అఖిల్ చేతిపై టాటూ.. సినిమా కోసమేనా..! | intresting tatoo on akhil hand | Sakshi
Sakshi News home page

అఖిల్ చేతిపై టాటూ.. సినిమా కోసమేనా..!

Published Wed, Jul 5 2017 2:00 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

intresting tatoo on akhil hand

తొలి సినిమాతో నిరాశపరిచన అఖిల్, ప్రస్తుతం తన రెండో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తొలి ప్రయత్నంలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దన్న ఉద్దేశంతో చాలా కేర్ తీసుకొని రెండో సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయం బయటకు రానివ్వలేదు. అంతేకాదు హీరోయిన్ ఎవరన్న విషయం కూడా వెల్లడించలేదు.

అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్ చేతి మీద ఇంట్రస్టింగ్ టాటూ కనిపించింది. బాణం దాని ముందు 8 అనే అంకె తో ఉన్న ఈ టాటూ తన కొత్త సినిమా కోసమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అఖిల్ రెండో సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కావటం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విక్రమ్కు గుర్తింపు తీసుకువచ్చిన 13, 24 సినిమాలు నెంబర్ చుట్టూనే తిరుగుతాయి. అదే బాటలో అఖిల్ రెండో సినిమా కూడా 8 అనే అంకె చుట్టూ నడుస్తుందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాపై మరింత సమాచారం త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement