Shiny
-
చేతులు రఫ్‌గా ఉన్నాయా? ఇదిగో అద్భుతమైన చిట్కా
కొంతమందికి చేతులు, మోచేతులు నల్లగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో కొన్ని రకాల డ్రెస్సులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో మీచేతులు అందంగా, మృదువుగా, మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.పులిసిన పెరుగుపైన ఉండే మీగడ తీసుకుని చేతులకి మసాజ్ చే స్తూ ఉంటే చేతులు మృదువుగా ఉంటాయి. పెట్రోలియమ్ జెల్లీతో కూడా మసాజ్ చేసుకోవచ్చు.ఆలివ్ ఆయిల్ ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా, గ్లిజరిన్ ఒక చెంచా, గోధుమరవ్వ రెండు చెంచాలు, ΄ాలు ఒక చెంచా కలిపి చేతులకి రాసుకుని గంట తర్వాత వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.స్పూను దానిమ్మరసం, స్పూను టొమోటో గుజ్జు కలిపి దానిలో కొన్ని గ్లిజరిన్ చుక్కలు కలిపి చేతులకి పట్టించి ఒక గంట అయిన తర్వాత కడుక్కుంటే చేతులు చక్కగా మెరుస్తాయి. రెండు స్పూన్ల దానిమ్మరసంలో స్పూను పంచదార కలిపి చక్కెర కరిగిన తర్వాత చేతులకి పట్టించి నెమ్మదిగా మసాజ్ చేస్తే చేతులు నున్నగా ఉంటాయి.చెంచా బాదం పొడిలో తగినన్ని పాలు కలిపి పేస్ట్ చేసుకొని చేతులకి రాసుకొని ΄ావుగంట తర్వాత కడుక్కోవాలి.నారింజ రసం రెండు చెంచాలు, తేనె రెండు చెంచాలు కలిపి చేతులకి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత వేడి నీటితో కడుక్కోవాలి.రెండు చెంచాలు గ్లిజరిన్, రెండున్నర చెంచాలు రోజ్ వాటర్ కలిపి చేతులకి మసాజ్ చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు చేతులకి బేబీ ఆయిల్ పూసి మృదువుగా మసాజ్ చేస్తే చేతులు కోమలంగా ఉంటాయి. -
కన్నీళ్లు మిగిల్చిన వేడినీళ్లు
చలిగాలి వీచినా.. ఎండ పొడ తాకినా.. తట్టుకోలేని వయసది. అమ్మ ఒడిలో ఒదిగిపోయే ప్రాయమది. రంగుల ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడే చిన్ని మనస్తత్వమది. ‘అమ్మా.. నాన్న’ ఈ రెండు పదాలు తప్ప వేరే ప్రపంచమే తెలియని చిన్ని లోకమది. ఆ లోకాన్నే ‘మా లోకం’ అని బతుకుతున్నారు తల్లిదండ్రులు. ఆ బుజ్జాయి జ్ఞాపకాల్ని కడుపులో దాచుకున్న అమ్మ.. ఆ బుజ్జి పలికిన పదాలు మనసులో మననం చేసుకున్న నాన్న. ఆ చిన్నారి షైనీ రాకతో జీవితం ‘షైన్’ అయిందనుకున్నారు. ఆ చిన్నారి స్నానానికి పెట్టిన వేడినీళ్లు.. జీవితాంతం కన్నీళ్లను మిగుల్చుతాయని అస్సలు అనుకోలేదు. హసన్‌పర్తి: మండలంలోని సీతంపేటకు చెందిన బండారి అశోక్, సుజాత దంపతుల కూతురు షైనీ(3) వేడి నీళ్లలో పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. నవంబర్ 27న షైనీ స్నానం కోసమని తల్లి సుజాత ఇంటి ఆవరణలో హీటర్ పెట్టింది. నీళ్లు బాగా వేడి అయ్యాయని హీటర్ ఆఫ్ చేసింది. ఆ తర్వాత సుజాత వంట పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో షైనీ ఆడుకుంటూ బకెట్‌ను సమీపించింది. తప్పటడుగులేసుకుంటూ బకెట్‌ను తాకింది. ఒక్కసారిగా వేడి నీళ్లు పడడంతో గట్టిగా ఏడ్చింది. తల్లి వచ్చి చూసే సరికి షైనీ ఒళ్లు ఎర్రగా మారింది. ఏడుస్తున్న కూతురుని ఎంజీఎంకు తరలించారు. వైద్యులు వారం రోజులు చికిత్స అందించారు. శనివారం చికిత్స పొందుతున్న షైనీ మృతి చెందింది. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) ఎమ్మెల్యే పరామర్శ బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరామర్శించారు. çఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ జనగాం శరత్, ఎంపీటీసీ సభ్యురాలు బండారి రజిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, టీఆర్ఎస్ నాయకులు చేరాలు, తిరుపతి, పీఏసీఎస్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, ఉపసర్పంచ్ భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలన వైపు పరుగు!
సమీక్షలతో కలెక్టర్, ఎస్పీ, జేసీ బిజీబీజీ విధుల్లో నిమగ్నమైన జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునే యత్నం ప్రజలతో సందడిగా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా ఉన్నతాధికారులు పాలనను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారు. కలెక్టర్ రజత్‌కుమార్ షైని, ఎస్పీ విజయ్‌కుమార్, జేసీ సంగీత అధికారులతో గంటలపాటు సమీక్ష సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తద్వారా సంక్షేమపథకాల అమలు, ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లాను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. విజయదశమిరోజున కొత్త జిల్లాకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. దసరా, మొహర్రం పండగలు వరుసగా రావడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ బోసిపోయి కనిపించాయి. కాగా, గురువారం ఉదయం నుంచి అన్ని కార్యాలయాలు అధికారులు, సిబ్బందితో హడావుడితో సందడిగా కనిపించింది. గ్రామీణ, పట్టణ ప్రజలు సైతం వ్యక్తిగత పనుల మీద జిల్లా కార్యాలయాలకు తరలిరావడం కనిపించింది. పలువురు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజల రాకపోకలతో సందడిగా మారింది. కలెక్టర్ రజత్‌కుమార్ షైని, జాయింట్ కలెక్టర్ సంగీతలు వేర్వేరుగా అధికారులతో సమీక్షలు నిర్వహించి బిజీబిజీగా గడిపారు. జాయింట్ కలెక్టర్ సంగీత డివిజన్ పరిధిలోని తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రజత్‌కుమార్‌షైని జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లా నయాపాలనపై కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీ కార్యాలయంలో సందడి అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ హడావుడి నెలకొంది. ఉదయమే డీఐజీ అకున్‌సబర్వాల్ జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు పోలీసు సాయుధ బలగాల కార్యాలయాన్ని పరిశీలించి వెళ్లారు. దీంతో పోలీసు అధికారులు ఉరుకులు, పరుగులతో విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఐజీ అకున్ సబర్వాల్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నాంది పలికారు. అనంతరం ఎస్పీ విజయ్‌కుమార్ జిల్లా పరిధిలోని ఎస్ఐలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న క్షేత్రస్థాయి సమస్యలు, నేర సమాచారాన్ని తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు తీసుకోవాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. త్వరలోనే గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తామని మౌఖికంగా ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీరితో పాటు డీఎంఅండ్‌హెచ్‌ఓ కృష్ణ సిబ్బందితో సమీక్షలు నిర్వహించి అంటురోగాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఇలా అధికారులు ఎవరికి వారు ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. జిల్లా కార్యాలయాలు, అధికారులు ప్రజల ముంగిట్లోకి రావడంతో ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శక పాలన అందడంతో పాటు సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.