Tea Water for Hair: జుట్టు రాలడం చాలా సహజమైనదే. అయితే ఎప్పడికప్పుడు కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. జుట్టు రాలిన విషయంమనకు తెలియకుండానే ఈప్రక్రియ జరిగిపోతుంది.అయితే అకారణంగా, చాలా ఎక్కువగా జుట్టురాలిపోవడం ఆందోలన కలిగించే అంశం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవడానికి లెక్కలేనన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన పద్ధతులను ఎంచుకోవడం మంచిది.
అలాంటి వాటిట్లో ఒకటి టీ నీటితో జుట్టును కడగడం. యాంటీఆక్సిడెంట్లు , పోషకాలతో సమృద్ధిగా ఉన్న టీ, జుట్టును బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మాడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి దీని తయారీ, ఎలా ఉపయోగించాలో చూద్దాం.
టీ వాటర్ ఎలా తయారు చేయాలి
హెయిర్ వాష్ కోసం టీ వాటర్ ను తయారు చేయడం చాలా సులభం
కావాల్సిన పదార్థాలు:
2–3 టీ బ్యాగులు (బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ)
2–3 కప్పుల నీరు
కావాలంటే ఇందులో
లావెండర్ లేదా రోజ్‌మేరీ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు.
ఎలా తయారు చేయాలి? ఎలావాడాలి?
- నీటిని మరిగించి, అందులో టీ బ్యాగులను 5–10 నిమిషాలు నానబెట్టాలి.
- ఇందులో కొద్దిగా లావెండర్, రోజ్‌మేరీ ఆయిల్ చుక్కలు కలపాలి.
- చల్లారిన తరువాత టీ నీటిని శుభ్రమైన స్ప్రే బాటిల్ లేదా కంటైనర్‌లో పోసుకోవాలి.
- ఇపుడు తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును శుభ్రంగా వాష్ చేయాలి.
- షాంపూ చేసిన తర్వాత జుట్టుంతా తడిచేలా స్ప్రే చేయాలి.
- తర్వాత 5–10 నిమిషాలు పాటు చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి.
- 15-20 నిమిషాలు పాటు ఉంచుకుని సాధారణ నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.
ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
ప్రయోజనాలు
- జుట్టు సిల్కీగాఅవుతుంది. కొత్త మెరుపువస్తుంది.
- జుట్టు రాలడం తగ్గుతుంది, యాంటీఆక్సిడెంట్లు ,కెఫిన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
- మాడు ఆరోగ్యానికి కూడా మంచిది. చుండ్రు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయి.
- టీ వాటర్ జుట్టు క్యూటికల్‌ను మూసివేస్తుంది.కెఫిన్ కారణంగా రక్త ప్రసరణ బాగా జరిగిన జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది.
- హెయిర్ ఫోలికల్స్ ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
- డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఇది ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ ప్రక్రియ చాలామంచిది.
- జుట్టు చిట్లడం అనే సమస్యను కూడా దూరం చేస్తాయి.
ఇదీ చదవండి : Sankranti 2025: పండక కళ, పేస్ గ్లో కోసం ఇలా చేయండి!
Comments
Please login to add a commentAdd a comment