ప్రియా ప్రకాశ్ వారియర్
కొంటె సైగతో మొత్తం దేశ యువతను కళ్లు తిప్పుకోకుండా చేశారు ప్రియా ప్రకాశ్ వారియర్. ‘వింక్ సెన్సేషన్’ అంటూ గూగుల్లో, యూత్ గుండెల్లో ట్రెండ్ అయిపోయారీ బ్యూటీ. కొందరబ్బాయిలైతే ఈ బ్యూటీ బొమ్మను గుండెల్లో పచ్చబొట్టేసుకున్నారు. ఇప్పుడీ బ్యూటీ కూడా పచ్చబొట్టేసుకున్నారు. గుండెలపై కాదు చేతి మీద. చేతి మీద గులాబీ పువ్వు బొమ్మ ట్యాటూ వేయించుకున్నారు. కొమ్మ మీదేమో ‘ఇన్ఫినిటీ’ (అనంతం) అని ఇంగ్లీష్‌లో రాసుంది. అంటే.. హీరోయిన్‌గా తన పాపులారిటీ అనంత తీరాలకు వెళ్లాలనా? ఏమో... తన ఉద్దేశమేమైనా కావచ్చు. మరి ఈ ట్యాటూ అర్థం తనెప్పుడు వివరిస్తారో చూద్దాం. అప్పటి వరకూ పచ్చబొట్టేసుకున్నా పిల్లదానా దానర్థమేంటి? అని పాడుకోవడమే యూతంతా. అన్నట్లు.. మలయాళంలో ప్రియా నటించిన ‘ఒరు అధార్ లవ్’ తెలుగులో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment