చేతులు రఫ్‌గా ఉన్నాయా? ఇదిగో అద్భుతమైన చిట్కా | amzing tips for shining hands check here | Sakshi
Sakshi News home page

చేతులు రఫ్‌గా ఉన్నాయా? ఇదిగో అద్భుతమైన చిట్కా

Published Fri, May 10 2024 11:07 AM | Last Updated on Fri, May 10 2024 11:10 AM

amzing tips for  shining hands check here

 మృదువైన హస్తాల కోసం...

కొంతమందికి  చేతులు, మోచేతులు నల్లగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో కొన్ని రకాల ‍ డ్రెస్సులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ  అవుతుంది. ఈ నేపథ్యంలో  మీచేతులు అందంగా, మృదువుగా, మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.

  • పులిసిన పెరుగుపైన ఉండే మీగడ తీసుకుని చేతులకి మసాజ్‌ చే స్తూ ఉంటే చేతులు మృదువుగా ఉంటాయి. పెట్రోలియమ్‌ జెల్లీతో కూడా మసాజ్‌ చేసుకోవచ్చు.

  • ఆలివ్‌ ఆయిల్‌ ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా, గ్లిజరిన్‌ ఒక చెంచా, గోధుమరవ్వ రెండు చెంచాలు, ΄ాలు ఒక చెంచా కలిపి చేతులకి రాసుకుని గంట తర్వాత వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.

  • స్పూను దానిమ్మరసం, స్పూను టొమోటో గుజ్జు కలిపి దానిలో కొన్ని గ్లిజరిన్‌ చుక్కలు కలిపి చేతులకి పట్టించి ఒక గంట అయిన తర్వాత కడుక్కుంటే చేతులు చక్కగా మెరుస్తాయి.

  •  రెండు స్పూన్ల దానిమ్మరసంలో స్పూను పంచదార కలిపి చక్కెర కరిగిన తర్వాత చేతులకి పట్టించి నెమ్మదిగా మసాజ్‌ చేస్తే చేతులు నున్నగా ఉంటాయి.

  • చెంచా బాదం పొడిలో తగినన్ని  పాలు కలిపి పేస్ట్‌ చేసుకొని చేతులకి రాసుకొని ΄ావుగంట తర్వాత కడుక్కోవాలి.

  • నారింజ రసం రెండు చెంచాలు, తేనె రెండు చెంచాలు కలిపి చేతులకి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత వేడి నీటితో 
    కడుక్కోవాలి.

  • రెండు చెంచాలు గ్లిజరిన్, రెండున్నర చెంచాలు రోజ్‌ వాటర్‌ కలిపి చేతులకి మసాజ్‌ చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి.

  • రాత్రి పడుకోబోయే ముందు చేతులకి బేబీ ఆయిల్‌ పూసి మృదువుగా మసాజ్‌ చేస్తే చేతులు కోమలంగా ఉంటాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement