
Rajinikanth Birthday: సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినాన్ని(డిసెంబర్ 12) పురస్కరించుకుని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఛాతీపై టాటూ వేసుకుని వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఐపీఎల్ 2021 స్టార్ వెంకటేశ్ అయ్యర్ తనదైన శైలిలో తలైవాకు బర్త్ డే విషెస్ చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో భాగంగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన(151) అయ్యర్.. ఆ ఫీట్‌ను సాధించగానే రజనీ స్టైల్‌లో సెల్యూట్ చేసి, గ్లాసెస్ పెట్టుకున్నట్లు ఇమిటేట్ చేశాడు.
Our Sunday couldn't get any better! 😍
— KolkataKnightRiders (@KKRiders) December 12, 2021
Can you decode @ivenkyiyer2512's celebration? 🤔#VijayHazareTrophy #MPvUTCA #KKR #AmiKKR #CricketTwitterpic.twitter.com/7wpLMKEJ44
ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, బాషా సినిమాలో రజనీ కళ్లద్దాలను స్టైల్ గా తిప్పుతూ పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఇది రజనీకి ఐకానిక్ స్టైల్‌గా మారడమే కాకుండా.. సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ చేసింది.
నేను తలైవా వీరాభిమానిననే..
వెంకటేశ్ అయ్యర్ రజనీకాంత్‌కు వీరాభిమాననంటూ గతంలో ఓ సందర్భంగా చెప్పాడు. తాను తలైవా భక్తుడినని.. ఆయన సినిమాలన్నీ తప్పక చూస్తానని.. రజనీ ఓ లెజెండ్ అని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ చెప్పాడు.
ఇదిలా ఉంటే, విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ 113 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్‌కు భారత వన్డే జట్టు(దక్షిణాఫ్రికా పర్యటన) నుంచి పిలుపు రావడం ఖాయమని తెలుస్తోంది.
చదవండి: టీమిండియా క్రికెటర్ ఛాతిపై రజనీకాంత్ టాటూ..
Comments
Please login to add a commentAdd a comment