
సమంత-నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా వీరికి పేరుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తామిద్దరం భార్యభర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన చేసి పది నెలలు కావొస్తున్నా ఇంకా వీరి బ్రేకప్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. ప్రస్తుతం చై-సామ్ తమ సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్నారు.
లాల్ సింగ్ చడ్డా సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా చై తన చేతిపై ఉన్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నా టాటూని ఫ్యాన్స్ ఎవరూ కాపీ కొట్టకండి. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు తేదీని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంటుంది' అంటూ పేర్కొన్నాడు.
అయితే ఇప్పుడు ఆ టాటూని తొలగించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. ఎప్పడూ దాని గురించి ఆలోచించలేదు. టాటూ మార్చడానికి ఏమీ లేదు. పర్లేదు అంటూ కూల్‌గా సమాధానం ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment