గోరింట రిమూవర్‌గా ఉప్పు | Henna as a salt remover | Sakshi
Sakshi News home page

గోరింట రిమూవర్‌గా ఉప్పు

Published Sun, Jul 26 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

గోరింట రిమూవర్‌గా ఉప్పు

గోరింట రిమూవర్‌గా ఉప్పు

బ్యూటిప్స్
చేతులకు పెట్టుకున్న గోరింటాకు రంగు మారడంతో ఇబ్బందిగా అనిపిస్తోందా? అయితే ఆ రంగును తొలగించి మళ్లీ కొత్తగా పెట్టుకొని చేతులకు అందాన్ని తెచ్చుకోండి. ఆ మారిన రంగు పోవాలంటే  గోరు వెచ్చటి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి చేతులను ఓ 20 నిమిషాల పాటు అందులో నానపెడితే చాలు. మీ సమస్య తీరుతుంది.

చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఎరుపు రంగులోకి రావాలంటే ఓ కొత్త చిట్కా ఉంది. ఆరిన గోరింటాకును తీసేశాక వెంటనే కడిగేసుకోకుండా చేతులకు విక్స్ బామ్ కానీ జండూ బామ్ కానీ రాసుకోవాలి. అది ఎరుపును ముదురు రంగులోకి మార్చేందుకు తోడ్పడుతుంది. అలా ఓ అయిదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో చేతులను కడుక్కుంటే సరి. మందారం లాంటి ఎరుపురంగు గోరింటాకు మీ చేతుల సొంతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement