింగ్' అని అర్థం చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. దీనంతటికి కారణం ఆమె కల్కి చిత్రంలో నటించడమే అని చెప్పవచ్చు. మా 'ప్రభాస్ డార్లింగ్' పేరును టాటూగా ఎందుకు తీసుకున్నావ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అయితే, వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే ఈ పుకార్లు నిరాధారమైనవని చెప్పవచ్చు. ముందుగా, దిశా పటాని కల్కి 2898 AD కోసం ప్రచార కార్యక్రమాలలో కూడా చేరలేదు. ప్రభాస్‌తో ఆమెకు ఎక్కువగా సీన్లు కూడా లేవు. వారిద్దరి మధ్య అంత బాండింగ్, స్నేహం ఉండే ఛాన్స్ లేదని చెప్పవచ్చు. "PD" అక్షరాలు ఆమె అసలు పేరు దిశా పటాని (DP) యొక్క రివర్స్ వెర్షన్ కావచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే, అసలు విషయం తెలియాలంటే దిశా పటానీ రివీల్ చేయాల్సిందే.ఇలా ఎంతమందితో మా డార్లింగ్‌ను లింక్ చేస్తారంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఆయనకు అర్జెంట్‌గా పెళ్లి చేస్తే కానీ ఇలాంటి వాటికి ఫుల్‌స్టాఫ్ పడదని తెలుపుతున్నారు. దిశా పటానీ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్‌తో ఆమె చాలాకాలం నుంచి రిలేషన్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆయనతో బ్రేకప్ అయ్యాక విదేశీ మోడల్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. -
నొప్పి తెలియకుండా .. ఏఐ సాయంతో టాటూ ప్రింటర్ లాంచ్ చేసిన ఎల్జీ
పచ్చబొట్లకు ఫ్యాషన్ ప్రపంచంలో విపరీతమైన గిరాకీ ఉంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా టాటూ స్టూడియోలు కళకళలాడుతుంటాయి. అయితే, టాటూ వేయించుకోవాలంటే ఖర్చును, నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది. కోరుకున్న డిజైన్లలో పచ్చబొట్టు వేయడానికి చాలా సమయం కూడా పడుతుంది. కోరుకున్న డిజైన్లలోని పచ్చబొట్లను చిటికెలో ముద్రించే ఈ టాటూ ప్రింటర్‌ను కొరియన్ బహుళజాతి సంస్థ ఎల్జీ ఇటీవల రూపొందించింది. చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉన్న ఈ టాటూ ప్రింటర్ శరీరంపైనే కాకుండా, దుస్తులపై కూడా కోరుకున్న డిజైన్లను క్షణాల్లోనే ముద్రిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ టాటూ ప్రింటర్‌ను మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. యాప్ ద్వారా డిజైన్లను ఎంపిక చేసుకుని, టాటూను ముద్రించదలచుకున్న చోట దీన్ని ఉంచి, ఆన్ చేసుకోవడమే తరువాయిగా రకరకాల రంగుల్లో, రకరకాల డిజైన్లలో టాటూలను ముద్రించుకోవచ్చు. ‘ఎల్జీ హెచ్ అండ్ హెచ్ ఇంప్రింటు’ పేరుతో రూపొందించిన ఈ టాటూ ప్రింటర్‌ను ఎల్జీ కంపెనీ ఈ ఏడాది లాస్ వేగస్‌లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ప్రదర్శించనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
బాయ్‌ఫ్రెండ్ పేరుతో నుదుటిపై పచ్చబొట్టు.. వీడియో వైరల్
ప్రేమను అనేక రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, సర్ప్రైజ్లు ప్లాన్ చేయడం.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు ప్రేమను తెలియజేస్తుంటారు. ఇంకొందరు మాత్రం జీవితాంతం గుర్తుండేలా, తమకు నచ్చిన వార్ల పేర్లను టాటూలుగా వేయించుకుంటారు. తాజాగా ఓ యువతి మాత్రం తన బాయ్‌ఫ్రెండ్ పేరును ఏకంగా నుదుటిపై టాటూ వేయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్ నడుస్తోంది. యూత్‌కి టాటూలపై వీపరీతమైన క్రేజ్.సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరంపై టాటూ డిజైన్ వేయించుకుంటున్నారు. కొందరు జీవితకాలం జ్ఞాపకంలా ఉండాలని తమ ప్రియమైన వారి పేర్లతో పాటు నచ్చిన వ్యక్తుల ఫోటోలను కూడా టాటూలుగా వేయించుకోవడం ఇప్పటి వరకు చాలా చూశాం. View this post on Instagram A post shared by Ana Stanskovsky-Content creator (@ana_stanskovsky) కానీ యూకేకు చెందిన ఓ యువతి తన ప్రియుడిపై ప్రేమను వ్యక్తపరిచేందుకు వినూత్నంగా ఆలోచించి ఏకంగా నుదుటిపై పచ్చబొట్టు పొడిపించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'పిచ్చి పది రకాలు అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమవుతుంది, అయినా ఒకవేళ నీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక్ప్ అయిపోతే ఏం చేస్తావ్' అంటూ వ్యంగంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. నిజాయితీ ఉన్న ప్రేమకు ఇలాంటి స్టంట్లు చేయాల్సిన అవసరం ఏముంది? అయినా టాటూ ఫిల్లింగ్ చూస్తుంటే ఇది ఫేక్ వీడియోలా ఉంది. పబ్లిసిటీ కోసం ఇలా చేసిందేమో అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆమె స్వయంగా స్పందిస్తూ.. ''ఇది నిజంగా పచ్చబొట్టు. నా బాయ్‌ఫ్రెండ్‌పై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఇలా టాటూ వేయించుకున్నా. అయినా మీరు అనుకున్నట్లు మాకు బ్రేకప్ జరగదు. ఎందుకంటే కెవిన్(బాయ్‌ఫ్రెండ్ పేరు)తో నేను చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నాను. అద్దంలో నా ముఖం చూసుకున్న ప్రతీసారి కెవిన్ నాతోనే ఉన్నట్లు చాలా సంతోషంగా ఉంది. అయినా నాకు లేని ఇబ్బంది మీ అందరికి ఏంటో'' అంటూ ట్రోలర్స్‌కి గట్టిగానే బదులిచ్చింది. View this post on Instagram A post shared by Ana Stanskovsky-Content creator (@ana_stanskovsky) -
టాటులు వేయించుకోవడం మంచిది కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు రావా?
పచ్చబొట్టు వేసుకోవడం పురాతన కళ. ప్రపంచవ్యాప్తంగా ఇది కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. పలుదేశాల్లో బయటపడిన కొత్తరాతియుగం నాటి ఆధారాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా 3300 నుంచి 3200 నాటి ‘ఓట్జీ ది ఐస్ మ్యాన్’ మమ్మీ.. ఆస్ట్రియా–ఇటలీ సరిహద్దుల్లో దొరికింది. అతడి పచ్చబొట్లను ఎక్స్ రే తీసిన శాస్త్రవేత్తలు.. అతడి శరీరంపైనున్న ప్రతి పచ్చబొట్టుకు కొన్ని నొప్పులు, వ్యాధులే కారణమని నిర్ధారించారు. దీనిని బట్టి పురాతన చికిత్సా విధానాల్లో భాగంగా పచ్చబొట్లను వేసుకునేవారని తేలింది. ఫ్రాన్స్, పోర్చుగల్, స్కాండినేవియన్ దేశాల్లోని పురావస్తు శాఖ పరిశోధకులకు పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించే పురాతన పరికరాలు దొరికాయి. అవి సుమారు పన్నెండువేల ఏళ్ల నాటి మంచు యుగానికి చెందినవని నిర్ధారించారు. ఆనాటి కొన్ని స్త్రీల బొమ్మలపై పచ్చబొట్ల లాంటి చిత్రాలు ఉన్నాయి. తొడలపైన, వీపు మీద పచ్చబొట్లు వేయించుకోవడం అప్పటి నుంచే ఉండేదనేందుకు ఆ చిత్రాలే నిదర్శనాలు. పచ్చబొట్లు చర్మం మీద వేయించుకొనే శాశ్వత చిహ్నాలు. ఒకప్పుడు ఇవి నలుపు, ముదురాకుపచ్చ రంగుల్లో ఉండేవి. ఇప్పుడు పచ్చబొట్లు రకరకాల రంగులతో మరింత కళాత్మకంగా రూపు దిద్దుకున్నాయి. పూర్వం చాలామంది సంతల్లో, జాతర్లలో తమ పిల్లలు తప్పిపోకూడదని చేతులపై వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించేవారు. పలు తెగలకు చెందిన గిరిజన స్త్రీలు తమ ముంజేతులు, భుజాలు, పాదాలపై నక్షత్రాలు, చందమామ చిత్రాలను తమ తమ సంప్రదాయాల ప్రకారం పచ్చబొట్టుగా వేయించుకుంటారు. అప్పట్లో కొందరు స్త్రీలు సౌందర్యం కోసం బుగ్గలు, పై పెదవి, చుబుకం మీద పుట్టుమచ్చల్లా పచ్చబొట్లు వేయించుకునేవారు. కాలక్రమేణా మనసులోని ప్రేమను వ్యక్తపరచేందుకు ప్రియమైనవారి పేరును పచ్చబొట్టు వేయించుకునేవారు పెరిగారు. ప్రాచీన గ్రీకు, రోమన్, పర్షియన్ రాజ్యాల్లో బానిసలు, నేరగాళ్లు పారిపోయినా, వారిని సులువుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుగా వారి శరీరాలపై ప్రస్ఫుటంగా కనిపించేలా పచ్చబొట్లు వేసేవారు. రోమన్ చక్రవర్తుల కాలంలో పచ్చబొట్ల కళకు రాజాదరణ అమితంగా ఉండేది. రాజులను మెప్పించడానికి రాజ దర్బారులోని వారంతా పచ్చబొట్లు వేయించుకునేవారు. దర్బారులోని రాజోద్యోగులను చూసి సామాన్య పౌరులూ పచ్చబొట్లు వేయించుకోవడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతోంది. ఈ ధోరణి విపరీతమైన కొన్నాళ్లకు.. కొందరు మతపెద్దలు పచ్చబొట్లను నిషేధించడంతో 19వ శతాబ్దం వరకూ పశ్చిమ యూరోపియన్లకు పచ్చబొట్ల కళ దూరమైంది. ఇక తూర్పు యూరోపియన్లు కూడా పచ్చబొట్లపై పెద్దగా ఆసక్తికనబరచలేదు. అయితే వారు తమ శత్రువులను అవమానించడానికి అసహ్యకరమైన పచ్చబొట్లను నుదుటిపై వేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. టాటూ అర్థాలు వాటర్ కలర్ టాటూలు, బ్లాక్‌వర్క్ టాటూలు, ఇలస్ట్రేటివ్ టాటూలు, హెన్నా టాటూలు, డాల్ఫిన్ టాటూలు, పువ్వులు, సీతాకోక చిలుకలు, పక్షుల టాటూలు.. ఇలా ఒకటి రెండూ కాదు కొన్ని వందల టాటూలు ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్నాయి. పైగా రంగులు పెరిగే కొద్దీ సహజమైన అందాలను అచ్చంగా అద్దే ఆర్టిస్ట్‌లు చాలామందే పుట్టుకొస్తున్నారు. అయితే టాటూ బాగుంది కదా అని వేయించుకునే వారికంటే.. వాటి అర్థాలు తెలుసుకుని వేయించుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో టాటూ అర్థాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇప్పుడు ఎక్కువమంది వాడే కొన్ని టాటూల అర్థాలు చూద్దాం. డ్రాగన్ – ధైర్యం, బలం, రక్షణ, శక్తి, జ్ఞానం సీతాకోక చిలుక – అందం, స్వేచ్ఛ, విశ్వాసం పక్షులు – స్వేచ్ఛ, ఆకాశమే హద్దు నక్షత్రం – ఆశ, విశ్వాసం, పరివర్తన, ఆశయం, విజయం పువ్వులు – సున్నితత్వం, ప్రశాంతత (ఎంచుకున్న రంగును బట్టి, పువ్వును బట్టి మరిన్ని అర్థాలు మారతాయి) సూర్యుడు – ఆరంభం, శక్తి మ్యూజిక్ టాటూ – ప్రేమ, పరివర్తన, అహ్లాదం (డప్పు, పియానో, ప్లేబ్యాక్ బటన్స్ వంటి రూపాలను బట్టి అర్థాలు మారతాయి) పులి – నాయకత్వం, ప్రాణాంతకం, భయానకం, ప్రకృతిపై ప్రేమ సింహం – రాజసం త్రాసు – సానుకూలత, ఆదర్శవాదం శాశ్వత అలంకరణగా టాటూ మేకప్ ఎర్రని పెదవులు, గులాబి బుగ్గలు, నిండుగా ఉన్న కనుబొమలు, దట్టంగా కనిపించే కనురెప్పలు.. వీటితో స్త్రీలకు ప్రత్యేకమైన అందం వస్తుంది. అందుకే తాత్కాలిక కాస్మెటిక్స్ పక్కన పెట్టి మరీ.. ఈ పర్మినెంట్ టాటూ రంగుల్ని వాడటం మొదలుపెట్టారు నేటి మహిళలు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదని.. 1902లో లండన్‌లో మొదలైందనే ఆధారాలున్నాయి. అయితే భారతీయుల్లో పర్మినెంట్ మేకర్ అనే ఈ కళ 19వ శతాబ్దం చివర్లో ప్రారంభమైంది. ఇప్పుడు దేశవాప్తంగా పలు సెలూన్స్, స్కిన్ క్లినిక్స్ ఇలాంటి శాశ్వతమైన మేకప్ ట్రెండ్‌ని అందిస్తున్నాయి. అయితే కొంతమంది అమ్మాయిలు.. పార్టీలు, ఫంక్షన్ల కోసం మాత్రమే సెమీ పర్మినెంట్ మేకప్స్ వేయించుకుంటున్నారు. అవి కొన్ని రోజుల పాటు చెక్కు చెదరని అందాన్ని ఇస్తుంటాయి. కానీ పర్మినెంట్ మేకప్స్ పట్ల మోజు చూపే యువత సంఖ్యే ఎక్కువగా ఉంది. సున్నితమైన పెదవులు, కళ్లు వంటి చోట్ల పర్మినెంట్ మేకప్‌లో భాగంగా రసాయనాలు వాడుతుండటం అంత మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో వీటి జోలికి వెళ్లేందుకు కాస్త వెనుకాడుతున్నారు. ఈ మధ్య కాలంలో కపుల్ టాటూస్‌తో పాటు ఫ్రెండ్స్ టాటూలూ బాగానే ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే వీటితో పాటు పాపులర్‌గా నిలుస్తున్న కొన్ని టాటూస్ విశేషాలు చూద్దాం. ►కలర్‌ఫుల్ టాటూస్: వీటిలో చాలా కలర్స్ వాడుతారు. మనిషి ముఖం, పువ్వులు వంటి ప్రకృతి అందాలను సహజసిద్ధంగా చెక్కుతారు. ►టెంపరరీ టాటూ: నచ్చిన స్టికర్ సెలెక్ట్ చేసుకుంటే.. దాని మీద ఒకరకమైన స్ప్రే జల్లి.. ఆ స్టికర్ లాగేస్తారు. ఇది మూడు రోజుల నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. ►యానిమే టాటూ: వీడియో గేమ్స్ నుంచి ప్రేరణ రూపొందిన టాటూలు ఇవి. యానిమేషన్ లవర్స్ వీటిని విపరీతంగా వేయించుకుంటున్నారు. ►లివింగ్ టాటూ: దీన్నే త్రీడీ టాటూ అనీ అంటారు. వీటిలో కొన్ని చూడటానికి కదలుతున్నట్లుగా ఉంటాయి. మనదేశంలో ఇవి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. ►మ్యూజిక్ ప్లేయింగ్ టాటూ: ఇష్టమైన వారి వాయిస్‌ని రికార్డ్ చేసి.. దాన్ని మ్యూజిక్ సింబల్ రూపంలో మార్పించి, దాన్ని టాటూగా వేయించుకోవచ్చు. అలా వేయించుకున్న టాటూని.. ఫోన్లో తిరిగి స్కాన్ చేస్తే ఆ వాయిస్ మనకు వినిపిస్తుంది. టాటూ క్యాన్సర్ కారకమా? కలప బూడిదతో, నూనె, పసుపు కాల్చిన మసితో మూలికలను జోడించి.. పూర్వం పచ్చబొట్టు సిరాలను తయారు