Hansika Motwani's Husband Sohael Khaturiya Gets Her Name Tattooed on Arm - Sakshi
Sakshi News home page

Hansika Motwani : భర్త చేసిన పనికి ఎమోషనల్‌ అయిన హన్సిక.. వీడియో వైరల్‌

Published Fri, Feb 24 2023 3:13 PM | Last Updated on Fri, Feb 24 2023 4:14 PM

Hansika Motwani Husband Sohael Khaturiya Gets Her Name Tatoo - Sakshi

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత తెలుగులో దేశముదురు, మస్కా, కందిరీగ ఇలా పలు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోహెల్ కతూరియా అనే ఓ బిజినెస్ మెన్‌ని ప్రేమించి పెళ్లిచేసుకుంది.

కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.తమ పెళ్లి జర్నీని డాక్యుమెంటరీగా తీసి పలు ఇంట్రెస్టింగ్‌ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో పెళ్లికి ముందే సోహల్‌ హన్సిక పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. టాటూ వేసే సమయంలో ఆయన హన్సికకు వీడియో కాల్‌ చేయగా సోహెల్‌ చేసిన పనికి హన్సిక షాక్‌ అయ్యింది. ఓ ఇంజెక్షన్‌ తీసుకోవడానికే చాలా బాధపడతాను. అలాంటిది సోహెల్‌ నా పేరుమీద టాటూ వేయించుకున్నాడు అని చెబుతూ హన్సిక ఎమోషనల్‌ అయ్యింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement