photo credit: IPL Twitter
చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన రసవత్తర పోరులో లోకల్ జట్టు ఆర్సీబీ 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చెన్నై నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫాఫ్ డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ, స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైనప్పటికీ.. డుప్లెసిస్-మ్యాక్సీ విధ్వంకర ఇన్నింగ్స్‌లపై మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డాషింగ్ బ్యాటర్ల విన్యాసాలను ఆ జట్టు ఈ జట్టు అన్న తేడా లేకుండా అన్ని జట్ల అభిమానులు కొనియాడుతున్నారు. గెలిచింది సీఎస్‌కేనే అయినా డుప్లెసిస్-మ్యాక్సీల నామస్మరణతో సోషల్‌మీడియా మార్మోగిపోతుంది.
Played such an iconic knock at 38 even when he wasn't fully fit. Appreciation tweet for Captain FAF. ❤️
— Sexy Cricket Shots (@sexycricketshot) April 17, 2023
You just can't scroll down without liking this! #RCBvsCSK pic.twitter.com/JztllvBuYA
ఇదే మ్యాచ్ సందర్భంగా కనిపించిన ఓ దృశ్యం కూడా నెటిజన్లను విపరీతంగా ఆకర్శించింది. ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో 13వ ఓవర్ పూర్తైన తర్వాత డుప్లెసిస్ కొద్దిగా ఇబ్బంది పడినట్లు కనిపించాడు. అప్పటికే అతని పక్కటెముకలు చుట్టూ బ్యాండ్ కట్టి ఉంది. సిబ్బంది సాయంతో అతను ఆ బ్యాండ్‌ను సరిచేసుకున్నాడు. ఈ క్రమంలో అభిమానులు డుప్లెసిస్ రిబ్స్‌పై ఉన్న ఓ టాటూను నొటిస్ చేశారు. దీంతో ఆ టాటూ ఏంటీ, అది ఏ భాష, దాని అర్ధం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. డుప్లెసిస్ శరీరంపై చాలా టాటూస్ ఉన్నా ఈ టాటూ మాత్రం నెటిజన్ల ప్రత్యేకంగా ఆకర్శించింది.
సోషల్‌మీడియా జరిపిన చర్చ అనంతరం అభిమానులకు సదరు టాటూ అర్ధం తెలిసింది. ఆ టాటూ అరబ్బీ భాషలోని ఓ పదమని, దాని అర్ధం Fazl (దేవుడి దయ) అని, దేవుడి దయ వల్ల తన జీవితంలో ఊహించని సానుకూల మార్పులు జరగడం వల్ల డుప్లెసిస్ ఈ టాటూను తన రిబ్స్ పైభాగంలో వేయించుకున్నాడని ఫ్యాన్స్ తెలుసుకున్నారు. డుప్లెసిస్ అరబ్బీలో టాటూ వేయించుకోవడంపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. మరోవైపు డుప్లెసిస్ తన పక్కటెముకలపై కట్టిన బ్యాండ్ గురించి కూడా మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు. రిబ్స్‌లో సమస్య ఉన్న కారణంగా తాను బ్యాండ్ కట్టుకునే బరిలోకి దిగాల్సి వచ్చిందని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment