
Rajinikanth Birthday: సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినం(డిసెంబర్ 12) సందర్భంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. తలైవా టాటూను తన ఛాతీ వేసుకుని ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నా ఛాతీపై సూపర్ స్టార్‌ను కలిగి ఉన్నాను. మీరు 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తే (పెద్దన్న)గా అలరించారు.. సూపర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ తమిళ్‌లో రాసుకొచ్చాడు.
భజ్జీ తమిళ్‌లో ట్వీట్ చేయడంతో ఆ భాషాభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు మురిసిముక్కలైపోతున్నారు. భజ్జీ షేర్ చేసిన ఫోటోను లైకులు, షేర్లతో మోతెక్కిస్తున్నారు. కాగా, హర్భజన్ ఐపీఎల్‌లో కొన్ని సీజన్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతనిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
చదవండి: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!