చేసేవారు. అయితే నేడు రకరకాల పిగ్మెంట్స్తో తయారైన కెమికల్ ఇంకును వాడుతున్నారు. పైగా ఏది ఎంత మోతాదులో వాడుతారనేదానికి సరైన తూకం లేదు. తయారీదారులు వాటి సాంద్రతను, గాఢతను బహిర్గతం చేయాల్సిన పనిలేదు. అలాగే టాటూ డిజైనర్స్.. వేసే డిజైన్ని బట్టి సొంతంగానే సిరాను కలిపి పచ్చబొట్లను చిత్రిస్తారు. దాంతో దేని మోతాదు ఎంత? దాని వల్ల కలిగే ఫలితాలేంటి అనేవి స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అయితే గత ఏడాది అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు టాటూ ఇంక్స్ మీద పలు పరిశోధనలు చేశారు. అప్పుడే ఓ షాకింగ్ విషయం బయటపడింది. టాటూల కోసం ఉపయోగించే ఇంకుల్లో క్యాన్సర్ కారకం ఉందని వారు వెల్లడించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన సైంటిస్ట్ స్వియర్క్ నేతృత్వంలో దాదాపు వంద రకాల టాటూ ఇంకులను పరీక్షించారు. టాటూలు ఎప్పటికీ తొలగిపోకుండా శరీరంపై ఉండటానికి ఇంకుల్లో ఉండే పిగ్మెంట్, క్యారియర్ సొల్యూషన్ని వాడుతుంటారు. శాస్త్రవేత్తలు పరీక్షించిన 100 ఇంకుల్లో 23 ఇంకుల్లో అజో అనే సింథెటిక్ రంగుల ఉనికిని గుర్తించారు. సాధారణంగా అజో సింథెటిక్ రంగులను ఆహార పదార్థాలు, సౌందర్య ఉత్పత్తులు, దుస్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇవి బ్యాక్టీరియా చేరినా, అధిక సూర్యరశ్మి తగిలినా క్యాన్సర్ కారకంగా మారుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. టాటూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావా? ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధపడే వారు.. శరీరంపై పచ్చబొట్లు వేయించుకునే ఆలోచన మానుకుంటే మంచిది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, పోలీసు ఉద్యోగాలతో పాటు.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) వంటి ఉద్యోగాలు ఒంటిపైన పచ్చబొట్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రావు. వాస్తవానికి, శరీరంపై పచ్చబొట్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోవడానికి.. పచ్చబొట్లు పలు వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందనేది ఒక కారణం కాగా.. సైన్యం వంటి రక్షణ రంగంలో శరీరంపై టాటూలు భద్రతకు ముప్పు అనేది మరో కారణం. అంతేకాదు టాటూ వేసుకున్నవారు క్రమశిక్షణా రాహిత్యంతో ఉంటారనే అభిప్రాయమూ ఉంది. అయితే గత ఏడాది.. అన్ని అర్హతలూ ఉన్నా కేవలం తన ఒంటి మీదున్న టాటూ కారణంగా తనకు సర్కారు కొలువును నిరాకరించారంటూ అసోమ్‌కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ హైకోర్టు్టను ఆశ్రయించాడు. అయితే ఈ కేసులో కోర్టు.. పచ్చబొట్టు తీయించుకునేందుకు రెండు వారాలు గడువు ఇచ్చింది. పచ్చబొట్టు తొలగించుకున్నాక మెడికల్ బోర్డు ముందు హాజరు కావాలని, ఆ తర్వాతే నియామకం జరుగుతుందని తీర్పు చెప్పింది. రక్తదానం చేయకూడదా? గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో రక్తదానాలు చేసే వారి సంఖ్య పెరిగింది. రాజకీయ అభిమానులు, సినీ నటుల అభిమానులతో పాటు చాలామంది యువత సేవాభావంతో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సర్వసాధారణమైంది. అయితే రక్తదానం చేయడానికి ముందుకొచ్చేవారిలో వందకు సుమారు తొంభై మంది టాటూస్తోనే ఉంటున్నారని కొన్ని సర్వేలు తేల్చాయి. అత్యవసర పరిస్థితుల్లో అయినా సరే.. రక్తం తీసుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు వైద్యులు. ఆ జాగ్రత్తల్లో రక్తం ఇచ్చేవారు టాటూ వేయించుకున్న సమయం కూడా ముఖ్యమే. ఎందుకంటే టాటూ కారణంగా.. కొన్ని రకాల చర్మవ్యాధులు, హెపటైటిస్– ఏ, హెపటైటిస్–బీ, హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులూ సోకే ప్రమాదం ఉంది. ఎవరైనా టాటూ వేయించుకుంటే సంవత్సరం పాటు రక్తదానం చేయకూడదనేది రెడ్ క్రాస్ నిబంధన. అయితే కొన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన టాటూ సెంటర్స్‌లో టాటూ వేయించుకుంటే సమస్య లేదు. కానీ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ టాటూ వేయించుకున్న తర్వాత కనీసం ఆరు నెలలు రక్తదానం చేయొద్దని అంటోంది. ఆరోగ్య నిపుణుల సలహాలతో, ప్రొఫెషనల్ టాటూ సెంటర్స్‌లో టాటూలు వేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఇవి వద్దు గురూ.. చిరునవ్వు సానుకూలత.. విచారం ప్రతికూలత అనేది తెలిసిన సంగతే. ఇదే టాటూల విషయంలోనూ కనిపిస్తుంది. సానుకూల సంకేతాలతో మేలు, ప్రతికూల సంకేతాలతో కీడు ఎలా వచ్చిపోతాయో మన పురాణాల్లో ఋషులు వర్ణించారు. అందుకే కొందరు శాస్త్రం తెలిసిన పెద్దలు.. కొన్ని రకాల టాటూలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. పగిలిన అద్దం (అశుభానికి సంకేతం), తిరగబడిన గుర్రపు డెక్క (దురదృష్టానికి ప్రతీక), విరిగిన గడియారం (పురోగతికి అవరోధం) విచారంగా ఉండే ముఖం (దుఃఖానికి సూచన) వంటివి ఒంటిపై టాటూలుగా వేయించుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే గబ్బిలం, పాము, బల్లి, పిల్లి, తేలు వంటి రూపాలను టాటూలుగా వేయించుకుంటే అవి జీవితాన్ని సన్మార్గంలో తీసుకెళ్లవని కొందరి నమ్మకం. మొన్నటికి మొన్న హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మ.. ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. స్టేడియంలోనే.. తన జెర్సీని పైకి లేపి టాటూని చూపించాడు. ఒంటిపై వేయించుకున్న తల్లిదండ్రుల రూపాన్ని చూపించి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఆ దృశ్యం.. టాటూలపై మరోసారి చర్చకు దారితీసింది. యువత ఆకర్షణకూ కారణమైంది. ఈ రోజుల్లో యూత్.. టాటూ, టాటూస్య, టాటూభ్యోహ అనే రీతిలో టాటూ ఒరవడిని ఫాలో అవుతోంది. ఆ మాటకొస్తే అక్కినేని నాగార్జున, త్రిష, జూనియర్ ఎన్టీఆర్, నాని, తాప్సీ, విక్రమ్, షాలినీ పాండే, చార్మీ ఇలా ఎందరో సెలబ్రీటీలు ఏనాడో ఈ ట్రెండ్ ప్రారంభించారు. పచ్చబొట్టు చెరిగిపోద్దిలే.. పూర్వకాలం శరీరంపై వేసిన ఈ పచ్చబొట్లను తీసివేయడం కోసం నాటు పద్ధతులను ఉపయోగించేవారు. వెనిగర్, పావురాల రెట్టలతో పాటు మరికొన్ని పదార్థాలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని పిండికట్టులా పచ్చబొట్టుపై వేసేవారు. కానీ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్తో పచ్చబొట్లను తేలికగా తొలగిస్తున్నారు. ఈ ట్రీట్మెంట్తో నలుపు రంగులో ఉన్న పచ్చబొట్లను చాలా సులువుగా తొలగించవచ్చు. కానీ పసుపు, ఎరుపు వంటి ఇతర రంగులను తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. పాత పచ్చబొట్టు కొత్త రంగులతో వన్నె తరగని ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ఆరోగ్యం.. ఆహ్లాదం.. ఆనందం! దానికి పచ్చబొట్టూ మినహాయింపు కాదు! (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
చిన్నారుల చేతులకు మెహెందీ పెడుతున్నారా..?
గోరింటాకుతో తయారు చేసే హెన్నా తలకు మంచి కండిషనర్‌గా ఉంటుందని పెడుతుంటారు. అందరికీ తెలిసిందే కానీ ఒక్కొసారి అది పడకపోతే లేనిపోని చర్మ సమస్యలు ఎదుర్కొనక తప్పదు. అందరికి ఒకేలా ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలావరకు సహజసిద్ధంగా తయారు చేసిన హెన్నాతో ఇబ్బందులు ఉండవు. ఒక్కొసారి అవి బాగా ఎరుపుగా పండాలని వాటిలో కెమికల్స్ కలుపుతారు. అవి అందరి శరీరానికి పడవు. రియాక్షన్ ఇచ్చి కాలినగాయాల మాదిరిగా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి చేదు అనుభవమే యూకేలో ఓ చిన్నారికి ఎదురైంది. వివరాల్లోకెళ్తే..కిర్ట్సీ న్యూటన్ తన ఏడేళ్ల చిన్నారి మటిల్డాను టర్కీలో విహారయాత్రకు వెళ్లింది. అక్కడ ఓ హోటల్లో చిన్నారి చేతిపై బ్లాక్హెన్నాతో(మెహందీ) టాటు వేయించుకుంది. సీతాకోక చిలుక మాదిరి డిజైన్ వేయించుకుంది. ఆ తర్వాత అది రియాక్షన్ ఇచ్చి దురద, మంట రావడం మొదలైంది చిన్నారికి. దీంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా ఆ హెన్న టాటు కారణంగా ఇలా అయ్యిందన్నారు. అందులో ఉండే కెమికల్స్ చర్మ సంబంధిత అలెర్జీలు ఇస్తాయని చెప్పారు. దీంతో ఆ టాటు వేయించుకున్న ప్రదేశం అంతా కాలిన గాయంలా ఎర్రగా అయిపోయింది. వైద్యులు దురద రాకుండా, పుండులా ఏర్పడకుండా ఉండేలా యాంటి బయోటిక్ క్రీమ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి నెమ్మదిగా కోలుకుంటోంది. జుట్టుకి కూడా వినియోగించే ఈ బ్లాక్ హెన్నా ఇంత చేటు తెస్తుందని ఊహించలేదని ఆ చిన్నారి తల్లి వాపోయింది. ఇక తలకు కూడా ఆ హెన్నాను ఉపయోగించాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది. దయచేసి తల్లిదండ్రులు ఇలాంటివి చిన్నారులకు అలవాటు చేయకండి. అవి మీ చిన్నారుల లేత చర్మాన్ని గాయపరుస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. సహజంగా గోరింటాకు చెట్లతో ఉన్న వాటితోనే ఏమైన వేసుకోండి గానీ ఇలా ఏదైనా హోటల్, షాపింగ్ మాల్లో హెన్న టాటులు(మెహిందీలు) వేయించుకోకండని హెచ్చరించారు. సహజ సిద్ధంగా గోరింటాకు చెట్లతో తయారు చేసిన వాటినే నేరుగా పెట్టకోకండి అని సూచిస్తోంది ఆ బాధిత చిన్నారి తల్లి. (చదవండి: ఆ ఒక్క సంజ్ఞతో..ఆ ఆవుల మందను కదలకుండా చేశాడు!) -
వోగ్ కవర్ పేజీపై అత్యంత వృద్ధ స్టార్.. అలాంటి టాటూలు ఈమె మాత్రమే వేయగలదు
మౌలిక సదుపాయాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని గ్రామంలో ఉన్న వాంగ్ దగ్గర టాటూలు వేయించుకోవడానికి అంతర్జాతీయ ఔత్సాహికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ వేసుకోవాలన్న ఆసక్తికి తోడు, వాంగ్ వేసే జామెట్రిక్ డిజైన్స్ కోసం ఎగబడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి కళను సెంచరీ దాటాక కూడా కాపాడుతూ తరువాతి తరాలకు అందిస్తోన్న వాంగ్‌ను ‘వోగ్’ సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె రూపాన్ని చిత్రించింది. ఇప్పటిదాక వోగ్ కవర్‌పేజీపై వచ్చిన అత్యంత వృద్ధ స్టార్‌గా వాంగ్ నిలవడం విశేషం. ఎంతో ఇష్టమైన పేర్లు, నచ్చిన డిజైన్లను శరీరం మీద పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. ఈ అభిరుచి కొత్తగా వచ్చిందేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల్లో వందల ఏళ్లుగా భాగంగా ఉన్నదే. ఇప్పుడు టాటూలు వేయడానికి వాడుతోన్న సూదులు, టాటూ గన్లకు బదులు.. అప్పట్లో పదునైన గులాబీ ముళ్లు, సొరచేప పళ్లతో టాటూలు వేసేవాళ్లు. అప్పటి టాటూ పద్ధతులు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ వందల ఏళ్లనాటి టాటూ టెక్నిక్‌ను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తోంది అపోవాంగ్ ఓడ్. 106 ఏళ్ల వయసులో పురాతన టాటూలను వేస్తూ కళను సజీవంగా ఉంచుతోంది వాంగ్. అంతేగాక ప్రపంచంలో అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగ్ ఓడ్‌ను మరియా ఒగ్గే అని కూడా పిలుస్తారు. మనీలాకు దగ్గరల్లో ఉన్న కలింగా ప్రావిన్స్‌లోని మారుమూల బుస్కలాన్ గ్రామంలో పుట్టి, అక్కడే స్థిరపడింది. టీనేజ్‌లో ఉండగా ‘మాంబా బాటక్’ అనే టాటూ కళను నేర్చుకుంది. పదహారేళ్ల వయసులో తండ్రితో కలిసి మాంబా బాటక్ వేస్తూ టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అప్పట్లో మాంబా బాటక్ వేయగల ఒకే ఒక మహిళా ఆర్టిస్ట్ అపోవాంగ్. చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడ టాటూలు వేసేది. పురుషుల్లో ధైర్యసాహసాలకు గుర్తుగానూ, యోధులుగా గుర్తింపు పొందిన వారికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు ఈ టాటూలు వేయించుకునేవారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ల తరబడి టాటూలు వేస్తూనే ఉంది వాంగ్. బొగ్గులో నీళ్లు కలిపి సిరా తయారు చేసి వెదురు పుల్లలు (బ్యాంబూ స్టిక్స్), పంపర పనస ముళ్లతో ఈ టాటూలను వేయడం వాంగ్ ప్రత్యేకత. చుక్కలతో రకరకాల ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తుంది. ప్రస్తుతం ఈ టాటూలు వేయడం వచ్చిన వారు ఎవరూ లేరు. వాంగ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఈ ఆర్ట్‌ను రక్తసంబంధీకులకు మాత్రమే నేర్పిస్తోంది. వాంగ్‌కు పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన మేనకోడలికి మాంబా బాటక్లో శిక్షణ ఇస్తోంది. ‘‘ఈ టాటూలు వేసేవాళ్లంతా చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నాకు దిగులు లేదు. తరువాతి తరానికి శిక్షణ ఇస్తున్నాను. వాళ్లు టాటూ మాస్టర్స్ అవుతారు’’ అని వాంగ్ చెబుతోంది. -
చైకి గుర్తుగా టాటూ అలాగే ఉంచేసుకున్న సమంత.. ఫోటో వైరల్
సమంత-నాగచైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఏమాయ చేశావే సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చై-సామ్‌లు దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీరు కలిసుంటే బావుండు అని కోరుకోని అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ చై-సామ్‌ల జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక విడాకుల తర్వాత ఇద్దరూ సినిమాల పరంగా బిజీబిజీగా గడిపేస్తున్నారు. కస్టడీ సినిమాతో చై ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే సమంత శాకుంతలం సినిమాతో అభిమానులను పలకరించింది. రీసెంట్గా సిటాడెల్ ప్రీమియర్ షో కోసం లండన్ వెళ్లిన సమంత సరికొత్త లుక్‌తో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అంతకు మించి సమంత ఒంటిపై నాగచైతన్యకు సంబంధించిన టాటూలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత చై పేరును టాటూ వేయించుకున్న సమంత ఇప్పటికీ ఆ టాటూను చెరపివేయలేదు. 'కొన్ని ఙ్ఞాపకాలను మర్చిపోలేం, టాటూలు కూడా అంతే'.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత మెడపై YMC అని రాసి ఉంటుంది. చైతో తొలిసారి నటించిన ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా సామ్ ఆ టాటూ వేయించుకుంది. ఇక మరో టాటూ ఆమె మణికట్టుపై ఉంటుంది. ఈ మూడు టాటూలు చైతూకి సంబంధించినవే కావడం విశేషం. -
CSK VS RCB: డుప్లెసిస్ పక్కటెముకలపై ఉన్న ఆ టాటూ అర్ధం తెలుసా..?
చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన రసవత్తర పోరులో లోకల్ జట్టు ఆర్సీబీ 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చెన్నై నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫాఫ్ డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ, స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైనప్పటికీ.. డుప్లెసిస్-మ్యాక్సీ విధ్వంకర ఇన్నింగ్స్‌లపై మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డాషింగ్ బ్యాటర్ల విన్యాసాలను ఆ జట్టు ఈ జట్టు అన్న తేడా లేకుండా అన్ని జట్ల అభిమానులు కొనియాడుతున్నారు. గెలిచింది సీఎస్కేనే అయినా డుప్లెసిస్-మ్యాక్సీల నామస్మరణతో సోషల్‌మీడియా మార్మోగిపోతుంది. Played such an iconic knock at 38 even when he wasn't fully fit. Appreciation tweet for Captain FAF. ❤️ You just can't scroll down without liking this! #RCBvsCSK pic.twitter.com/JztllvBuYA — Sexy Cricket Shots (@sexycricketshot) April 17, 2023 ఇదే మ్యాచ్ సందర్భంగా కనిపించిన ఓ దృశ్యం కూడా నెటిజన్లను విపరీతంగా ఆకర్శించింది. ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో 13వ ఓవర్ పూర్తైన తర్వాత డుప్లెసిస్ కొద్దిగా ఇబ్బంది పడినట్లు కనిపించాడు. అప్పటికే అతని పక్కటెముకలు చుట్టూ బ్యాండ్ కట్టి ఉంది. సిబ్బంది సాయంతో అతను ఆ బ్యాండ్‌ను సరిచేసుకున్నాడు. ఈ క్రమంలో అభిమానులు డుప్లెసిస్ రిబ్స్‌పై ఉన్న ఓ టాటూను నొటిస్ చేశారు. దీంతో ఆ టాటూ ఏంటీ, అది ఏ భాష, దాని అర్ధం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. డుప్లెసిస్ శరీరంపై చాలా టాటూస్ ఉన్నా ఈ టాటూ మాత్రం నెటిజన్ల ప్రత్యేకంగా ఆకర్శించింది. సోషల్‌మీడియా జరిపిన చర్చ అనంతరం అభిమానులకు సదరు టాటూ అర్ధం తెలిసింది. ఆ టాటూ అరబ్బీ భాషలోని ఓ పదమని, దాని అర్ధం Fazl (దేవుడి దయ) అని, దేవుడి దయ వల్ల తన జీవితంలో ఊహించని సానుకూల మార్పులు జరగడం వల్ల డుప్లెసిస్ ఈ టాటూను తన రిబ్స్ పైభాగంలో వేయించుకున్నాడని ఫ్యాన్స్ తెలుసుకున్నారు. డుప్లెసిస్ అరబ్బీలో టాటూ వేయించుకోవడంపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. మరోవైపు డుప్లెసిస్ తన పక్కటెముకలపై కట్టిన బ్యాండ్ గురించి కూడా మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు. రిబ్స్‌లో సమస్య ఉన్న కారణంగా తాను బ్యాండ్ కట్టుకునే బరిలోకి దిగాల్సి వచ్చిందని తెలిపాడు. -
ఐపీఎల్‌కు ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ.. దీని అర్థం తెలుసా?
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి టాటూలు అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన శరీరంపై ఇప్పిటికే ఆకర్షణీయమైన పచ్చబొట్లు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభోత్సావానికి ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ కన్పించడం అభిమానులను సర్ప్రైజ్ చేసింది. అలాగే ఈ టాటూ అర్థం ఏమై ఉంటుందా అనే ఎగ్జైట్మెంట్ కూడా నెలకొంది. అయితే ఈ టాటూ అసలు అర్థం ఏంటి? దాని వెనకాల ఎంత శ్రమ ఉంది? ఎందుకంత ప్రత్యేకత? అనే విషయాలు.. ఈ టాటు కోహ్లీకి వేసిన ప్రముఖ కళాకారుడు, ఏలియన్స్ టాటూ వ్యవస్థాపకుడు సన్నీ భానుశాలి స్వయంగా వివరించారు. 'మా టాటూలు నచ్చి కోహ్లీ స్వయంగా మా స్టూడియోకు వచ్చారు. మా పనితీరును తెలియజేసే ఫొటోలతో మా దగ్గరకు వచ్చారు. నా టాటూలకు పెద్ద అభిమానినని చెప్పారు. క్రికెట్లో సూపర్‌స్టార్ అయిన కోహ్లీ లాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇంత సింపుల్‌గా ఉంటారని అనుకోలేదు. అసలు కోహ్లీలో గర్వం లేదు. చాలా ఒదిగి ఉంటారు. సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తారు. ఇంత మంచి ఆటిట్యూడ్ ఉన్న అతన్ని కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఇక నా పనితీరు నచ్చి కొత్త టాటూ వేయాలని కోహ్లీ నన్ను అడిగారు. తన పాత టాటూను కవర్ చేస్తూ కొత్తది ఉండాని చెప్పారు.' అని సన్నీ పేర్కొన్నారు. ఇక కోహ్లీ కొత్త టాటూ అర్థం కూడా చెప్పాడు సన్నీ. అన్ని విషయాల పరస్పర అనుసంధానాన్ని, సృష్టి మూలాన్ని సూచించేలా, ఉన్నతమైన వాటిని, ఏకత్వాన్ని, జీవిత నిర్మాణాన్ని, అన్నింటికీ మూలాన్ని తెలియజేస్తూ కోహ్లీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఈ టాటూను చాలా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ టాటూను చూసి కోహ్లీ మురిసిపోయాడని, అతనికి ఇది చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. 'ఈ టాటూ కోహ్లీకి ఎంత విలువైందో నాకు బాగా తెలుసు. అందుకే చాలా శ్రమించి నా మనసుపెట్టి అంకితభావంతో దీన్ని రూపొందించా. టాటూలో ప్రతీది అద్భుతంగా పర్ఫెక్ట్గా వచ్చింది. రెండు రోజులు, రెండు చోట్లకు వెళ్లి కోహ్లీకి ఈ టాటూ వేశా' అని సన్నీ పేర్కొన్నాడు. తొలిరోజు ముంబైలోనే కోహ్లీ అపాయింట్మెంట్ ఇచ్చాడని, ఆ తర్వాత మరో రోజు బెంగళూరుకు వెళ్లి టాటూ పూర్తి చేసినట్లు సన్నీ చెప్పాడు. కోహ్లీకి టాటూ వేసే సమయంలో స్టూడియోను మూసి వేసి భద్రతా కారణాల దృష్ట్యా భారీగా బౌన్సర్లను కూడా మోహరించినట్లు చెప్పాడు. టాటూ కోసం ఎన్ని గంటలు పట్టినా.. కోహ్లీ చాలా సహనంతో ఉన్నాడని, అసలు ఒక్క క్షణం కూడా అలసిపోయినట్లు కన్పించలేదని సన్నీ తెలిపాడు. టాటూ పూర్తైన తర్వాత చూసుకుని కోహ్లీ మైమరచిపోయాడని, ఆనంద పరవశంలో మునిగిపోయాడని వివరించాడు. ఈ టాటూ జీవితకాలం తనతో పాటు ఉంటుందని కోహ్లీకి తెలుసన్నాడు. చదవండి: ఐపీఎల్లో జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు! ఏకైక భారత క్రికెటర్‌గా -
పెళ్లికి ముందు భర్త చేసిన పనికి షాక్ అయిన హన్సిక
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత తెలుగులో దేశముదురు, మస్కా, కందిరీగ ఇలా పలు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోహెల్ కతూరియా అనే ఓ బిజినెస్ మెన్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.తమ పెళ్లి జర్నీని డాక్యుమెంటరీగా తీసి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే సోహల్ హన్సిక పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. టాటూ వేసే సమయంలో ఆయన హన్సికకు వీడియో కాల్ చేయగా సోహెల్ చేసిన పనికి హన్సిక షాక్ అయ్యింది. ఓ ఇంజెక్షన్ తీసుకోవడానికే చాలా బాధపడతాను. అలాంటిది సోహెల్ నా పేరుమీద టాటూ వేయించుకున్నాడు అని చెబుతూ హన్సిక ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
చర్చనీయాంశంగా మారిన విశాల్ టాటూ.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన సమయంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ ఎన్నికల్లో విశాల్ పోటీ చేయలేకపోయారు. కానీ అప్పటినుంచి ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమనే చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దిగ్గజ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నారు. గతంలో విశాల్ పలుమార్లు తాను ఎంజీఆర్‌కు అభిమాని అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ సందర్బం లేకుండా విశాల్ తన ఛాతిపై ఎంజీఆర్ టాటూను వేయించుకోవడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాల్ అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైనా సినిమా కోసం ఇలా టాటూ వేయించుకున్నారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. #NikilNews23 #NikilVideos *புரட்சி தலைவர் எம். ஜி.ஆர் படத்தை தன் நெஞ்சில் பச்சைகுத்தி இருக்கும் நடிகர் விஷால் அவர்கள்* #Vishal @VishalKOfficial @HariKr_official @VffVishal #MGR pic.twitter.com/AmmqIsook5 — Nikil Murukan (@onlynikil) January 24, 2023 -
సమంతను గుర్తుచేసే ఆ టాటూని నాగ చైతన్య తొలగిస్తాడా?
సమంత-నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా వీరికి పేరుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తామిద్దరం భార్యభర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన చేసి పది నెలలు కావొస్తున్నా ఇంకా వీరి బ్రేకప్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. ప్రస్తుతం చై-సామ్ తమ సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా చై తన చేతిపై ఉన్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా టాటూని ఫ్యాన్స్ ఎవరూ కాపీ కొట్టకండి. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు తేదీని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంటుంది' అంటూ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ టాటూని తొలగించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. ఎప్పడూ దాని గురించి ఆలోచించలేదు. టాటూ మార్చడానికి ఏమీ లేదు. పర్లేదు అంటూ కూల్‌గా సమాధానం ఇచ్చాడు. -
టీమిండియా క్రికెటర్ ఛాతిపై రజనీకాంత్ టాటూ..
Rajinikanth Birthday: సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినం(డిసెంబర్ 12) సందర్భంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. తలైవా టాటూను తన ఛాతీ వేసుకుని ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నా ఛాతీపై సూపర్ స్టార్‌ను కలిగి ఉన్నాను. మీరు 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తే (పెద్దన్న)గా అలరించారు.. సూపర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ తమిళ్లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) భజ్జీ తమిళ్లో ట్వీట్ చేయడంతో ఆ భాషాభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు మురిసిముక్కలైపోతున్నారు. భజ్జీ షేర్ చేసిన ఫోటోను లైకులు, షేర్లతో మోతెక్కిస్తున్నారు. కాగా, హర్భజన్ ఐపీఎల్లో కొన్ని సీజన్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతనిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! -
బాబాయ్ చేతిపై టాటూ.. తల్లి పేరే అని అనుమానంతో!
జైపూర్: తల్లి పేరును అంకుల్ చేతిపై చేసిన 20 ఏళ్ల కుర్రాడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. శశి అగర్వాల్ అనే వ్యక్తి రాజ్ అగర్వాల్ తండ్రితో అండమాన్‌లోని పోర్ట్ బ్లయిర్‌లో వ్యాపారం చేస్తుంటాడు. ఈ సాన్నిహిత్యంతో శశి తరుచూ జైపూర్‌లోని రాజ్ ఇంటికి వస్తుంటాడు. ఎప్పటిలాగే కొన్ని రోజుల క్రితం భంక్రోటా ప్రాంతంలో ఉంటున్న రాజ్ అగర్వాల్ వద్దకు వచ్చాడు వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం సాయత్రం బాబాయ్‌తో కలిసి రాజ్, అతని స్నేహితులు మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ పూర్తిగా మద్యం మత్తులోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో బాబాయ్ చేతిపైన రాజ్‌కు ఓ టాటూ కనిపిండింది. అది కొన్ని ఇంగ్లీష్ అక్షరాలతో ఉండి తన సవతి తల్లి పేరులాగా ఉండంటంతో రాజ్ అశ్చర్యపోయాడు. వెంటనే ఏంటి విషయం అని బాబాయ్‌ను నిలదీశారు. అనంతరం టాటూ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న శశి, రాజ్ అసభ్యంగా ట్లాడుకున్నారు.దీంతో తన తల్లికి, బాబాయ్‌కి అక్రమ సంబంధం ఉందేమో అని రాజ్‌కు అనుమానం కలగడంతో పక్కనే ఉన్న ఇనుప రాడ్ తీసుకొని బాబాయ్ తల పగలగొట్టాడు. అక్కడితో ఆగకుండా ఒక తీగను బాబాయ్ మెడ చుట్టూ బిగించి చంపేశాడు. ఆ రాత్రి తన స్నేహితుడు ప్రకాష్‌తో కలిసి ఒక కారు అద్దెకు తీసుకున్నాడు. శశి శవాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, చుట్టూ ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా కారులో ఆ శవాన్ని పెట్టుకొని సాయంత్రం వరకూ తిరిగారు. ఆ తర్వాత ఊరు చివరకు వెళ్లి అర్థరాత్రి గొయ్యి తవ్వి దానిలో శవాన్ని పూడ్చిపెట్టారు. వీళ్లు చేస్తున్న పనిని చూసిన కొందరు గొర్రెలకాపరులు చూడటంతో వెంటనే గ్రామస్తులను వెంటపెట్టుకొని వచ్చారు. రాజ్, తన స్నేహితుడు ప్రకాష్ అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనుమానం తీరకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ యువకులు చేసిన ఘాతుకం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. -
ప్రేమ చిహ్నంతో పచ్చబొట్టు.. నాన్నకు తెలుస్తుందని!
సాక్షి, పాణ్యం: చేతిపై ప్రేమ చిహ్నంతో పచ్చబొట్టు వేయించుకోవడాన్ని చూసి తల్లి మందలించడంతో అక్కాచెల్లెలు పురుగు మందుతాగారు. చికిత్స పొందుతూ అక్క మృతి చెందగా..చెల్లెలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం గోరుకల్లు గ్రామంలో వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చెవిటి అరుణ, నాగకృష్ణుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివరాత్రి ఉత్సవాలకు గ్రామ సమీపంలోని శ్రీదుర్గాభోగేశ్వరస్వామి ఆలయానికి అక్కచెల్లెలిద్దరూ బంధువులతో కలిసి వెళ్లారు. అక్కడ చేతిపై ‘అమ్మ నాన్న’అని రాయించుకొని, ప్రేమ చిహ్నంతో పచ్చబొట్టు వేయించుకున్నారు. గమనించిన తల్లి ఇద్దరు కుమార్తెలను మందలించింది. నాన్నకు చెబుతానని హెచ్చరించింది. దీంతో భయాందోళనకు గురైన అక్కాచెల్లెలు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బుధవారం కోలుకోలేక పెద్ద కుమార్తె మృతి చెందింది. చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతురాలి పెదనాన్న లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం పోలీసులు తెలిపారు. చదవండి: విషాదం: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన భర్త -
ఫ్యాన్ అత్యుత్సాహం: కేటీఆర్ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్ : రాజకీయాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..కేసీఆర్ వారసుడిగా అభిమానుల్లో తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నారు కేటీఆర్. సమయం చిక్కినప్పుడల్లా ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ప్రజా సమస్యలపై స్పందిస్తుంటారు. అందుకే యంగ్ లీడర్ కేటీఆర్‌కు ప్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా ఓ వ్యక్తి కేటీఆర్ మీద తనకున్న అభిమానాన్ని భిన్నంగా తెలియజేశాడు. కేటీఆర్‌కు వీరాభిమాని అంటూ ఆయన బొమ్మను ఏకంగా శరీరంపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు. ‘యంగ్ డైనమిక్ లీడర్.. జై రామ్ అన్న’ అంటూ రవి కిరణ్ అనే వ్యక్తి వీపుపై పచ్చబొట్టు వేసుకున్నాడు. అనంతరం దీన్ని ఫోటో తీసీ ట్విట్టర్లో పోస్ట్ చేసి కేటీఆర్‌ను ట్యాగ్ చేశాడు. (తల్లిని కన్న తనయుడికి శుభాకాంక్షలు: కేటీఆర్) ఇంకేముంది ఇది కాస్తా కేటీఆర్ వరకు చేరడంతో ఆయన దీనిపై ఆయన స్పందించారు. పచ్చబొట్టుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఇలాంటివి అస్సలు ప్రొత్సహించనంటూ స్పష్టం చేశారు. ‘ఇది నిజమా.. క్షమించు బ్రదర్ నేను ఇలాంటి వాటికి మద్దతివ్వను. అలాగే ప్రోత్సహించను. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మంచిది కాదు.’ అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన నెటిజన్లు మాత్రం భిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ అభిమానులు ‘జై కేటీఆర్’ అంటూ మద్దతు తెలుపుతూంటే.. ‘ప్రేమను వ్యక్త పరిచే మార్గాలు అనేకం ఉన్నాయి. అంత ప్రేమ ఉంటే మొక్కలు నాటండి. అందరికి మేలు చేస్తుంది’ అంటూ హితవు పలుకుతున్నారు. Is that for real!!!! 😐 Sorry brother but I don’t support or endorse these. It’s absolutely unhealthy and disturbing 🙏 https://t.co/JlS7pqE7NO — KTR (@KTRTRS) February 24, 2020 -
‘పచ్చబొట్టు’ పట్టేసింది
గజ్వేల్: మతిస్థిమితం కోల్పోయిన కారణంగా ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లిన వ్యక్తిని.. చేయిపై వేయించుకున్న పచ్చబొట్టు తిరిగి స్వగ్రామానికి చేరుకునేలా చేసింది. కనిపించకుండా పోయాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో ఈ ఘటన చోటు చేసుకుంది. జాలిగామకు చెందిన గంగాల నర్సింహులుకు భార్య యాదమ్మ, కూతురు రేణుకలు ఉన్నారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం అతను మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో ఎప్పుడు, ఎక్కడికి వెళ్లేవాడో తెలిసేది కాదు. కుటుంబ సభ్యులు తరచూ అతని కోసం వెతుకులాడేవారు. ఇదే క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం అతను రైలెక్కి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లాడు. అక్కడే భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. ఈ తరుణంలో గత నెల 15న సంక్రాంతి సందర్భంగా భోపాల్‌కు చెందిన అన్షుమన్ త్యాగి, అతని స్నేహితుడు హిమాన్జైన్లతోపాటు మరికొందరు యువకులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా భోపాల్ రైల్వేస్టేషన్ లో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సింహులు వారికి తారస పడ్డాడు. అప్పటికే అతను కాలికి గాయమై నీరసంగా ఉన్నాడు. చేతిపై లక్ష్మి పేరుతో ఉన్న పచ్చబొట్టును వారు గుర్తించారు. అక్షరాలు తెలుగులో ఉండటం గమనించి అన్షుమన్ త్యాగి, హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో నివాసముండే తన బావ రాకేష్త్యాగికి ఫోన్లో విషయాన్ని వివరించాడు. పచ్చబొట్టు ఫోటో తీసి వాట్సాప్ చేశాడు. అనంతరం నర్సింహులు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్న నర్సింహులు తమది గజ్వేల్ ప్రాంతమని, భార్య పేరు యాదమ్మ అని చెప్పుకొచ్చాడు. ఈ వివరాల గురించి త్యాగి.. గుగూల్లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నంబర్ తీసుకొని సమాచారమిచ్చాడు. దీంతో గజ్వేల్ ఏఎస్ఐ జగదీశ్వర్ జాలిగామ గ్రామానికి వెళ్లి నర్సింహులు ఫొటో తీసుకెళ్లి విచారణ జరపడంతో తమ గ్రామస్తుడేనని తెలిపారు. శుక్రవారం నర్సింహులును భోపాల్ నుంచి అన్షుమన్ త్యాగి సాయంతో ఇక్కడకు రప్పించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పచ్చబొట్టు ఆధారంగా తిరిగి నర్సింహులు తమవద్దకు చేరుకోవడంతో కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్షుమన్ త్యాగి, హిమాన్ జైన్, రాకేశ్త్యాగిలను ఏసీపీ అభినందించారు. -
పచ్చబొట్టేసుకున్నా పిల్లదానా...
కొంటె సైగతో మొత్తం దేశ యువతను కళ్లు తిప్పుకోకుండా చేశారు ప్రియా ప్రకాశ్ వారియర్. ‘వింక్ సెన్సేషన్’ అంటూ గూగుల్‌లో, యూత్ గుండెల్లో ట్రెండ్ అయిపోయారీ బ్యూటీ. కొందరబ్బాయిలైతే ఈ బ్యూటీ బొమ్మను గుండెల్లో పచ్చబొట్టేసుకున్నారు. ఇప్పుడీ బ్యూటీ కూడా పచ్చబొట్టేసుకున్నారు. గుండెలపై కాదు చేతి మీద. చేతి మీద గులాబీ పువ్వు బొమ్మ ట్యాటూ వేయించుకున్నారు. కొమ్మ మీదేమో ‘ఇన్ఫినిటీ’ (అనంతం) అని ఇంగ్లీష్‌లో రాసుంది. అంటే.. హీరోయిన్గా తన పాపులారిటీ అనంత తీరాలకు వెళ్లాలనా? ఏమో... తన ఉద్దేశమేమైనా కావచ్చు. మరి ఈ ట్యాటూ అర్థం తనెప్పుడు వివరిస్తారో చూద్దాం. అప్పటి వరకూ పచ్చబొట్టేసుకున్నా పిల్లదానా దానర్థమేంటి? అని పాడుకోవడమే యూతంతా. అన్నట్లు.. మలయాళంలో ప్రియా నటించిన ‘ఒరు అధార్ లవ్’ తెలుగులో విడుదల కానుంది. -
అఖిల్ చేతిపై టాటూ.. సినిమా కోసమేనా..!
తొలి సినిమాతో నిరాశపరిచన అఖిల్, ప్రస్తుతం తన రెండో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తొలి ప్రయత్నంలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దన్న ఉద్దేశంతో చాలా కేర్ తీసుకొని రెండో సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయం బయటకు రానివ్వలేదు. అంతేకాదు హీరోయిన్ ఎవరన్న విషయం కూడా వెల్లడించలేదు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్ చేతి మీద ఇంట్రస్టింగ్ టాటూ కనిపించింది. బాణం దాని ముందు 8 అనే అంకె తో ఉన్న ఈ టాటూ తన కొత్త సినిమా కోసమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అఖిల్ రెండో సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కావటం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విక్రమ్‌కు గుర్తింపు తీసుకువచ్చిన 13, 24 సినిమాలు నెంబర్ చుట్టూనే తిరుగుతాయి. అదే బాటలో అఖిల్ రెండో సినిమా కూడా 8 అనే అంకె చుట్టూ నడుస్తుందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాపై మరింత సమాచారం త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఈ హీరోయిన్ 'లిమిటెడ్ ఎడిషన'ట..!
హీరోయిన్ చార్మీ ఇప్పుడు వెండితెర మీద కనిపించటం తగ్గించేసినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేసేస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఏర్పాటు చేసిన పూరి కనెక్ట్ బాధ్యతలు చూస్తున్న ఈ బ్యూటి, పూరి సినిమా షూటింగ్ లలోనూ హడావిడి చేస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్, బాలకృష్ణల కాంబినేషన్ లోరూపొందుతున్ పైసా వసూల్ షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. ప్రస్తుతం పూరీ టీంతో కలిసి పోర్చుగల్ లో ఉన్న చార్మీ తన చేతిమీద టాటూ వేయించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. చేతి మీద లిమిటెడ్ ఎడిషన్ అనే డిజైన్‌తో పాటు.. కాలు మీద స్పానిష్ భాషలో కొటేషన్‌ను టాటూ వేయించుకుంది. టాటూ ఆర్టిస్ట్ తో పాటు చార్మీ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. Finally got inked 😁before I cud finish my 1st #tattoo ,I was ready for the 2nd one 😁 #addicted #feelingliberated #loveit ,over came my fear pic.twitter.com/cO7ADaxzhh — CHARMME KAUR (@Charmmeofficial) 19 June 2017 -
గుజరాత్లో జోరుగా గర్భా సందడి
-
కట్నం ఇవ్వలేదని.. గ్యాంగ్ రేప్ చేసి..
జైపూర్: కట్నం ఇవ్వలేదని భార్యను కుటుంబసభ్యులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి, ఆమె ఒంటి నిండా టాటూలు వేయించిన ఘటన రాజస్థాన్ లోని అల్వార్ కు దగ్గరలోని రైనీ గ్రామంలో వెలుగుచూసింది. గత ఏడాది జనవరిలో వివాహం చేసుకున్న బాధితురాలు(30)ను ఆమె భర్త జూన్ నెల నుంచి కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి తండ్రి పెళ్లిలో రూ. 51,000 కట్నం ఇవ్వలేదనే కోపంతో ఆమెతో రోజూ క్రూరంగా ప్రవర్తించేవాడు. అంతేకాకుండా, తన ఇద్దరు సోదరులు, చుట్టాలతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. చెప్పలేని మాటలను ఆమె ఒంటి నిండా టాటూలు వేయించాడు. దీంతో గత నవంబర్ నెలలో వారి నుంచి తప్పించుకున్న మహిళ తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. ఈ విషయాన్ని గత ఆదివారం పోలీసులకు తెలిపిన బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె భర్త, అతని కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకోవడాని రైనీ గ్రామానికి వెళ్లిన పోలీసులకు వారి ఆచూకీ లేకపోవడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలి నుదిటిపై 'నా తండ్రి దొంగ' అనే టాటూ వేయించారని పోలీసులు తెలిపారు. ఘటనను తెలుసుకుని షాక్ కు గురైన కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంలో జాతీయ మహిళ కమిషన్ జోక్యం చేసుకుని కేసును విచారించాలని ఆదేశించారు. -
పచ్చబొట్టుతో తంటాలు
తర్వాత వారి ప్రేమకు బ్రేక్ పడింది. పచ్చబొట్టును తొలగించుకోవడానికి ఈ మధ్య విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయినా ఫలితం లేకపోయిందట. కారణం ఏమైనా ఆ మాయని మచ్చ నయనతారను ఇబ్బందులకు గురి చేస్తోందన్న విషయం శుక్రవారం తేటతెల్లమైంది. చెన్నైలో జరిగిన నూతన చిత్ర ప్రారంభోత్సవంలో నయనతార పాల్గొంది. ఆమె మోచేతుల వరకు చుడీదార్‌ను ధరించి పచ్చబొట్టు కనిపించకుండా శతవిధాలా యత్నించినా ఫలితం లేకపోరుుంది. ఫొటోగ్రాఫర్లు అరుుతే నయన్ పచ్చబొట్టు కనిపించేలా ఫొటోలు తీయడానికి ఆసక్తి చూపారు. దీనిని గుర్తించిన ఆమె పచ్చబొట్టును మరుగుపరచడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అందుకేనేమో పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజ అన్నారో మహాకవి.