విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణ): టెన్ డేస్ హెయిర్ ఆయిల్ పేరిట రూ.64వేలు మోసపోయిన ఘటనపై మంగâళవారం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సైబర్ క్రైం సీఐ వి.గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం... నగరంలో పాండురంగాపురం ప్రాంతానికి చెందిన జి.దుర్గాప్రసాద్ కొద్ది రోజుల క్రింతం ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూశాడు. టెన్ డేస్ హెయిర్ ఆయిల్ ప్రొడక్టును క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల తరువాత ఆయనకు 9831534208 నంబరు నుంచి ఫోన్‌చేసి... టెన్‌డేస్ హెయిర్ ఆయిల్ కొన్నందుకు రూ.12.80లక్షలు బహుమతి వచ్చిందని, దానిని క్లెయిమ్ చేసుకునేందుకు మీ బ్యాంకు అకౌంట్ నంబరును పంపమని కోరడంతో అతను అకౌంట్ నంబర్‌ను పంపించాడు.
తరువాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు పంపినట్లు ఒక మెసేజ్ రూ.12.80లక్షలు హోల్డ్‌లో ఉన్నాయని, దానిని క్లెయిమ్ చేసుకునేందుకు కొంత సొమ్ము కట్టాలని చెప్పడంతో దుర్గాప్రసాద్ పలు విడతల్లో రూ.64వేలు డిపాజిట్ చేశాడు. డబ్బులు క్లెయిమ్ చేయాలంటే మరికొంత డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పటంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆన్‌లైన్‌లో కనిపించే యాడ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ గోపీనాథ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment