Hair Falling
-
జుట్టుకు జింజర్ ఆయిల్.. షాంపూతో అల్లం రసం కలపొచ్చా?
అల్లంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జుట్టుకు అల్లం రసాన్ని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా తలలో దురద, తీవ్రమైన చుండ్రు సమస్యలకు చికిత్స చేయడంలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అల్లం జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది. తద్వారా వెంట్రుకల కుదుళ్లు ఉత్తేజితమై జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అల్లంలో జింజరోల్, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల జుట్టు రాలడాన్ని నివారించడంతోబాటు జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే జింజర్ ఆయిల్‌ను వాడవచ్చు. మీ షాంపూతో అల్లం రసం కలపవచ్చు. లేదా అల్లం ఆధారిత షాంపూని ఉపయోగించవచ్చు. నూనెతో పాటు అల్లం రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. మీ హెయిర్ మాస్క్‌లకు అల్లం కూడా జోడించవచ్చు. (క్లిక్ చేయండి: డిజిటల్ అడిక్షన్‌ను గుర్తించడమెలా?) -
Hair Care: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా!
జడ ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకోని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ.. ఆధునిక జీవనశైలి, విపరీతమైన కాలుష్యం, సరైన పోషణ లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు రాలే సమస్య వేధిస్తోంది చాలా మందిని. అలా కాకుండా కేశాలు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. అల్లం, ఆవాలు, లవంగాలతో.. ►అల్లం తురుము టేబుల్ స్పును, టీస్పూను ఆవాలు, ఐదు లవంగాలను తీసుకుని ఒక కాటన్ వస్త్రంలో మూటకట్టాలి. ►మీరు వాడుతోన్న హెయిర్ ఆయిల్‌ను గాజు సీసాలో పోసి, దానిలో ఈ మూటను మునిగేటట్లు పెట్టాలి. ►ఒకరోజంతా సీసాను ఎండలో ఉంచాలి. ►మరుసటిరోజు ఈ నూనెను తలకు పట్టించి మర్దన చేయాలి. ►ఒకరోజంతా ఉంచుకుని తరువాతిరోజు తలస్నానం చేయాలి. ►ఇలా వారానికి ఒకసారి ఈ అయిల్ను తలకు పట్టించడం ద్వారా జుట్టురాలడం తగ్గి, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ►నూనె అయిపోయిన తరువాత మొదట చెప్పుకున్నట్లుగానే తాజాగా తయారు చేసుకుని వాడితే పదిహేను రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. చదవండి: Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే! ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! -
కూతురి జుట్టు ఊడిపోవడం చూసి... ఇంటర్నెట్లో వెదికి.. వృద్ధ దంపతులు..
ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడూ ఏదోఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటిని ఎదిరించి నిలబడి పోరాడేవాళ్లే ముందుకు సాగగలుగుతారు. కొంతమంది సమస్యను కూకటివేళ్లతో పెకిలించి భవిష్యత్ తరాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఓ వృద్ధజంట ఈ జాబితాలో నిలిచారు. తమ కూతురికి వచ్చిన సమస్యను వేర్లతో సహా పీకేయడానికి ఎనభై ఏళ్ల వయసులో ఈ జంట నడుం బిగించి, ఏకంగా హెయిర్ ఆయిల్ స్టార్టప్‌ను ప్రారంభించి ఔరా అనిపిస్తోంది. ‘‘మీలో శక్తి ఉంటే వయసు గురించి ఆలోచించకండి. మీకిష్టమైన దానిని సాధించే వరకు పోరాడండి’’ అని చెబుతున్నారు సూరత్‌కు చెందిన రాధాకృష్ణ, శకుంతలా చౌదరి దంపతులు. దాదాపు యాభైఏళ్లపాటు కుటుంబ వ్యాపారాలు చూసుకుని 2010లో రిటైర్ అయ్యారు ఈ ఇద్దరు. ఈ వయసులో వీరికి ఏమాత్రం ఓపిక తగ్గలేదు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా.. సమస్యకు సై అని సవాలు విసురుతూ పరిష్కారం చూపుతున్నారు. ఈ చౌదరి దంపతుల కూతురి జుట్టు బాగా ఊడిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం మాత్రం తగ్గలేదు. దీంతో తన బాధను తల్లిదండ్రుల దగ్గర వెళ్లబోసుకుంది. కూతురి బాధను చూడలేని ఆ దంపతులు అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దానికి గల కారణాలు ఏంటీ? అని ఏడాదిపాటు నెట్లో వెదికారు. వెదుకులాటలో అనేక అధ్యయనాలు, పరిశోధన పత్రాలు లోతుగా అధ్యయనం చేయగా... ‘‘పురుషులలో అయితే డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉండడవల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది’’ అని గ్రహించారు. ఈ రెండు హార్మోన్లను సక్రమంగా పనిచేయించే పదార్థాల కోసం ఇంటర్నెట్ను క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. వారు దొరికిన సమాచారంతో... వారే ఒక సరికొత్త ఆయిల్‌ను తయారు చేయడానికి పూనుకున్నారు. యాభై రకాలతో... అనేక పరిశోధనల తరువాత ఈ వృద్ధ జంట యాభై రకాల మూలికలు, కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆలివ్, ఆముదంలను ఉపయోగించి కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో హెయిర్ అయిల్ను రూపొందించింది. వీటన్నింటిని కలిపి ఆయిల్ తయారు చేసిన వీరు..తమ కూతురుకిచ్చి వాడమన్నారు. ఆ ఆయిల్ వాడిన దగ్గర నుంచి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం కనిపించింది. దీంతో తాము రూపొందించిన ఆయిల్ బాగా పనిచేస్తుందని అర్థమైంది చౌదరి దంపతులకు. ఆ తరువాత బంధువులు, స్నేహితులు కొంతమందికి ఆయిల్ ఇచ్చి వాడమన్నారు. వాడిన వారందరికి మంచి ఫలితం కనిపించింది. అవిమీ... మూడు నెలలపాటు ఆయిల్‌ను పరీక్షించి, ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో అవిమీ హెర్బల్ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. అవిమీ ద్వారా ఎంతో నాణ్యమైన నూనెను విక్రయిస్తూ ఎంతోమంది జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఈ దంపతులు. ఇదేగాక ఆర్థో ఆయిల్, స్ప్రేలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మలివయసులోనూ ఇంత బాగా ఆలోచించి సమస్యకు చక్కని పరిష్కారం చూపి ఎంతోమంది యువతరానికి ప్రేరణ ఇవ్వడమేగాక, చిన్నపెద్దా అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ జంట. గమనిక: ఈ వృద్ధ జంట ప్రయత్నాన్ని ఒక స్ఫూర్తిదాయక కథనంగా మాత్రమే అందించడం జరిగింది. చదవండి👉🏾Youtube Village: ఘుమఘుమలాడే బిర్యానీ, చేపలు సులభంగా ఎలా పట్టాలి? వీటన్నింటికీ సమాధానం! -
జుట్టు రాలుతోందా...? అరికట్టండిలా..!
మీ జుట్టు రాలిపోతోందా? ఆందోళన పడకండి... ఈ కింద పేర్కొన్న అంశాలను తెలుసుకొని, సూచించిన జాగ్రత్తలను పాటించండి. మంచి జుట్టు కోసం ముఖ్యంగా మూడు అంశాలు అవసరం. అవి... జింక్, ఐరన్, విటమిన్–సి. ఈ మూడూ పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలిపోవడాన్ని చాలావరకు అరికట్టవచ్చు. ఐరన్ కోసం మనకు ఐరన్ సమృద్ధిగా అందాలంటే... గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి తీసుకోవాలి. మాంసాహారంలోనూ... కాలేయం, కిడ్నీల వల్ల ఐరన్ ఎక్కువగా సమకూరుతుంది. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ. అందుకే ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. విటమిన్–సి కోసం ఆహార పదార్థాలన్నింటిలోనూ ఉసిరిలో విటమిన్–సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జింక్ కోసం గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ గట్టిగా సిఫార్సు చేస్తోంది.జింక్‌కు గుమ్మడి గింజలు మంచి వనరు. దానితో పాటు సీఫుడ్, డార్క్‌చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలోనూ జింక్ ఎక్కువే. పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. మీరు తినే సమతులాహారంలో ఇవి తీసుకుంటూనే... జుటు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయండి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. అప్పటికీ జుట్టు రాలుతుంటే మాత్రం... ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యతతో జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఆహారం ద్వారానే ఈ సమస్యను అధిగమించాలనుకుంటే మీ డైట్లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చేసుకొండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే ఓసారి ట్రైకాలజిస్ట్ / డర్మటాలజిస్ట్‌ను కలవండి. -
టెన్ డేస్ హెయిర్ ఆయిల్ పేరిట మోసం
విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణ): టెన్ డేస్ హెయిర్ ఆయిల్ పేరిట రూ.64వేలు మోసపోయిన ఘటనపై మంగâళవారం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సైబర్ క్రైం సీఐ వి.గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం... నగరంలో పాండురంగాపురం ప్రాంతానికి చెందిన జి.దుర్గాప్రసాద్ కొద్ది రోజుల క్రింతం ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాడు. టెన్ డేస్ హెయిర్ ఆయిల్ ప్రొడక్టును క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల తరువాత ఆయనకు 9831534208 నంబరు నుంచి ఫోన్‌చేసి... టెన్‌డేస్ హెయిర్ ఆయిల్ కొన్నందుకు రూ.12.80లక్షలు బహుమతి వచ్చిందని, దానిని క్లెయిమ్ చేసుకునేందుకు మీ బ్యాంకు అకౌంట్ నంబరును పంపమని కోరడంతో అతను అకౌంట్ నంబర్‌ను పంపించాడు. తరువాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు పంపినట్లు ఒక మెసేజ్ రూ.12.80లక్షలు హోల్డ్‌లో ఉన్నాయని, దానిని క్లెయిమ్ చేసుకునేందుకు కొంత సొమ్ము కట్టాలని చెప్పడంతో దుర్గాప్రసాద్ పలు విడతల్లో రూ.64వేలు డిపాజిట్ చేశాడు. డబ్బులు క్లెయిమ్ చేయాలంటే మరికొంత డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పటంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆన్లైన్లో కనిపించే యాడ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ గోపీనాథ్ సూచించారు. -
జుట్టు రాలిపోతోందని టెకీ ఆత్మహత్య!
సాక్షి, మధురైః ప్రస్తుతం మనిషి ఏ చిన్న సమష్యను అధిగమించలేక పోతున్నాడు. టెక్నాలజీ యుగంలో కూడా జుట్టు రాలిపోతుందని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ విషాద ఘటన తమిళనాడులోని మధురైలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. అతని పేరు ఆర్.మిథున్ రాజ్. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా అతడు హేర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అతను కొన్ని రోజులుగా డిప్రెషన్‌కి లోనయ్యాడు. ఈ విషయాన్ని మధురైలోని జైహిందూపురంలో ఉండే తన తల్లి వాసంతికి పదే పదే చెబుతుండేవాడు. కొడుకుకి పెళ్లి చేయాలని ఆమె ఎన్ని సంబంధాలు చూసినా.. ఫలితం లేదు. దీంతో మిథున్ మరింత కుంగిపోయాడు. ఈ మధ్య ఉద్యోగానికి సెలవు పెట్టి మధురైకి వచ్చాడు. వాసంతి ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకున్నాడు. స్థానికుల సాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించినా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. -
జుట్టును రాల్చేసే స్ట్రెస్
మనిషి నిత్యం శారీరక లేదా మానసిక ఒత్తిళ్లకు (స్ట్రెస్)కు లోనవుతున్నప్పుడు జుట్టు రాలిపోవడం చాలా సాధారణంగా జరిగే పరిణామం. మనం బాగా ఒత్తిడికి (స్ట్రెస్‌కు) గురైనప్పుడు మనలో స్రవించే హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి అది జుట్టును రాల్చేలా చేస్తుంది. అంతేకాదు... మనం శారీరకంగా జబ్బుపడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో స్ట్రెస్ కూడా అలాంటి భౌతికమైన మార్పులు కలిగేలా చేసి, జుట్టును రాలిపోయేలా చేస్తుంది. స్ట్రెస్‌తో లేదా శారీరకంగా కలిగే జబ్బుల వల్ల జుట్టు రాలడం అన్నది... జుట్టు రాలడం నుంచి మళ్లీ పెరగడం వరకు జరిగే ‘జుట్టు సైకిల్’లో ఒకటైన ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అనే దశ కారణంగా సంభవించే పరిణామం. ఈ టిలోజెన్ ఎఫ్లూవియమ్ దశలో వెంట్రుక ఫాలికిల్ పూర్తిగా విశ్రాంతి దశలోకి వెళ్తుంది. అందుకే ఈ దశలో జుట్టు రాలి మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. అందుకే జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు, తాము ఏ కారణంగానైనా ఒత్తిడికి లోనవుతున్నారేమో గమనించి, దాన్ని దూరం చేసుకోవాలి. ఒత్తిడి తొలగగానే మళ్లీ జుట్టు మామూలుగానే వస్తుంది. -
కేశ సౌందర్యం
బ్యూటిప్స్ కేశాలకు తగినంత పోషణ, నూనె లేనప్పుడు నిర్జీవంగా మారుతాయి. వీటికి తోడు కేశాలకు ఎక్కువ వేడి తగులుతున్నట్లయితే చివర్లు చిట్లుతాయి. ఈ స్ల్పిట్స్ పోవాలంటే కనీసం నెలకు ఒక రోజు చిట్లిన చివర్లను కత్తిరించుకోవాలి. గోరు వెచ్చని నూనె పట్టించి మర్దన చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత వీలయినంత వరకు హెయిర్ డ్రైయర్లు వాడకపోవడమే మంచిది. రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూను ఆముదాన్ని గోరువెచ్చగా చేసి తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించి, ఉదయం తలస్నానం చేస్తుంటే కేశాలు తుమ్మెద రెక్కల్లా మారుతాయి. ఒక టీ స్పూను ఆముదం, అంతే మోతాదులో ఆవనూనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి మర్దన చేసి జుట్టుకంతటికీ చివరి వరకు పట్టించాలి. తరువాత వేడినీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేస్తుంటే చుండ్రు బాధించదు. ఆలివ్ ఆయిల్ చక్కటి హెయిర్ కండిషనర్. ఒక టేబుల్ స్పూను గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే పొడిబారిన కేశాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. ఏ హెయిర్ స్టయిల్ వేసుకోవాలన్నా సాధ్యమవుతుంది. జుట్టు చక్కగా అమరుతుంది. కేశాలు పొడిబారుతుంటే మందార ఆకులను రుబ్బి తలకు ప్యాక్ వేసి తలస్నానం చేయాలి. కరివేపాకులను కాని వాటి రసాన్ని కాని కొబ్బరి నూనెలో వేసి మరిగించి తలకు పెట్టుకుంటే జుట్టు నల్లబడుతుంది. తలస్నానం చేయడానికి ముందు రోజు రాత్రి తాజా కరివేపాకు రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. ఇది జుట్టును నల్లబరచడంతోపాటు జుట్టు కుదుళ్లను పటిష్టం చేస్తుంది. దీంతో హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది. ఆవు పాల వెన్న వాడుతుంటే జుట్టు నల్లబడుతుంది. ప్రతి రోజూ కొద్దిగా ఆవు వెన్నను భోజనంలో తీసుకుంటూ వారానికి రెండు సార్లు వెన్నతో తలకు మసాజ్ చేసుకుంటుండాలి.