Ruturaj Gaikwad And Venkatesh Iyer Smash Centuries Vijay Hazare Trophy.. దేశవాలీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్‌లు దుమ్మురేపారు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరపున కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ మెరుపు సెంచరీతో ఆకట్టుకోగా.. మహారాష్ట్ర తరపున కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రుతురాజ్ సీఎస్‌కే తరపున ఆడగా.. వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రుతురాజ్‌ను(రూ.6 కోట్లు) సీఎస్‌కే రిటైన్ చేసుకోగా.. వెంకటేశ్ అయ్యర్‌ను(రూ.8 కోట్లు) కేకేఆర్ తమ దగ్గరే అట్టిపెట్టుకుంది.
చదవండి: Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్.. త్వరలోనే టెస్టులకు కూడా!
మ్యాచ్‌ల విషయానికి వస్తే.. మహారాష్ట్ర, చత్తీస్‌ఘర్ పోరులో.. తొలుత బ్యాటింగ్ చేసిన చత్తీస్‌ఘర్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్రను రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో నడించాఇ మ్యాచ్‌లో రుతురాజ్ 143 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతని దాటికి మహారాష్ట్ర 47 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. కాగా రుతురాజ్‌కు ఈ సీజన్‌లో రెండో సెంచరీ కావడం విశేషం.
మరోవైపు కేరళతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో వెంకటేశ్ అయ్యర్(84 బంతుల్లో 112, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభమ్ శర్మ(67 బంతుల్లో 82, 9 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేరళ 49.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది.
చదవండి: Vijay Hazare Trophy: హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం.. ఆంధ్రకు మాత్రం
Comments
Please login to add a commentAdd a comment