భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి టాటూలు అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన శరీరంపై ఇప్పిటికే ఆకర్షణీయమైన పచ్చబొట్లు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభోత్సావానికి ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ కన్పించడం అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. అలాగే ఈ టాటూ అర్థం ఏమై ఉంటుందా అనే ఎగ్జైట్‌మెంట్ కూడా నెలకొంది.
అయితే ఈ టాటూ అసలు అర్థం ఏంటి? దాని వెనకాల ఎంత శ్రమ ఉంది? ఎందుకంత ప్రత్యేకత? అనే విషయాలు.. ఈ టాటు కోహ్లీకి వేసిన ప్రముఖ కళాకారుడు, ఏలియన్స్ టాటూ వ్యవస్థాపకుడు సన్నీ భానుశాలి స్వయంగా వివరించారు.
'మా టాటూలు నచ్చి కోహ్లీ స్వయంగా మా స్టూడియోకు వచ్చారు. మా పనితీరును తెలియజేసే ఫొటోలతో మా దగ్గరకు వచ్చారు. నా టాటూలకు పెద్ద అభిమానినని చెప్పారు. క్రికెట్‌లో సూపర్‌స్టార్ అయిన కోహ్లీ లాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇంత సింపుల్‌గా ఉంటారని అనుకోలేదు. అసలు కోహ్లీలో గర్వం లేదు. చాలా ఒదిగి ఉంటారు. సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తారు. ఇంత మంచి ఆటిట్యూడ్ ఉన్న అతన్ని కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఇక నా పనితీరు నచ్చి కొత్త టాటూ వేయాలని కోహ్లీ నన్ను అడిగారు. తన పాత టాటూను కవర్ చేస్తూ కొత్తది ఉండాని చెప్పారు.' అని సన్నీ పేర్కొన్నారు.
ఇక కోహ్లీ కొత్త టాటూ అర్థం కూడా చెప్పాడు సన్నీ. అన్ని విషయాల పరస్పర అనుసంధానాన్ని, సృష్టి మూలాన్ని సూచించేలా, ఉన్నతమైన వాటిని, ఏకత్వాన్ని, జీవిత నిర్మాణాన్ని, అన్నింటికీ మూలాన్ని తెలియజేస్తూ కోహ్లీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఈ టాటూను చాలా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ టాటూను చూసి కోహ్లీ మురిసిపోయాడని, అతనికి ఇది చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు.
'ఈ టాటూ కోహ్లీకి ఎంత విలువైందో నాకు బాగా తెలుసు. అందుకే చాలా శ్రమించి నా మనసుపెట్టి అంకితభావంతో దీన్ని రూపొందించా. టాటూలో ప్రతీది అద్భుతంగా పర్‌ఫెక్ట్‌గా వచ్చింది. రెండు రోజులు, రెండు చోట్లకు వెళ్లి కోహ్లీకి ఈ టాటూ వేశా' అని సన్నీ పేర్కొన్నాడు.
తొలిరోజు ముంబైలోనే కోహ్లీ అపాయింట్‌మెంట్ ఇచ్చాడని, ఆ తర్వాత మరో రోజు బెంగళూరుకు వెళ్లి టాటూ పూర్తి చేసినట్లు సన్నీ చెప్పాడు. కోహ్లీకి టాటూ వేసే సమయంలో స్టూడియోను మూసి వేసి భద్రతా కారణాల దృష్ట్యా భారీగా బౌన్సర్లను కూడా మోహరించినట్లు చెప్పాడు.
టాటూ కోసం ఎన్ని గంటలు పట్టినా.. కోహ్లీ చాలా సహనంతో ఉన్నాడని, అసలు ఒక్క క్షణం కూడా అలసిపోయినట్లు కన్పించలేదని సన్నీ తెలిపాడు. టాటూ పూర్తైన తర్వాత చూసుకుని కోహ్లీ మైమరచిపోయాడని, ఆనంద పరవశంలో మునిగిపోయాడని వివరించాడు. ఈ టాటూ జీవితకాలం తనతో పాటు ఉంటుందని కోహ్లీకి తెలుసన్నాడు.
చదవండి: ఐపీఎల్‌లో జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు! ఏకైక భారత క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment