హలో.. అక్కినేని సర్‌ప్రైజ్‌ ఇదే..! | Akhil Hello Teaser on Nov 16th | Sakshi
Sakshi News home page

హలో.. అక్కినేని సర్‌ప్రైజ్‌ ఇదే..!

Published Tue, Nov 14 2017 2:07 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Akhil Hello Teaser on Nov 16th - Sakshi

త్వరలో ‘హలో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అక్కినేని వారసుడు అఖిల్‌, తన రెండో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలెట్టేశాడు. మనం ఫేం విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ ‘హలో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కళ్యాణీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. రొమాంటిక్‌​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను నవంబర్‌ 16న రిలీజ్‌ చేయనున్నారు. టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ను ప్రకటిస్తూ ఓ ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా డిసెంబర్‌ 22న రిలీజ్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement