IPL 2022 Mega Auction: Twitter Reactions On Faf Du Plessis Auction Price - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్‌.. మా గుండె పగిలింది!

Published Sat, Feb 12 2022 2:30 PM | Last Updated on Sat, Feb 12 2022 4:57 PM

IPL 2022 Auction: Twitter Reacts A Faf du Plesssis Bags 7 Crore Age of 37 - Sakshi

IPL 2022 Mega Auction: ఫాప్‌ డుప్లెసిస్‌... దక్షిణాఫ్రికా వెటరన్‌ క్రికెటర్‌.... వయసు 37... ఐపీఎల్‌- 2021 సీజన్‌లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.  చెన్నై సూపర్‌కింగ్స్‌ తరపున బరిలోకి దిగిన అతడు 16 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా 633 పరుగులు సాధించాడు. గత సీజన్‌లో డుప్లెసిస్‌ అత్యధిక స్కోరు 95 నాటౌట్‌.  ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల​ సాయంతో 86 పరగులు చేశాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో అతడు 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌ పూర్తి చేసుకోవడం విశేషం.

అయితే, రిటెన్షన్‌లో భాగంగా సీఎస్‌కే డుప్లెసిస్‌ను వదిలేసింది. విదేశీ ఆటగాళ్ల కోటాలో మొయిన్‌ అలీని అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలో డుప్లెసిస్‌ వేలంలోకి వచ్చాడు. 2 కోట్లు కనీస ధరగా పేర్కొనగా.. ఫిబ్రవరి 12 నాటి మెగా వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అతడిని దక్కించుకుంది. 7 కోట్ల రూపాయాలు వెచ్చించి డుప్లెసిస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అతడి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘‘37 ఏళ్ల వయసులో మంచి డీల్‌ ఇది. నువ్వు సూపర్‌’’అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆర్సీబీ ఫ్యాన్స్‌ సైతం డుప్లెసిస్‌ను జట్టులోకి ఆహ్వానిస్తూ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కోహ్లి, మాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ మంచి కాంబినేషన్‌ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సీఎస్‌కే అభిమానులు.. ‘‘నిన్ను ఇక యెల్లో జెర్సీలో చూడలేమా? మా గుండె పగిలింది’’ అని పగిలిన హార్ట్‌ ఎమోజీలు జత చేస్తున్నారు. కాగా మార్కీ ప్లేయర్ల(అగ్ర శ్రేణి ఆటగాళ్లు) లిస్టులో శ్రేయస్‌ అయ్యర్‌ అత్యధికంగా 12.25 కోట్లకు అమ్ముడు పోగా... అత్యల్పంగా అశ్విన్‌ 5 కోట్లు పలికాడు.

చదవండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్‌ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement