Rajinikanths birthday
-
Happy Birthday Rajinikanth: గమ్మత్తుగా లతా లవ్‌లో..
ఎన్న రాస్కెల్.. మైండ్ ఇంట్.. సూపర్‌స్టార్ క్రేజ్ ఒక్క తమిళనాడు.. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాలు.. సౌత్.. యావత్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలకు కూడా విస్తరించింది. ఏడు పదుల వయసులోనూ స్క్రీన్‌పై ఆయన స్టైలింగ్ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూనే ఉంటోంది. ప్రతీ పుట్టినరోజుకి వయస్సు తగ్గిపోతుందేమో అనిపించేది.. తలైవా విషయంలోనే ఏమో!. రజనీకాంత్ స్టైల్‌కు ఉన్న ప్రత్యేకత అదే!. రజనీ పుట్టినరోజుకు.. కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. కానీ, రజనీకాంత్‌ది ప్రేమ వివాహమని.. అది చాలా గమ్మత్తుగా జరిగిందనేది మీకు తెలుసా?.. సినిమాల్లో రజనీ.. హీరోయిన్లతో ప్రేమ-పెళ్లి.. ఎంత విజీగా అయిపొగొట్టేస్తారో!. కానీ, రియల్ లైఫ్‌లో ఇష్టపడ్డ అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. డెబ్భైవ దశకంలో బాలీవుడ్లో వచ్చిన గోల్ మాల్ చిత్రాన్ని.. తిల్లు మల్లు పేరుతో కోలీవుడ్‌లో రీమేక్ చేశారు దర్శక దిగ్గజం బాలచందర్. అందులో ఆయన ప్రియశిష్యుల్లో ఒకరైన రజనీ హీరో. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కి.. సూపర్ హిట్ అయ్యిందా చిత్రం. అయితే.. ఈ చిత్ర షూటింగ్ మధ్యలో ఓ కాలేజీ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ కోసం ఒకావిడ వచ్చారని.. రజనీతో ఆయన అసిస్టెంట్ చెప్పారు. అయితే షూటింగ్ హడావిడిలో ఉన్న రజనీ కాసేపటి దాకా ఆ విషయం పట్టించుకోలేదు. ఆపై ఆ విషయం గుర్తొచ్చి.. పక్కకి వెళ్లారు. ఆమె పేరు లతా రంగాచారి. ఆమెను చూడగానే రజనీ గుండెలో జుజుబి మొదలైంది. మాటల మధ్యలో ఆమెది బెంగళూర్ అని చెప్పటం.. రజనీ కూడా అక్కడ కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ మాటలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి ఆసక్తులు ఒక్కటేనని తేలింది. దీంతో అప్పటికే ఓ స్టార్ అయిన రజనీతో లత చనువుగా మాట్లాడేందుకు వీలైంది. ఆమెతో ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలోనే రజనీ మనసు.. మైండ్ రెండూ పని చేయకుండా పోయాయంట. ఆమెతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయిపోయి చివరకు ఆ క్షణంలో మరో ఆలోచన లేకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడంట. దీంతో సూపర్ షాక్ తగిలిన ఆమె చిన్నగా నవ్వి.. తన తల్లిదండ్రులతో మాట్లాడమని రజనీకి చెప్పి వెళ్లిపోయిందట. కానీ, తలైవా చాలా చిలిపి. ఆ పని వెంటనే చేయలేదు. ఆమెతో స్నేహం కొసాగిస్తూనే అదను కోసం ఎదురు చూడసాగాడు. ఈ మధ్యలో ఈ విషయాన్ని తన స్నేహితుడు, నటుడు వైజీ మహేంద్రన్‌కు చెప్పాడంట. ఆయన.. లత సోదరి సుధ భర్త కావటం విశేషం. దీంతో తన పని తేలిక అవుతుందని రజనీ భావించారు. అదే సమయంలో.. ఆమె పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో రజనీ కొందరు సీనియర్ నటులను కూడా రంగంలోకి దింపాడంట. చివరకు.. మహేంద్రన్ దౌత్యంతో వాళ్ల ప్రేమ ఫలించింది. రజనీకి ఊరటనిస్తూ లతా పేరెంట్స్ వారి వివాహానికి ఓకే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని రజనీకి చెప్పకుండా వాళ్లు కొంత కాలం టెన్షన్‌తో ఎదురు చూసేలా చేశారట. లతా కూడా కొన్నిరోజులు ఆయనతో మాట్లాడకుండా ఏడ్పించిందట. దీంతో రజనీ ఎవరితో మాట్లాడకుండా కొన్నిరోజులపాటు డిప్రెషన్లోకి వెళ్లారు. చివరికి.. లత, మహేంద్రన్‌లు రజనీ ఇంటికి అసలు విషయం చెప్పడంతో ఆయన ఆశ్చర్యంతో ఆనందానికి లోనయ్యారట. అలా.. చివరకు ఏడాది తిరగక ముందే ఫిబ్రవరి 26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇది సూపర్‌స్టార్ గమ్మత్తు లవ్ కమ్ మ్యారేజ్ కహానీ!. -
Venkatesh Iyer: శతక్కొట్టాక రజనీ స్టైల్లో ఇరగదీశాడు..
Rajinikanth Birthday: సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినాన్ని(డిసెంబర్ 12) పురస్కరించుకుని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఛాతీపై టాటూ వేసుకుని వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఐపీఎల్ 2021 స్టార్ వెంకటేశ్ అయ్యర్ తనదైన శైలిలో తలైవాకు బర్త్ డే విషెస్ చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో భాగంగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన(151) అయ్యర్.. ఆ ఫీట్‌ను సాధించగానే రజనీ స్టైల్లో సెల్యూట్ చేసి, గ్లాసెస్ పెట్టుకున్నట్లు ఇమిటేట్ చేశాడు. Our Sunday couldn't get any better! 😍 Can you decode @ivenkyiyer2512's celebration? 🤔#VijayHazareTrophy #MPvUTCA #KKR #AmiKKR #CricketTwitterpic.twitter.com/7wpLMKEJ44 — KolkataKnightRiders (@KKRiders) December 12, 2021 ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, బాషా సినిమాలో రజనీ కళ్లద్దాలను స్టైల్ గా తిప్పుతూ పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఇది రజనీకి ఐకానిక్ స్టైల్‌గా మారడమే కాకుండా.. సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ చేసింది. నేను తలైవా వీరాభిమానిననే.. వెంకటేశ్ అయ్యర్ రజనీకాంత్‌కు వీరాభిమాననంటూ గతంలో ఓ సందర్భంగా చెప్పాడు. తాను తలైవా భక్తుడినని.. ఆయన సినిమాలన్నీ తప్పక చూస్తానని.. రజనీ ఓ లెజెండ్ అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ చెప్పాడు. ఇదిలా ఉంటే, విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ 113 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్‌కు భారత వన్డే జట్టు(దక్షిణాఫ్రికా పర్యటన) నుంచి పిలుపు రావడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: టీమిండియా క్రికెటర్ ఛాతిపై రజనీకాంత్ టాటూ.. -
టీమిండియా క్రికెటర్ ఛాతిపై రజనీకాంత్ టాటూ..
Rajinikanth Birthday: సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినం(డిసెంబర్ 12) సందర్భంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. తలైవా టాటూను తన ఛాతీ వేసుకుని ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నా ఛాతీపై సూపర్ స్టార్‌ను కలిగి ఉన్నాను. మీరు 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తే (పెద్దన్న)గా అలరించారు.. సూపర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ తమిళ్లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) భజ్జీ తమిళ్లో ట్వీట్ చేయడంతో ఆ భాషాభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు మురిసిముక్కలైపోతున్నారు. భజ్జీ షేర్ చేసిన ఫోటోను లైకులు, షేర్లతో మోతెక్కిస్తున్నారు. కాగా, హర్భజన్ ఐపీఎల్లో కొన్ని సీజన్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతనిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! -
బాషా బర్త్‌డే స్పెషల్!
నడకలో వేగం, మానరిజంలో మాస్ అప్పీరియన్స్, డైలాగ్ డెలీవరీలో స్టైల్ ఇలా ఆయన ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంట్‌గానే అనిపిస్తుంది. కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్ దాకా ఆయన ప్రస్థానం..ఎంతో మందికి ఆదర్శం. నటనలోనే కాదు, మానవతా దృక్పథంలోనూ ఎప్పుడూ ముందుంటారు మన సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్. రజనీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి. -
బాషా బర్త్‌డే స్పెషల్!
-
లింగ ... రెండు వేల థియేటర్లల్లో విడుదల
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు లింగ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. లింగా చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ సరిఫ్టికేట్ ఇచ్చారని తెలిపారు. లింగ చిత్రం తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రజనీకాంత్ జన్మదినమైన డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలు నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో గతంలో రజనీ ముత్తు, నరసింహ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. లింగ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు.