దిశా పటానీ టాటూ గోల.. ప్రభాస్‌ పేరుతో లింక్‌ ఎందుకు..? | Disha Patani New Tattoo Prabhas Name | Sakshi
Sakshi News home page

దిశా పటానీ టాటూ గోల.. ప్రభాస్‌ పేరుతో లింక్‌ ఎందుకు..?

Published Tue, Jul 2 2024 2:02 PM | Last Updated on Tue, Jul 2 2024 3:20 PM

Disha Patani New Tattoo Prabhas Name

ముంబయి బ్యూటీ దిశా పటానీ చాలా ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో టాలీవుడ్‌కు టచ్‌లోకి వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్, స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే , కల్కి సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు (టాటూ) సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

దిశా పటానీ పచ్చబొట్టులో "PD" అనే రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. దీని అర్థం ఏంటి అంటూ చాలామందిలో ప్రశ్నలు తలెత్తాయి. అయితే, లాజిక్స్‌ మాత్రమే చూసే కొందరు PD అంటే 'ప్రభాస్‌ డార్లింగ్‌' అని అర్థం చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. దీనంతటికి కారణం ఆమె కల్కి చిత్రంలో నటించడమే  అని చెప్పవచ్చు. మా 'ప్రభాస్‌ డార్లింగ్‌' పేరును టాటూగా ఎందుకు తీసుకున్నావ్‌ అంటూ అభిమానులు  కామెంట్లు చేస్తున్నారు.

అయితే, వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే ఈ పుకార్లు నిరాధారమైనవని చెప్పవచ్చు. ముందుగా, దిశా పటాని కల్కి 2898 AD కోసం ప్రచార కార్యక్రమాలలో కూడా చేరలేదు.  ప్రభాస్‌తో ఆమెకు ఎక్కువగా సీన్లు కూడా లేవు. వారిద్దరి మధ్య అంత బాండింగ్‌, స్నేహం ఉండే ఛాన్స్‌ లేదని చెప్పవచ్చు. "PD" అక్షరాలు ఆమె అసలు పేరు దిశా పటాని (DP) యొక్క రివర్స్‌ వెర్షన్ కావచ్చని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. అయితే, అసలు విషయం తెలియాలంటే దిశా పటానీ రివీల్‌ చేయాల్సిందే.

ఇలా ఎంతమందితో మా డార్లింగ్‌ను లింక్‌ చేస్తారంటూ ఆయన ఫ్యాన్స్‌ చెప్పుకొస్తున్నారు. ఆయనకు అర్జెంట్‌గా పెళ్లి చేస్తే కానీ ఇలాంటి వాటికి ఫుల్‌స్టాఫ్‌ పడదని తెలుపుతున్నారు. దిశా పటానీ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్‌తో ఆమె చాలాకాలం నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆయనతో బ్రేకప్‌ అయ్యాక విదేశీ మోడల్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్‌ వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement