అఖిల్ క్లారిటీ ఇచ్చేది ఎప్పుడంటే..! | Akhil Akkineni second movie First look on August 29th | Sakshi
Sakshi News home page

అఖిల్ క్లారిటీ ఇచ్చేది ఎప్పుడంటే..!

Published Sun, Aug 13 2017 11:37 AM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM

అఖిల్ క్లారిటీ ఇచ్చేది ఎప్పుడంటే..!

అఖిల్ క్లారిటీ ఇచ్చేది ఎప్పుడంటే..!

తొలి సినిమా అఖిల్తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సారి తన కొడుకుకి సూపర్ హిట్ ఇస్తానని చెప్పి మరి నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చాలా రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతున్నా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏవీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు చిత్రయూనిట్. ఇంత వరకు హీరోయిన్ ఎవరన్న విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. జున్ను, ఎక్కడ ఎక్కడ ఉండో తారక, రంగుల రాట్నం లాంటి టైటిల్స్  వినిపించినా.. యూనిట్ సభ్యుల మాత్రం దేన్నీ కన్ఫామ్ చేయలేదు.

దీంతో సినిమా మీద క్లారిటీ ఎప్పుడిస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక తీర్చేందుకు అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారు. కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న అఖిల్ రెండవ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందట. అదే రోజు సినిమా టైటిల్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు నాగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement