![Sisters Commits Suicide Attempt Over Tattoo Issue In Kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/18/2_0.jpg.webp?itok=Oi8Of2co)
సాక్షి, పాణ్యం: చేతిపై ప్రేమ చిహ్నంతో పచ్చబొట్టు వేయించుకోవడాన్ని చూసి తల్లి మందలించడంతో అక్కాచెల్లెలు పురుగు మందుతాగారు. చికిత్స పొందుతూ అక్క మృతి చెందగా..చెల్లెలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం గోరుకల్లు గ్రామంలో వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చెవిటి అరుణ, నాగకృష్ణుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివరాత్రి ఉత్సవాలకు గ్రామ సమీపంలోని శ్రీదుర్గాభోగేశ్వరస్వామి ఆలయానికి అక్కచెల్లెలిద్దరూ బంధువులతో కలిసి వెళ్లారు. అక్కడ చేతిపై ‘అమ్మ నాన్న’అని రాయించుకొని, ప్రేమ చిహ్నంతో పచ్చబొట్టు వేయించుకున్నారు.
గమనించిన తల్లి ఇద్దరు కుమార్తెలను మందలించింది. నాన్నకు చెబుతానని హెచ్చరించింది. దీంతో భయాందోళనకు గురైన అక్కాచెల్లెలు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బుధవారం కోలుకోలేక పెద్ద కుమార్తె మృతి చెందింది. చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతురాలి పెదనాన్న లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం పోలీసులు తెలిపారు.
చదవండి:
విషాదం: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన భర్త
Comments
Please login to add a commentAdd a comment